నాన్సీ పెలోసీ  తైవాన్ యాత్ర అందరికీ ముప్పే

డాక్టర్. యస్. జతిన్ కుమార్

అమెరికా ఫెడరల్ ప్రభుత్వ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆదివారం నాడు తన ఆసియా పర్యటనను ప్రారంభించారు. సింగ పూర్, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్ లలో ఆమె పర్యటిస్తారు. మంగళవారం 2-08-2022 న  ఆమె మలేషియాకు చేరుకున్నారు. ప్రస్తుతం అధికారిక ఆసియా పర్యటనలో ఉన్న పెలోసీ, తైవాన్లో ఆగి, అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్-వెన్ ను  బుధవారం కలుస్తారని మీడియా నివేదికలు తెలిపాయి – అలా అయితే, ఇది దశాబ్దాలుగా తైపీకి  వెళ్ళిన అత్యున్నత స్థాయి యుఎస్ పర్యటన అవుతుంది. ఇది బీజింగ్ తో ఉద్రిక్తతలను పెంచుతుంది. తైవాన్ చైనాలో అంతర్భాగం అయితే అది ఒక తిరుగుబాటు రాష్ట్రంగా వుండి పోయింది. రెండు ప్రాంతాల పునరేకీకరణకు చైనా ఓపికగా కృషి చేస్తోంది. ప్రపంచంలో తైవాన్ ను  ఒక  స్వాతంత్ర్య దేశం గా ఎవరూ గుర్తించడం లేదు. అమెరికా కూడా “ఒక చైనా” అనే భావనకే కట్టుబడి వుంది. కానీ  తైవాన్ లోని మైనారిటీ  తిరుగుబాటు దారులను దువ్వుతూ చైనాను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నది. చైనా భౌగోళిక సమగ్రత పట్ల ఎంతోకాలంగా తాను  అనుసరిస్తున్న అధికారిక విధానాలను కూడా ఇది భగ్నం చేస్తోంది.  తన అనుమతి లేని ఈ అధికారిక పర్యటన నేరుగా తన సార్వ భౌమాధికారాన్ని సవాలు చేయటమే అని జనచైనా ప్రభుత్వం భావిస్తోంది. ఇలాటి దుందుడుకు చర్యలతో స్థితిని చెడ గొట్ట వద్దని, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగ జార్చ వద్దని హితవు చెప్పింది. చివరకు చైనా ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది.  అయినా పెలోసీ, ఆమె ప్రతినిధి బృందంతో ఏమాత్రం లక్ష్య పెట్టకుండా తమ అహంకార పూరిత పర్యటనను కొనసాగిస్తున్నది. వారు వెళ్తున్న విమానం కట్టు దిట్టమైన భద్రత మధ్య వైమానిక దళ స్థావరంలో దిగిందని  జాతీయ వార్తా సంస్థ బెర్నామా తెలిపింది.

పెలోసీ పర్యటన నేపథ్యంలో చైనాతో యుద్ధానికి సిద్ధమవుతున్న తైవాన్ తన సైన్యాన్ని అప్రమత్తం చేసి అధికారులు, సైనికుల సెలవులు  రద్దు చేసింది. నివేదికల ప్రకారం, ఒక ఉన్నత స్థాయి సూచనల తరువాత సైన్యం వైమానిక రక్షణ దళాలను “యుద్ధానికి వెంటనే సిద్ధం కావాలని” సమాయత్తం చేసింది.

పెలోసి పర్యటనపై బీజింగ్ తీవ్రంగా స్పందించింది. అధ్యక్షుడు జో బైడెన్ కొరివితో ఆడుకుంటున్నాడని, ఫలితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. తైవాన్ జల సంధి లో ప్రత్యక్ష-ఫైర్ సైనిక విన్యాసాలను చేపట్టనున్నట్లు  ప్రకటించింది.  పెలోసీ పర్యటన చేస్తే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ”చూస్తూ కూర్చోదు” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక హెచ్చరికను పునరుద్ఘాటించారు. అయి తే  చైనా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఆయన వివరించలేదు.

