గుట్టల్లో, గుడారాల్లో పోలవరం నిర్వాసితులు!

ఊళ్ళు మునిగి…గూళ్ళు చెదిరి గుట్లల్లో, గుడారాల్లో పోలవరం నిర్వాసితులు!

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనా తీతం. సంవత్సరాల పాటు కాయ కష్టం చేసి, రూపాయి రూపాయి కూడబెట్టి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇండ్లు నీటమునిగాయి. అదొక్కటే అయితే ఫర్వాలేదు కానీ ఇంటి సామాన్లు, మంచాలు, కంచాలు, కుర్చీలు, ఫ్యాన్ లు, మోటార్ సైకిళ్ళు, ట్రాక్టర్ లు, ఫ్రిడ్జ్ లు చాలా కోల్పోయారు. ఇవి అందరికీ ఉండకపోవచ్చు, కానీ ఈ రోజు ల్లో అవి కనీస అవసరాలు గా మారాయి. కాబట్టి ఎవరి నోట విన్నా మా ఇంటి సామాను లు అక్కడే వదిలి కట్టు బట్టలు, దుప్పట్లు పట్టు కొని పిల్లా పాపలతో ఇక్కడకు వచ్చినమని వాపోతున్నారు. సుమారు 250 గ్రామాలూ మునిగిపోయాయి. మండలాల వారీగా పోలవరంలో 19, కుకునూరు 73, వేలేరు పాడు 36, చింతూరు 24, ఎటపాక 40, కూనవరం 78, వరా రామచంద్రా పురం 73 పూర్తిగా మునిగాయి.ప్రభుత్వం నుండి నాలుగు రోజులు పాటు ఏ విధమైన సహాయం అందక, తిండికి దూరమై, నిద్ర కరువై ఉన్నారు. కనీసం గుక్కెడు నీళ్ళు కూడాతాగటానికి (అంతా కలుషిత నీరు) దొరక లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. గుట్టల పై గుడారాలు వేసుకుని ఉన్న వారికి,వంట చేసి పిల్లలకు పెట్టాలంటే, కిరోసిన్ లేదు, తడిసిన కట్టె పుల్లలు. రాత్రి పూట కరెంట్ లేదు, కటిక చీకటి, పడుకుంటే, పామే వస్తుందో …తేలు వస్తుందో తెలియని భయం, తెల్లారక ఎవరైనా బోటు వేసుకుని ఇటురాక పోతారా అని ఆశగా ఎదురు చూపులు. సెల్ ఫోన్లు పనిచేయవు. నిర్వాసితులు నిజంగా నరకం అనుభవించారు. మేము దా చారం గ్రామం లో ఉన్న భాధితు ల వద్దకు వెళ్ళి కొంత మంది కి భోజన పదార్ధాలు అందించాము. ఆ సమయం లో ఆ ప్యాకెట్ లకోసం ఎగబడిన వారిని చూసినప్పుడు నాకు దుఖం వచ్చింది. వారిలో కొందరు రైతులు ఉన్నారు, ఎందరికో అన్నం పెట్టే ఉంటారు. కొందరు పేదలు ఉన్నారు, కానీ కష్ట పడి బతుకు తుంటారు. అడుక్కు నే వారైతే కాదు. అందరూ ఆత్మ గౌరవం తో బ్రతికే వారు. కానీ ఆ రోజు వారు భోజనం కోసం ఎదురు చూస్తూ ఉండి న తీరు చాలా బాధాకరం.

కొందరేమో, టార్పలిన్ లతో టెంట్లు వేసుకున్నారు.మరికొంద రేమో గుట్టల పై గుడారాలు వేసుకొని చీకట్లో ఉన్నారు. ఇంకా చాలా మంది గిరిజన నిర్వాసితుల కోసం కట్టిన కివ్వాక, మర్రిపాడు, వెంకటాపురం, దాచారం పునరావాస కాలనీల లో (అవి కూడా ముంపుకు గురవడం గమనార్హం) తలదాచుకున్నారు. వారిలో చలికి తట్టుకో లేని, ముసలి వారు, చిన్న పిల్లలు,మహిళలు ఉన్నారు.

వరద సమస్య లపై ఒక్కొక్కరిది ఒక్కో వాదన.

1,నిర్వాసితు లేమో ప్రభుత్వం మా పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తుందని, మేము మాకు పూర్తిగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని,పునరావాస కాలనీల లో అన్ని పూర్తి చేయాలని అడుగుతున్నాం అందుకే ఇలా చేస్తే మేమే వెళ్ళిపోతాం అని అధికార్లు ఇలా చేస్తున్నారని అన్నారు.

2,ప్రభుత్వం నిర్వాసితులను గాలికి వదిలేసింది అని, వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 10 లక్షలు, ప్రతీ కుటుంబానికి రూ 10 వేలు, దోమతెరలు మూడు, నెలల పాటు ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని, ప్రతి పక్ష రాజకీయ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. చంద్ర బాబు నాయుడు మొన్న21, 22,23, తేదీ లలో ముంపు గ్రామాలలో పర్యటించి ప్రజలను కలిసారు. నేడు మంగళవారం ముఖ్య మంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి వేలేరు పాడు మండలానికి వస్తున్నారు.

