హుజురాబాద్ ప్రజలకు ఈటల విజ్ఞప్తి

హుజురాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ విజ్ఞప్తి :

*ప్రగతి భవన్ కేంద్రంగా ముఖ్యమంత్రి ఆలోచనలో భాగంగానే హుజురాబాద్లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

*మనం ఈ నీచపు కుట్రలను, కెసిఆర్ బానిసల ఎత్తులను తిప్పి కొట్టాల్సిన అవసరముంది.*

మీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇప్పటికే కేసీఆర్ గారు హుజురాబాద్ ప్రజల మీద కక్షగట్టి, మీ బిడ్డ అయినా నా మీద కక్షకట్టి 2018 లోనే  నన్ను ఓడించేందుకు.. నాకు వ్యతిరేకంగా నిలబడ్డ వారికి డబ్బులు ఇచ్చారు. నా ఇళ్ళమీద రైడింగ్ చేయించారు. డబ్బులు ఇచ్చి కొంతమందితో నామీద కంప్లైంట్ చేయించి, పోస్టర్లు వేయించి.. నా వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు.

రాజీనామా చేసిన తర్వాత కనీవినీ ఎరుగుని రీతిలో వందల కోట్ల రూపాయలు పంచి, మద్యం ఏరులై పారించి, ప్రతి కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేయించి, మఫ్టీలో  ఉన్న పోలీసుల చేత బెదిరించినా.. ఎంత అల్ల కల్లోలం సృష్టించినా కూడా బెదిరకుంటా మీరంతా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించారు.  ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలు హుజురాబాద్ వైపు  ఎదురుచూస్తున్నారు వారి గౌరవం నిలబెట్టాలని నన్ను గెలిపించి పంపించారు.

గెలిచిన తర్వాత కనీసం ఎమ్మెల్యే అనే గుర్తింపు లేకుండా చేశారు కెసిఆర్. తెలంగాణ ప్రజల పక్షాన సమస్యలు లేవనెత్తాలనీ అసెంబ్లీలో మాట్లాడదామంటే.. అసెంబ్లీ నుంచి కూడా గెంటివేశారు. మీరు గెలిపిస్తే నేను తీసుకుంటానా అని ప్రజాభిప్రాయాన్ని కాలరాసి నన్ను బయటకి పంపించారు.

*నేను మీ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గాన్ని, కేసీఆర్ కుట్రలను, కేసీఆర్ నియంత్రత్వ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ఇచ్చిన ధైర్యంతో ముందుకు పోతుంటే.. నామీద కుట్రలు చేస్తున్నారు.

*ప్రశాంతమైన హుజురాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు..

*ఆనాడు మానుకోట ఉద్యమంలో ఉద్యమకారుల మీద రాళ్లు వేయించిన, జిప్పులు తీసి చూపించిన సైకోలకు ఎమ్మెల్సీ ఇచ్చి మన మీద రుద్ది రకరకాల చిల్లర పనులు ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు.

*ప్రగతి భవన్ కేంద్రంగా ముఖ్యమంత్రి ఆలోచనలో భాగంగానే హుజురాబాద్లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

*మనం ఈ నీచపు కుట్రలను, కెసిఆర్ బానిసల ఎత్తులను తిప్పి కొట్టాల్సిన అవసరముంది.

*కేసీఆర్ ఆయన బానిసలు ఉంటారు పోతారు కానీ ప్రజలు మాత్రం శాశ్వతం.  హుజురాబాద్ గడ్డమీద ఏనాడూ కొంచెం కూడా అల్లరి లేకుండా కలిసిమెలిసి ఉండే భాగ్యం 20 ఏళ్లుగా మనకి దక్కింది. దీన్ని చూసి ఓర్వలేని కెసిఆర్ మన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

దమ్ముంటే సమస్యల మీద మాట్లాడండి తప్ప రండలాగా, శిఖండిలాగా, దొడ్డి దారిన యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దమ్ముంటే నేరుగా యుద్ధం చేయండి.
నేను చేసిన సవాలు స్వీకరించండి.

*గజ్వేల్ లో కొట్లాడుదామా?  హుజురాబాద్లో కొట్లాడుదామా? రండి.

దమ్ముంటే సవాలు స్వీకరించి రావాలి తప్ప చిల్లర మల్లర పనులు చేసి అల్లరి చేసే ప్రయత్నం చేసే ఖబర్దార్.

హుజురాబాద్ ప్రజలారా..హుజురాబాద్లో ఉన్న ప్రజాప్రతినిధులారా వారు చేసే కుట్రలో మనం భాగం పంచుకోవద్దు,  బలి కావద్దు అని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

*మేము తలుచుకుంటే పొలిమేరల దాకా తరిమి కొట్టే శక్తి ఉంది.

కానీ నియోజకవర్గం బాగును, ప్రశాంతత కోరుకునే వాళ్ళం.. ఐక్యతను కోరుకునే వాళ్ళం కాబట్టి చిల్లర మాటలు నమ్మి అనవసరంగా రెచ్చిపోవద్దని మనవి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *