24-7-2022 నాడు అనంతపురం ప్రెస్ క్లబ్ లో జరిగిన రాయలసీమ 3 వ రాష్ట్ర మహా సభల సంధర్భంగా ఆమోదించిన తీర్మానాలు.
1.శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలి.
2.తెలుగుగంగ తో సహా రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టు లను తక్షణమే పూర్తి చేయాలి.
3. విభజన చట్టంలో రాయలసీమ కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్యాకేజీ ఇవ్వాలి.( కోరాపుట్ – బోలంగిరి తరహాలా)
4. రాయలసీమ అసెంబ్లీ నియోజక వర్గాలను పునర్విభజన చేయాలి. కోస్తా ప్రాంతానికి సమానంగా ప్రజా ప్రతినిధుల సంఖ్యను పెంచాలి.
5. అత్యంత కరువు పీడిత అనంతపురం జిల్లాను వలసలు, రైతుల ఆత్మ హత్యలనుండి కాపాడటానికి తుంగభద్ర ఎగువ సమాంతర కాలువను నిర్మించాలి. హంద్రీ నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచాలి. చెరువులు,కుంటలు నింపి, ప్రతి ఎకరా పొలానికి నీరు అందివ్వాలి.
6.క్షామ పీడిత కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వేదవతిపై 16 TMC ల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మించాలి. RDS కుడి కాలువను తుంగభద్ర LLC ఆయకట్టు ల స్థిరీకరణ కు మర్ల మడికి తదితర నీటి పథకాలను తక్షణమే వినియోగం లోకి తేవాలి.
7. తుంగభద్ర వరద కాలువ ను కోసిగి దగ్గరి Melaganur నుండి ఆత్మకూర్ కొత్తపల్లి వరకు నిర్మించాలి.
8.శ్రీశైలం ప్రాజెక్ట్ పై వరద ప్రవాహ భారాన్ని తగ్గించి, పూడికను తగ్గించి, ప్రాజెక్ట్ ను కాపాడటానికి గాను 50 TMC ల సామర్థ్యం తో సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన స్ప్రింగ్ బ్రిడ్జి కి బదులుగా అలుగు తో కూడిన బ్యారేజిని నిర్మించాలి.
9. గుండ్రేవుల రిజర్వాయర్ ను నిర్మించి, K.C. కెనాల్ ఆయకట్టును స్థిరీకరించాలి.
10. రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించి, వలసలను నివారించడానికి గాను, ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రైవేట్ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలి. కడపలో ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగం లో ఏర్పాటు చేయాలి.
11. లేపాక్షిలో IT హబ్ ను ఏర్పాటు చేయాలి.
12. గుంతకల్ రైల్వే జోన్ ను తక్షణమే ఏర్పాటు చేయాలి.
13.రాయలసీమ నీటి పారుదల కు అవరోధంగా వున్న G.O. నంబర్ 69 ని తక్షణమే రద్దు చేయాలి.
14. కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలు లో ఏర్పాటు చేయాలి.
15. గాలేరు – నగరి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి, చిత్తూరు జిల్లాకు నీటి వనరులు కల్పించాలి.
16. రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం కలిగించే కుందూ నది విస్తరణ ఉత్తర్వులను నిలిపి వేయాలి. కర్నూలు – కడప జిల్లా లోని కుందూ పరివాహక రైతాంగ ప్రజల ప్రయోజనాలను కాపాడాలి.
17. దుమ్ముగూడెం – నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్ట్ ను నిర్మించాలి. తద్వారా గోదావరి నీటిని సాగర్ ఆయకట్టుకు ఉపయోగించి, కృష్ణా నది జలాలను రాయలసీమ, మరియు పాలమూరు ప్రాజెక్ట్ లకు వినియోగించాలి.
18. రాయలసీమ ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్న ( కడప లో, నల్లమల అడవుల్లో) యురేనియం త్రవ్వకాలు నిలిపి వేయాలి.
19.RTPS – రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ను పూర్తి సామర్థ్యం తో నడపాలి.
20. A.P. లైట్స్ పరిశ్రమ ను పునరుద్ధరించాలి.
21. హంద్రీ నీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలిగొండ, ముచ్చు మర్రి, గురు రాఘ వేంద్ర, సిద్దాపురం ఎత్తిపోతల పథకాలను అనుమతి గల ప్రాజెక్టు లుగా KRMB నోటిఫికేషన్ లో చేర్చాలి.
22. K.C. కెనాల్, తుంగభద్ర LLC, తెలుగుగంగ నీటి పంపిణీ కాలువలకు మరమత్తులు చేసి, ఆయకట్టును స్టీరికరించాలి.
__ అరుణ్, కన్వీనర్.
__ G.V. భాస్కర రెడ్డి, కో కన్వీనర్.