గుడికి వెళ్ళడం కాదు
-రవీంద్రనాథ్ టాగూర్
అనువాదం : రాఘవ శర్మ
భగవంతుడి పాదాల మీద
పూలు చల్లడానికి
గుడికి వెళ్ళడం కాదు
ముందు నీ ఇంటిని
ప్రేమ, దయ పరిమళాలతో నింపు
దీపం పెట్టడానికి
గుడికి వెళ్ళడం కాదు,
భగవంతుడి హోమగుండం ముందు
నీ హృదయం నుంచి పాపాల చీకటిని,
అహాన్ని, అహంకారాన్ని తొలగించుకో
గుడికి వెళ్ళి తల ఒంచి ప్రార్థించడం కాదు,
నీ తోటి వారి వినయానికి తలవంచు
వారి పట్ల నీవు చేసిన తప్పులకు క్షమాపణ కోరు
గుడికి వెళ్ళి మోకాళ్ళపైన ఒంగి ప్రార్థించడం కాదు ,
అట్టడుగున ఉన్న వారిని లేపి
వారిని నిలబెట్టడానికి ఒంగు
యువతరాన్ని నాశనంచేయడం కాదు,
వారిని బలబపరుచు
చేసిన పాపాలను పరిహరించమని
గుడికి వెళ్ళడం కాదు,
నిన్ను ఇబ్బంది పెట్టిన వారి తప్పులను
నీ మనసునుంచి తొలగించుకో
(Go not to the temple by Rabindranath Tagore కి తెలుగు రూపం)
(రాఘవ శర్మ సీనియర్ జర్నలిస్ట్, రచయిత, కవి, తిరుపతి)