మోహనకృష్ణకు ఆర్ఎస్ఎన్ సాహిత్య పురస్కారం

– రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మరియు ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
– “పచ్చధనం” సంకలనంలో ఉత్తమ కవితగా ఎంపికైన మోహనకృష్ణ “ఎవరొస్తారని” కవిత

హైద్రాబాద్ : సమాజ హితాన్ని కాంక్షిస్తూ కలాలను పదును పెట్టిన కవులను పురస్కారాలతో సత్కరించడం హర్షణీయమన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు.

మాజీ శాసనమండలి సభ్యులు, తెలంగాణ పబ్లిక్ కమీషన్ సభ్యులు ఆర్. సత్యనారాయణ, ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్ఎస్ఎన్ సాహిత్య అవార్డుల ప్రధానోత్సవ సభ
(2020-21), పచ్చధనం కవితా సంకలన ఆవిష్కరణ మహోత్సవం సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వైభవంగా జరిగింది. ఈ సభలో ప్రముఖ సామాజిక కవి, రచయిత డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ కారం రవీందర్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వాధ్యక్షులు డా. నందిని సిద్దారెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి కె. విరహత్ అలీ మరియు పలువురు ప్రముఖుల చేతుల మీదుగా రాష్ట్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు మరియు నగదు ప్రోత్సాహకం, శాలువా, జ్ఞాపిక, అవార్డ్ సర్టిఫికేట్, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎంతో చైతన్యవంతంగా కవితలను అందించి సమాజంలో మార్పుకు దోహదపడుతున్న కవులను సత్కరించడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. రాష్ట్ర ఉత్తమ సాహిత్య పురస్కారాన్ని అందుకున్న కవి మోహనకృష్ణ ని అభినందించారు. నిర్వాహకులు ఆర్ఎస్ఎన్ చైర్మెన్ సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ చైతన్య కవితా సంకలనం “పచ్చధనం” పుస్తక ముద్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కవుల నుండి కవితలను ఆహ్వానించగా వేయికి పైగా కవితలు అందాయని, అందులో జ్యూరీ కమీటీ, సమన్వయ ఎంపిక కమీటీ నాలుగు వందల కవితలను ఎంపిక చేసి పచ్చధనం సంకలనం ముద్రించామని, అందులో మోహనకృష్ణ వ్రాసిన ఎవరొస్తారని కవిత ఉత్తమ కవితగా ఎంపికైన సందర్భంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సాహిత్య పురస్కారంతో సత్కరించినట్లు తెలిపారు. మోహనకృష్ణ మాట్లాడుతూ తనకు ఈ అవకాశాన్ని, గౌరవాన్ని, పురస్కారాన్ని అందించిన నిర్వాహకులకు, సమన్వయ కర్తలకు, ముఖ్య అతిథులకు, ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్ గారు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు పలువురు ప్రముఖులతో పాటు కవులు, రచయితలు, సాహితీ ప్రియులు, జర్నలిస్టులు, మిత్రుల అభినందనలు వెల్లువెత్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *