టిటిడిలో ఇలాంటి అధికారి ఉన్నారా?

 

తిరుమల తిరుపతి దేవస్థానంలో “సకల శాఖల అధిపతి” ని సాగనంపండి!

కేంద్రం నుంచి రాష్ట్రానికి 3 వ సారి డిప్యుటేషన్ పై వచ్చి టీటీడీ లో  ఒకేసారి ఐదు శాఖలకు విశేష సేవలందిస్తున్న అత్యుత్తమ అధికారిని వెనక్కు పిలిపించి “ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్” నందు వారి సేవలను కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి!

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే డిప్యూటేషన్ అధికారులు నిబంధనల ప్రకారం  ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెంటనే మాతృ సంస్థకు రీకాల్ చేయాలి!

టిటిడి కి యువ ఐఏఎస్ అధికారుల సేవలు ఎంతైనా నా అవసరం వుంది, నిజాయితీగా,నిస్పక్షపాతంగా తిరుమల శ్రీవారికి సేవకునిగా,సామాన్య భక్తుల సేవే లక్ష్యంగా,వెంకన్న నిధుల సంరక్షకునిగా పనిచేసే “యువ ఐఏఎస్” అధికారులను టీటీడీ ఈవో,అడిషనల్ ఈఓ లుగా పని చేసేందుకు ఏపీ సీఎం అవకాశం ఇవ్వాలి!

టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇపుడు డిప్యూటేషన్ అధికారుల పాలనలో జరిగిన సంఘటనలు కలియుగాంతం వరకు శ్రీవారి భక్తులు మర్చిపోలేరు!

చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు!

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఎంతోమంది సీనియర్,సిన్సియర్ ఐఏఎస్ అధికారులు ఉద్యోగంలో భాగంగా ఒక్కసారి అయినా తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చెయ్యాలి అని ఎదురుచూస్తుంటారు

అలాంటి వారికి అవకాశం ఇవ్వండి డిప్యూటేషన్ అధికారుల సంస్కృతికి స్వస్తి పలకండి!

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే డిప్యూటేషన్ అధికారుల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికార బలంతో నిర్ణయాలు తీసుకుంటే హై కోర్టును అవసరమైతే సుప్రీం కోర్టుని ఆశ్రయించాల్సిన పరిస్థితి శ్రీవారి భక్తులకు కల్పించకండి!

ధర్మో రక్షతి రక్షితః

నవీన్ కుమార్ రెడ్డి
శ్రీ వారి భక్తులు
స్థానికులు

 

ఇది నిజమే అయితే  టిటిడి లో ఇలాంటి అధికారి ఉండటం సబబేనా?

తిరుపతికి చెందిన యాక్టివిస్ట్ నవీన్ కుమార్ రెడ్డి డెప్యూటేషన్ మీద వచ్చి ఏడేళ్లుగా కోన సాగుతున్న ఆ అధికారి గురించి ఏమంటున్నారో వినండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *