(భూమన్*)
ఆశ్చర్యంగా ఉంది కదూ… నాకు ఆ ప్రదేశానికి చేరుకున్న తర్వాత బిత్తర పోయాను. కాలిఫోర్నియా రాష్ట్రమే ఆశ్చర్యం. జిడ్డు కృష్ణమూర్తి, విపశ్యన ధ్యాన కేంద్రాలు, హరే రామ కృష్ణ సంస్కృతి LGBtQ ఉద్యమాలు, హాలీవుడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో…. కాలిఫోర్నియా రాష్ట్రమంతా పరుచుకున్న కొండల వరుసలు, దట్టమైన అడవులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రెడ్ వుడ్ ట్రీస్ చెప్పుకోదగ్గవి ఎన్నింటితో పాటు ఫారెస్ట్ ఫైర్స్, ఎర్త్ క్విక్స్.. సకలానికి నిలయమైన ఈ రాష్ట్రం ఎన్నెన్నో ఆలోచనలను తట్టి లేపుతున్నది.
ఈ శని, ఆదివారాలు కొంచెం దూరంగా HIKE చేద్దామని మా అమ్మాయి నీలూ భూమన, అల్లుడు ఆండ్రూ నికోల్సన్ కు చెబితే రెండు గంటల దూరంలో ఉండే MANDALA RETREAT కు బయలుదేరాము. వారికే కొత్తే. ఆ ప్రాంతం ప్రకృతి ఒడిలో చాలా ముచ్చటగా ఉంది. చుట్టూ కొండలు… దట్టమైన అడవులు.. వలయాకారంలో పిల్ల నదులు, దగ్గర్లో విపశ్యన కేంద్రం గొప్పగా ఉంది. అక్కడికి చేరుకోగానే TRAILS గురించి అడిగితే రామ, సీత, హనుమాన్, రావణాసుర TRAILS MAP ఇస్తానే బిత్తరపోయాను ప్రాపర్టీ ఓనర్ హరే హరే రామ SECT కీ చెందినవాడు. అక్కడ ఉన్న పుస్తకాలన్నీ మహాభారతం, రామాయణం, బుద్ధునికి సంబంధించినవి. భగవద్గీత తదోతరాల అంగడి మాత్రమే. అక్కడి పరిస్థితి చూస్తే కొన్నేళ్ళకు ఇదే దండకారణ్యమని… ఆ ప్రాచీన పురుషులు మావారేనన్నా… ఆశ్చర్యపోనక్కర్లేదేమో.
మేము అక్కడికి చేరుకోవడానికి NAPA VALLY గుండా వెళ్ళాము. NAPAలో ఎక్కడ చూసినా ద్రాక్ష తోటలే. ఈ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ కేంద్రం. ఒక్కో బాటిల్ లక్షల్లో కూడా ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోయాను.
మండల రిట్రీట్ కేంద్రంలో టెంట్స్ వాళ్ళయినా డబ్బులకిస్తారు లేదా మనం వేసుకుంటే ఆ స్థలానికి పైకం చెల్లించి ఉండొచ్చు. టెంట్స్ లో ఉండలేని వారికోసం కాటేజెస్ కూడా ఉన్నాయి. 15 ఎకరాలకు పైగా ఉన్న ఆ స్థలంలో అన్ని టెంట్లు ఆర్ వీలు నిండి ఉన్నాయి. యోగ కోసం ధ్యానం కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువ.
HIKE కోసం నేనొక్కన్నే ఈ మారు కూడా. ఆ నాలుగు HIKS చుట్టి రావడానికి మూడు గంటలు పట్టొచ్చని…. మొత్తం 12 కిలోమీటర్లు ఉండొచ్చిన చెబితే అదంతలెమ్మని బయలుదేరి దారి తప్పిపోయా రెండు కిలోమీటర్లు ఎక్కువగా నడిచి వచ్చాను. అయితే ఆ కొండల మధ్యన… లోయల అంచున… దట్టమైన చెట్ల చాటున…. నడుస్తూ ఉంటే అదో మధురమైన, అద్భుత జ్ఞాపకంగా మిగిలింది. చెంగుచెంగున ఎగురుతున్న జింకల దృశ్యం ఎంత కమనీయంగా ఉందో మాటల్లో చెప్పలేను. అవి తప్పితే మరే జంతువు నా కంట పడలేదు. ఆరేళ్ల క్రితం వచ్చిన భీకరమైన మంటల్లో కొన్ని వేల జీవరాసులు అంతమైనట్లుగా విన్నాను. పక్షుల అరుపులు చెప్పుకోదగ్గట్టుగా లేవు. కొన్ని కిలోమీటర్ల దూరం కాలి బస్మీపటలమైన ప్రాంతం చూసి గుండెలు తరుక్కుపోయాయి. ఎంతటి ప్రకృతి విపత్తు ఇది కొన్ని లక్షల చెట్లు బుగ్గ కావడం జీవరాశి మనుషులతో సహా బస్మీ పట్టణం కావడం హృదయ విదారకం.
దగ్గర్లో ఉన్న HARBIN ప్రాంతంలో HAKING చేద్దామని ప్రయత్నిస్తే ఈ కాలిన అడవుల మధ్యన కుదరదని తేల్చి చెప్పేశారు. అయితే ఈ HARBINలో వేడి నీటి గుండాలు, చల్లటి నీటి గుండాలు మన చార్ధామ్ లో ఉన్నట్టుగా ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్ళాము. ఆశ్చర్యమేమంటే అక్కడికి మన ఇష్ట ప్రకారం బట్టలతో కూడా వెళ్ళవచ్చు. అడుగుపెట్టగానే ఉత్త బిత్తల వారిని అందులో యువతి యువకులు వయసు మీరిన వారు ఉన్నారు. చూసి విస్తరిపోయాను.
నిశ్శబ్దంగా ఎవరి మటుకు వాళ్లు ఆ నీళ్లలో కొంచెం సేపు ఉండటం… పోవటం చూసి లోకపు తీరుతెన్నులకు ఆశ్చర్య చకితుణ్ణి అయ్యాను. అయితే ఒక్క మాట ఆ దిగంబరత్వం ఏ మాత్రం అసభ్యంగాను… అహిష్టంగాను లేకపోవడమే విశేషం. వీరి తార్కిక చింతన శరీరంకు సంబంధించి భిన్నమైందని తెలుసుకున్నాను.
చూద్దాం… ఇంకా ఎన్ని ప్రకృతి వింతలు ఉన్నాయో ఈ నేలన.
(*భూమన్ ప్రముఖ రచయిత, ప్రకృతిప్రేమికుడు. ప్రస్తుతం అమెరికా యాత్రలో ఉన్నారు)
Good analysis 👍. Thank you uncle for sharing information what we are unable to watch with our eyes.
Excellent experience and nice article
Excellent trip and nice article sir