వ్యాసకర్త వాలంటీర్ ల నుండి వివరాలు సేకరణ

 

3, కొన్ని సంస్థలు,సంఘాలు ప్రజల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు.

4, ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి 25, కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, కేజీ నూనె, కూరగాయ లు ఇస్తున్నారు. అయితే ఇవి అందరికీ అందటం లేదని ప్రజలు కొట్టు కున్నారు. దీనిపై ఏలూరు జిల్లా కలెక్టరు గారు, మండల అధికారులను ప్రజల ముందే హెచ్చరించారు.
వెలేరు పాడు ముంపు గ్రామాల ను పరిశీలించి వస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్పీ లను ఎర్ర బోరు గ్రామం వద్ద నిర్వాసితులు అడ్డుకొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అసలు ఈ భారీ వర్షాల గురించి ప్రభుత్వానికి తెలియదా?

ఈ సంవత్సరం ముందుగానే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియా మెటియో రాలాజికల్ డిపార్ట్ మెంట్ మే నెలలో నే చెప్పింది. ఈ శాఖ అధికారులు దేశవ్యాప్తంగా పడే వర్షాల గురించి, రుతు పవనాలు గురించి మే నెలలో నివేదిక విడుదల చేస్తుంది. ఆ విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి తెలియకుండా పోతుందా? ఇవన్నీ తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు. అంటే ఇది పూర్తిగా నిర్వాసితుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వం కనపరిచినట్లు అర్థమవుతుంది. ముంపు ప్రాంతాలను అధికారులు ముందస్తు గా సందర్శించి రాబోయే వరదల గురించి ప్రజలకు చెప్పి వారి వారి సామాన్ల ను, తరలించు కోవడానికి రవాణా ఏర్పాట్లు చేయ వచ్చు కానీ అలా జరగలేదు.
ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి.కుకునూరు మండల కేంద్రం ఎత్తు లో వుంటుంది కదా అని ఆ గ్రామ ప్రజలు మన ఊరు మునగదని ధీమాతో ఉన్నారు. రాత్రి పూట చడీ చప్పుడూ లేకుండా గ్రామం అంతా తెల్ల వారే సరికి నీటి మయమైంది. అప్పుడు ఆరాత్రి లో గ్రామ ప్రజలు సొంతంగా ప్రక్క గ్రామాల నుంచి ట్రాక్టర్ లు 36 (తెలంగాణా గ్రామాలు సరిహద్దు లో ఉన్నాయి). తెప్పించి కొంత మందిని సురక్షిత ప్రాంతాల కు తరలించారు. రెవెన్యూ అధికారులు కేవలం 7, ట్రాక్టర్ లు ఏర్పాటు చేశారు. లేదంటే చాలా ప్రాణ నష్టం జరిగేది.

దాచారంలో భోజనం కోసం ఎదురు చూస్తూన్న ప్రజలు..

ఇలా చేయడం వల్ల పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు అనేక కష్టాలు పడితేనే రేపు వారికై వారే పునరావాస కాలనీల కు గత్యంతరం లేక వెళతారు. అంటే దానర్ధం పొమ్మన కుండా పొగ పెట్టడం.ఇంకా ఇక్కడ ఉండలేము అని విసుగు చెంది వెళ్ళిపోతారు.
ప్రభుత్వం వైపున తప్పు లేదని ఇది ప్రకృతి వైపరీత్యం అనీ, ఎవరూ ఏమీ చేయలేరు అని సమర్ధించు కుంటుంది. కానీ ఇది పూర్తిగా మానవ తప్పిదంగానే భావించాలి.ఎందుకంటే ప్రతీ ఏడాది జూలై నెలలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాటర్ రిసోర్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది.

” ముంపు, నిర్వాసిత సమస్య ను, తగ్గించ టానికి ప్రత్యాయ మ్నాలను గుర్తించాలని,
ప్రాజెక్ట్ భాధిత కుటుంబాల కు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని ఉంటుంది.
కానీ వాస్తవానికి కనిపించే ది వేరు. పై మాటలు ఆచరణకు నోచుకోవటం లేదు.

1986 గోదావరి వరదల కు దీనికి పొంతన లేదు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కు ముందు ఎప్పుడు వరదలు వచ్చినా అవి కొన్ని రోజులు పాటు ఉండి తర్వాత దిగువకు నీరు వెళ్ళేది. ఇప్పుడు అలా జరగలేదు, కాఫ ర్ డామ్ నిర్మాణం వలన బ్యాక్ వాటర్ వచ్చి గ్రామాల్లో నిలిచి పోయింది. అందుకే భద్రాచలం కూడా వరద తాకిడికి గురైంది.
దీని కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ 100 గ్రామాలు మునిగిపోతాయని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ. ఎస్. నెంబర్;1 ఆఫ్ 2019. అదే ఇప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతున్నది. మరల ఎటపాక గ్రామాలను తిరిగి తెలంగాణాకు ఇచ్చివేయాలని వాదిస్తున్నారు.

ఆస్తి నష్టం అంచనా వేయరు!

సాధారణ పరిస్థితుల్లో అయితే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు,అధికారులు పంట నష్టం , ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అంచనా వేసి,పరిహారం ఇస్తారు. కానీ, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల లో అది సాధ్యం కాదు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలంటున్నారు. అప్పుడు మునిగి పోయి నా, రోడ్లు తిరిగి వేయరు, కూలిపోయిన స్కూలు బిల్డింగ్స్ కట్టరు, ఇండ్లు కూలిపోతే తిరిగి ఐ. ఏ. వై. స్కీమ్ లో కట్టరు. పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి చెక్కులు ఇవ్వరు.(భూములు తీసుకున్నారు) కాబట్టి గత ముంపుకు ఇప్పటి ముంపుకు తేడాను ప్రజలు గ్రహించాలి.
ఈ వరద ప్రాంతాల్లో రేపు వచ్చే రోజుల్లో రోగాలు ప్రభలే పరిస్థితి ఉంది.
చిన్న పిల్లలు చదువు కు దూరమయ్యారు. సర్వం మునిగి పోయి పిల్లల కు, బుక్స్, బట్టలు కొనలేక, ఫీజులు కట్టలేక చాలా మంది పిల్లలు చదువు లు నిలిపివేసారు.

ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యం అవుతుంది. స్టాప్ వర్క్ ఆర్డర్ ను పొడిగించిన కేంద్రం.

గతంలో అనేక రకాల అనుమతులు లేకుండా పనులు చేయ వద్దని ది;08/02/2011 లో స్టాప్ వర్క్ ఆర్డర్ ను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే దానిని దఫా దఫాలుగా పొడిగిస్తూ .
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ది;02/07/2023 వరకు స్టాప్ వర్క్ ఆర్డర్ ను పొడిగించారు.
దీనిని బట్టి ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పట్లో పూర్తి కాదు.పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సుధాకర్ బాబు 78./. నిర్మాణం పూర్తి అయ్యిందని అంటున్నారు. చంద్ర బాబు నాయుడు డయాఫ్రమ్ వాల్, ముందుగా ప్రణాళిక లేకుండా కట్టడం వల్ల ఈ నష్ట మని ప్రభుత్వం చెపుతుంది.

ఇటీవల 14 మంది ఐ. ఐ. టీ. నిపుణుల కమిటీ ఏప్రియల్ 22 తేదీన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది. ఈ కమిటీ ని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పంపగా వచ్చింది. ఆ రోజు డయాఫ్రమ్ వాల్ 1.7 కి. మీ. పొడవునా దెబ్బతిందని చెప్పారు. వరదలు వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ దెబ్బ తింటుందని అప్పుడే హెచ్చరించారు. కానీ ప్రభుత్వం వారి హెచ్చరిక ను ఖాతరు చేసినట్లు లేదు.

పక్క రాష్ట్రాల కోర్టు కేసులు!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన కలిగే నష్టం గురించి తెలంగాణ,ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలు సుప్రీం కోర్టులోఫ్లడ్ బ్యాంక్ లేదా నష్ట పరిహారం కోసం కేసులు వేశాయి.
1, గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా ఓ. యస్. నెంబర్; 4ఆఫ్ 2007.

2, గవర్నమెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఓ. యస్. నెంబర్; 3ఆఫ్ 2011.

3, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓ. యస్. నెంబర్ 1ఆఫ్ 2019.

4, సుప్రీం కోర్టు కేసు తీర్పు;11/04/2011 ప్రాజెక్ట్ నిర్మాణం గోదావరీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ అవార్డ్ ప్రకారం ఉందా అని ఎమ్. గోపాల్ కృష్ణన్ కమీషన్ వేసింది.
ఈ పురిటి నొప్పుల నుండి గట్టెక్కాలి.

వరదలు రావడం పోవడం ప్రభుత్వాల చేతుల్లో లేదు!

1986 వరద నీరు వస్తుందని అనుకోలేదు. కానీ ఇప్పుడు రాలేదా? ఈ రోజు వచ్చింది రేపు రాదు అని గ్యారంటీ లేదు. ఇంత కంటే ఎక్కువ కూడా రావచ్చు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే, నీరు నిలిచి బ్యాక్ వాటర్ వస్తుంది.అటువంటప్పుడు మరలా కొన్ని పునరావాస కాలనీల ను అక్కడే కడుతున్నారు. అవి ఇప్పుడు వచ్చిన వరదల కు నీట మునిగిపోయాయి. రేపు ఆ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఉండదు. ఆ విషయం అధికారులు కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కాబట్టి దీనిపై ప్రజలూ ఆలోసించాలి, సమస్య ను ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి.

ప్రజల మధ్యన పని చేసే అనుభవం ఉన్న మేధావులు కూడా నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు, మానవ సమాజం లో ఉన్న అన్ని వర్గాల ప్రజలదని నమ్ముతున్నాను.


-బాబ్జీ అడ్వకేట్.
9963323968.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *