పోలవరం ప్రాజెక్టుకు ఆకస్మిక భారీవరద. వచ్చింది
ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగింది.
పోలవరం స్పిల్ వే దగ్గర 29.4మీటర్లకు చేరిన గోదావరి నీటిమట్టం.
ప్రస్తుతం ప్రాజెక్టు నుండి 4 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల
అర్దరాత్రికి 12లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మికంగా గోదావరికి వరద
గతంలో జూలైలో 30 నుండి 50 వేల క్యూసెక్కుల మాత్రమే వచ్చే వరద.
ఐతే ఈసారి మాత్రం 10లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.
ఆకస్మికంగా వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు తీవ్ర ఆటంకం
దీనికి తోడు స్దానికంగా కురుస్తున్న వర్షాలు సైతం ముందస్తు చర్యలు చేయలేని పరిస్దితి
ప్రస్తుతం దిగువ కాఫర్ ఢ్యాం దగ్గర గోదావరి నీటి మట్టం 19.5మీటర్లు
ప్రస్తుతం దిగువ కాఫర్ ఢ్యాం 21మీ ఎత్తకు పూర్తైంది.
గంటకు 25సెంమీ చొప్పున గోదావరి నీటి మట్టం పెరుగుతోంది.
అర్దరాత్రికి భారీగా పెరుగుతున్న వరద ప్రవాహంతో దిగువ కాఫర్ ఢ్యాం,గ్యాప్-2పనులు పూర్తిగా నిలిచిపోనున్నాయి.