ఒక ప్రభుత్వ అధినేత  ప్రపంచ భౌగోళిక రాజకీయ చదరంగం బోర్డుపై రెచ్చగొట్టే చర్యలు చేపట్టడం,  భారీ సంఖ్యలో  ప్రజల ప్రాణాలను పణంగా పెట్టటమే అవుతుంది. ఈ అధికార అహంకారం  హేయమైనది. నాన్సీ పెలోసీ తైవాన్ ను సందర్శించాలనే ప్రణాళిక ఆ కోవలోకే చెందుతుంది. ఆమె చర్యతో  చైనా-యునైటెడ్ స్టేట్స్ మధ్య సైనిక ఘర్షణకు అవకాశాలు పెరిగాయి.

25 ఏళ్లలో తైవాన్ ను సందర్శించిన మొదటి హౌస్ స్పీకర్ గా ఉండాలన్న పెలోసీ కోరిక కారణంగా, తైవాన్ పై , బీజింగ్-వాషింగ్టన్ ల మధ్య సుదీర్ఘకాలంగా మండుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు పెను జ్వాలలుగ మారుతున్నాయి. ఆమె ప్రయాణ ప్రణాళికలు ప్రారంభమైనప్పటికీ, చాలా మంది ఈ  పర్యటనను రద్దు చేయాలని కోరుకుంటున్నప్ప టికీ అధ్యక్షుడు బైడెన్ చాలా పిరికితనంతో  ప్రతిస్పందించారు. జరగబోయే పర్యటన గురించి, జూలై 20న  బైడెన్ మాట్లా డుతూ, “ఇది ప్రస్తుతం మంచి ఆలోచన కాదని మిలిటరీ భావిస్తోందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ పర్యటన వాస్తవ స్థితి ఏమిటో నాకు తెలియదు.”అన్నారు

బిడెన్ తన అధ్యక్ష పదవి హోదాలో, పెలోసీ తైవాన్ పర్యటనను తోసిపుచ్చి ఉండవచ్చు, కాని అతను అలా  చేయలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ, ఆయన పరిపాలనలోని ఎగువ ప్రా౦తాల్లో ఈ యాత్రకు విస్తృత౦గా వ్యతిరేకత ఉ౦దని వార్తలు వెలువడ్డాయి.

“తైవాన్ జలసంధి అంతటా ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉన్నందున జాతీయ భద్రతా సలహాదారు జేక్ షుల్లివాన్, ఇతర సీనియర్ జాతీయ భద్రతా మండలి అధికారులు ఈ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు” అని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.  “ఈ పర్యటనపై వివాదం వాషింగ్టన్ యొక్క మిత్రదేశాలలో ఆందోళనను రేకెత్తించింది, ఇది అమెరికా  చైనాల  మధ్య సంక్షోభాన్ని ప్రేరేపిస్తుందని అనేక విదేశాలు ఆందోళన చెందుతున్నాయి.”

పెలోసీ పర్యటన పరంగా అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ కు ఏమీ తెలియదని నొక్కి చెప్పిన అధికారులు, ఆవిడ బృందం తైవాన్ ద్వారా వెళ్తే మాత్రం, పెంటగాన్ యుద్ధ విమానాలను ఎస్కార్ట్ లుగా అందించాలని భావిస్తోందని వెల్లడించారు. అటువంటి రెచ్చగొట్టే ప్రమాదకర పర్యటనను స్పష్టంగా రద్దుచేయడానికి బిడన్ అయిష్టత చూపారు అంటే  చైనా పట్ల ఆయనది కూడా ఘర్షణాత్మక విధానం. ఆయన ప్రకటనలు తన కపట శైలిని ప్రతిబింబిస్తున్నాయి. .ఒక సంవత్సరం క్రితం-  “బిడెన్ తైవాన్ పాలసీ నిజంగా, లోతైన నిర్లక్ష్యం” శీర్షిక క్రింద, పీటర్ బీనార్ట్- బిడెన్ అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుండి  దీర్ఘకాలికంగా అమెరికా అనుసరిస్తున్న “వన్ చైనా” విధానాన్ని ఆయన  “ఛిన్నా భిన్నం” చేస్తున్నారని ఎత్తి చూపారు:  “1978 తరువాత తైవాన్ రాయబారికి తనపదవీ స్వీకారంలో  ఆతిథ్య మిచ్చి న మొదటి అమెరికన్ అధ్యక్షుడు బైడెన్.  తైవాన్  ప్రభుత్వంతో అధికారిక యు.ఎస్. సంబంధాలపై దశాబ్దాలుగా ఉన్న పరిమితులను సడలిస్తున్నట్లు ఏప్రిల్ లో ఆయన పరిపాలన ప్రకటించింది. ఈ విధానాలు విపత్కర యుద్ధం వైపు దారులు వేస్తున్నాయి. “యునైటెడ్ స్టేట్స్ మరియు తైవాన్ లు చైనా పునరేకీకరణపై అధికారికంగా తలుపులు మూసివేస్తే, బీజింగ్ బలప్రయోగం ద్వారా పునరేకీకరణను నెలకొల్పేఅవకాశం ఉంది.”

బీనార్ట్ ఇ౦కా ఇలా అ౦టున్నాడు: “తైవాన్ ప్రజలు తమ వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకోవడ౦, ఈ భూగోళ౦ మూడవ ప్రప౦చ యుద్ధాన్ని నివారించడం రెండూ  అత్య౦త ప్రాముఖ్యమైన విషయాలే. భూమిపై అత్యంత ప్రమాదకర మైన యుద్ధం ప్రజ్వరిల్లే అవకాశం వున్న ప్రదేశాల్లో ఒకటయిన తైవాన్ లో శాంతిని కాపాడటానికి సహాయపడిన ‘ఒకే చైనా’ అనే విధానాన్ని కొనసాగించడం అమెరికా ఆ లక్ష్యాలను సాధించడానికి ఉత్తమ మార్గం.”ఇప్పుడు, పెలోసీ,  తైవాన్ సందర్శన దిశగా అడుగు వేయడం “ఒకే చైనా” విధానంలో ఉద్దేశ్యపూర్వక ఉల్లంఘనకు  దారితీసింది. ఆ చర్యకు బైడెన్ యొక్క సమర్ధన వుందనేది తేట తెల్లమె.

చాలా మంది ప్రధాన మీడియా వ్యాఖ్యాతలు, చైనాను చాలా విమర్శించే వారైనప్పటికి , ఆమెరికాది  ప్రమాద కరమైన ధోరణి అని అంగీకరిస్తున్నారు. “బైడెన్ పరిపాలన మునుపటి కంటే చైనాపై మరింత కఠినంగా ఉండటానికి కట్టుబడి ఉంది” అని సంప్రదాయవాద చరిత్రకారుడు నియాల్ ఫెర్గూసన్ శుక్రవారం రాశారు. 2020 ఎన్నికల్లో మాదిరిగా, వైట్ హౌస్ లో లెక్కలు, చైనాపై కఠినంగా ఉండటం వల్ల ఓట్లు సాధించ గలమా  లేక ఏ చర్య నయినా,  ‘చైనాపై బలహీనంగా’ వున్నారని రిపబ్లిక్ పార్టీ  ప్రజలను నమ్మించితే  ఓట్లు కోల్పోతామా అనే అంశం  చుట్టూ తిరుగుతున్నాయని ఆయన అన్నారు. అయినప్పటికీ, దాని ఫలిత౦ ఒక క్రొత్త అ౦తర్జాతీయ స౦క్షోభానికి, ఆర్థిక  పర్యవసానాలకు దారులు తీస్తే   ఉ౦టే, ఈ లెక్కలు పనిచేస్తాయని నమ్మడం కష్ట౦.”

వాల్ స్ట్రీట్ జర్నల్, పెలోసీ స౦దర్శన “అమెరికా, చైనాల మధ్య తాత్కాలిక స౦బ౦ధాన్ని ఇంకా తగ్గి౦చే అవకాశ౦ ఉ౦ది” అని ప్రకటి౦చే శీర్షికతో ప్రస్తుత ప్రమాదకరమైన స్థితిని పరిచయం చేసింది.

దీని పర్యవసానాలు- కేవలం ఆర్థికమైనవి, దౌత్యపరమైనవి మాత్రమే కాకుండా- మానవాళి అస్తిత్వం పై ప్రశ్నగా  ఉండవచ్చు. చైనా అనేక వందల అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచగా, యునైటెడ్ స్టేట్స్ వద్ద అనేక వేల మారణా యుధాలు ఉన్నాయి. సైనిక సంఘర్షణ సంభావ్యత చాలా అధికమవుతోంది.

” ‘ఒకే చైనా’ విధానం మారలేదని మేము వాదిస్తూనే ఉన్నాము, కానీ పెలోసీ పర్యటన స్పష్టంగా  ఈ పూర్వాపరా లను మారుస్తుంది. అది కేవలం  ‘అనధికారిక సంబంధాలకు’  పరిమితమై వున్నట్లు భావించబడదు” అని  స్టేట్ డిపార్ట్మెంట్ లో  తూర్పు ఆసియా, పసిఫిక్ వ్యవహారాల మాజీ తాత్కాలిక సహాయ కార్యదర్శి సుసాన్ థార్న్టన్ అన్నారు. “ఒకవేళ ఆమె తైవాన్ వెళ్తే, చైనా ప్రతిస్ప౦ది౦చాల్సిన అవసర౦ ఉ౦డడ౦తో సంక్షోభ౦ తలెత్తే అవకాశ౦ ఎక్కువ గా ఉ౦టు౦ది.” అని కూడా ఆయన అన్నారు.

జర్మన్ మార్షల్ ఫండ్, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇనిస్టిట్యూట్లకు చె౦దిన ప్రధాన స్రవంతి విధాన విశ్లేషకులు న్యూయా ర్క్  టైమ్స్ లో “ఒక్క నిప్పురవ్వ ఈ దహనశీల పరిస్థితిని సైనిక సంఘర్షణకు దారితీసే సంక్షోభ౦గా ప్రేరేపి౦చగలదు . నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన ఆ విధమైన నిప్పురవ్వ కాగలదు” అని రాశారు. ప్రపంచలోని అనేకమంది ఈ పర్య టన ను వ్యతిరేకిస్తున్నా, ఆమెరికా సంయమనంతో వ్యవహరించాలని హితవు చెబుతున్నా అమెరికా మాత్రం వీటిని సరకు చేయటం లేదు. మూర్ఖంగాను, మొండిగాను  వ్యవహరిస్తూ, చైనాను రెచ్చగొట్టి యుద్ధ జ్వాలలు రగిలించటా ని కే పూనుకుంటున్నది.

బైడెన్ పచ్చజెండా ఊపి, పెలోసీ తైవాన్ పర్యటనను  ముందుకు సాగిస్తున్నారని బలమైన సంకేతాలతో జూలై ముగిసింది. ఈ రకమైన నాయకత్వం ప్రపంచ ప్రజానీకాన్ని మట్టు పెడుతుంది.

 

 

[ నార్మన్ సోలమన్ కౌంటర్ కరెంట్స్. ఆర్గ్ లో  01/08/2022 న రాసిన వ్యాసం సౌజన్యంతో]

 

[నార్మన్ సోలమన్ RootsAction.org సహ వ్యవస్థాపకుడు, జాతీయ సమన్వయకర్త. అతని పుస్తకాల్లో వార్ మేడ్ ఈజీ: హౌ ప్రెసిడెంట్స్ అండ్ పండిట్స్ కీప్ స్పిన్నింగ్ అస్ టు డెత్ (2006) మరియు మేడ్ లవ్, గాట్ వార్: క్లోజ్ ఎన్కౌంటర్స్ విత్ అమెరికాస్ వార్ఫేర్ స్టేట్” (2007) ఉన్నాయి.]

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *