కొత్త రాయలసీమ స్వరూపం ఇదే…

 

(చందమూరి నరసింహారెడ్డి)

 

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరగడంతో రాయలసీమ భౌగోళిక స్వరూపం మరో సారి మారిపోయింది. నాలుగు జిల్లాలు కాస్తా ఎనిమిది జిల్లాలయ్యాయి. సముద్ర తీరం లేని రాయలసీమ కు సముద్ర ప్రాంతం వచ్చింది. రాయలసీమ చరిత్రను ఓ సారి పరిశీలిద్దాం.

1792కు ముందుఈ ప్రాంతం మైసూరు రాష్ట్రంలో ఉండేది.1792 లో మూడో మైసూరు యుద్ధం ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంతం నిజాం రాజు ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి 1800 వరకూ నిజాం రాజుల పాలనలో ఉంది. నిజాం రాజ్యం పై మరాఠాలు, టిప్పు సుల్తాన్ దాడులు ప్రారంభించడంతో రెండో నిజాం రాజు బ్రిటిష్ సైన్యం సహాయం కోరాడు. యద్దంలో నిజాం రాజు గెలవడంతో బ్రిటీష్‌వారి సాయానికి ప్రతిగా అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, కంభం, మార్కాపురం, గిద్దలూరు బళ్లారి, తుముకూరు, దావణగేరి ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు అప్పటి మద్రాసు రాష్ట్రంలో కలిపి సీడెడ్ (దత్త మండలం)అని పిలవడం మొదలుపెట్టారు.

1928 నవంబర్ 17, 18 తేదీల్లో నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో దత్తమండలం పేరును మార్చి రాయలసీమ గా నిర్ణయం చేస్తూ అనంతపురం ఆర్ట్స్ కళశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న చిలుకూరి నారాయణ రావు ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదన ఆమోదించడంతో దత్త మండలం రాయలసీమ గా మారింది.

రాయలసీమ1953 వరకూ మద్రాసు రాష్ట్రంలో ఉంది, 1953 లో మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు రాయలసీమలో ఉన్న బళ్లారి, తుముకూరు, దావణగేరే ప్రాంతాలు కర్నాటకలో కలిశాయి. రాయలసీమ1956 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, 1956 లో ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదు నిజాం ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్
ఏర్పాటు చేశారు .

2014 లో తెలంగాణ విడిపోయి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ఉంది.1970 లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో కర్నూలు జిల్లాలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు తాలూకాలను ప్రకాశం జిల్లాలో కలిపారు. రాయలసీమ విస్తీర్ణం తగ్గిపోయింది.

ఇటీవల జరిగిన జిల్లాల పనర్విభజనలో నెల్లూరు జిల్లా లోని కొంతభాగం రాయలసీమ లో కలవడం తో మళ్లీ కొంత విస్తీర్ణం పెరిగింది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు , అసెంబ్లీ నియోజకవర్గాలు మండలాల సంఖ్య పెరిగింది.67562చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం 71060 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 2011 జనాభా లెక్కలు ప్రకారం  పూర్వమ్  రాయలసీమ లో 15184908 జనాభా ఉంది.పునర్వ్యవస్థీకరణ తర్వాత 15962600 కు పెరిగింది.

గతంలో 22 రెవెన్యూ డివిజన్లు ఉండేవి. నూతనంగా 12రెవెన్యూ డివిజన్లు పెరిగాయి.దీంతో 34 రెవెన్యూ డివిజన్లకు పెరిగింది. గతంలో 52అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. ప్రస్తుతం 55 అసెంబ్లీ నియోజకవర్గాలకు పెరిగాయి. అనంతపురం, కర్నూలు జిల్లాలు రెండు గా విడిపోయాయి.

ఇతర జిల్లాలనుంచి వేరే ప్రాంతాలం కలవడం కాని విడిపోవడం కానీ జరగలేదు. కడప జిల్లా రెండు గా విడిపోయి చిత్తూరు జిల్లా లోని కొంతభాగం కలుపుకొని రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పడింది. చిత్తూరు జిల్లా విడిపోయి నెల్లూరు జిల్లా లోని కొంతభాగం కలుపుకొని తిరుపతి బాలాజీ జిల్లా ఏర్పడింది. రాయలసీమ లోని ఎనిమిది జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.గతంలో 52అసెంబ్లీ నియోజక వర్గాలుండేవి. నూతన రాయలసీమ లో 55అసెంబ్లీ నియోజకవర్గాలకు పెరిగింది.

కర్నూలు జిల్లా

జిల్లా కేంద్రం కర్నూలు. విస్తీర్ణం: 7,980 చ.కి.మీ. జనాభా: 22.717 లక్షలు. జిల్లాలో పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ 8 శాసనసభ స్థానాలున్నాయి.

కర్నూలు,ఆదోని, పత్తికొండ3రెవెన్యూ డివిజన్లున్నాయి. 26మండలాలున్నాయి. కర్నూలు డివిజన్ లో 1.కల్లూరు 2.ఓర్వకల్లు 3. సీ.బెళగళ్4.గూడూరు 5.కర్నూలు అర్బన్ 6.కర్నూలు రూరల్ 7. కోడుమూరు8వెల్దుర్తి మండలాలు; ఆదోని డివిజన్ లో1.ఆదోని 2.మంత్రాలయం
3. పెద్దకడుబూరు 4. కోసిగి 5.కౌతాళం 6.హోళగుంద 7.ఎమ్మిగనూరు 8.నందవరం 9. గోనెగండ్ల మండలాలు; పత్తికొండ డివిజన్ లో1.హాలహర్వి 2.ఆలూరు 3. ఆస్పరి 4.దేవనకొండ 5.చిప్పగిరి 6.పత్తికొండ 7. మద్దికెర 8.తుగ్గలి 9. క్రిష్ణగిరి మండలాలున్నాయి.

నంద్యాల జిల్లా

నంద్యాల జిల్లా కేంద్రం. విస్తీర్ణం: 9,682 చ.కి.మీ. జనాభా: 17.818 లక్షలు. నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం 6 శాసనసభ స్థానాలున్నాయి.ఆత్మకూరు, నంద్యాల, డోన్ 3రెవెన్యూ డివిజన్లున్నాయి .29 మండలాలున్నాయి.
ఆత్మకూరు డివిజన్లో 1.శ్రీశైలం 2. ఆత్మకూరు
3.వెలుగోడు 4.నందికొట్కూరు
5.పగిడ్యాల 6.జూపాడుబంగ్లా 7.కొత్తపల్లె 8.పాములపాడు 9.మిడుతూరు 10.బండి ఆత్మకూరు మండలాలు; నంద్యాల డివిజన్ లో
1. నంద్యాల 2. గోస్పాడు 3.శిరివెళ్ల 4.దొర్నిపాడు 5.ఉయ్యాలవాడ 6.చాగలమర్రి 7.రుద్రవరం 8. మహానంది 9.ఆళ్లగడ్డ 10.పాణ్యం 11. గడివేముల 12.సంజామల13.కొలిమిగుండ్ల మండలాలు;  డోన్ డివిజన్ లో1. బనగానపల్లె 2. అవుకు 3. కోవెల కుంట్ల 4.డోన్ 5.బేతంచర్ల 6.ప్యాపిలి.మండలాలున్నాయి.

19130 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న అనంతపురం జిల్లాను రెండు జిల్లాలు గా విభజించారు.అనంతపురం జిల్లాని 1882లో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసారు.1882 కు ముందు అనంతపురం జిల్లా బళ్ళారి జిల్లాలో కొంత భాగం,కడప జిల్లాలో కొంతభాగం ఉండేది.ఈజిల్లాను రెండు జిల్లాలు చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా

పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా లో నాలుగు రెవెన్యూ డివిజన్లు , 8925.65 చదరపు కిలోమీటర్లువిస్తీర్ణం, 18.14లక్షల జనాభా,32మండలాలు ఉన్నాయి.

నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుగొండ రెవిన్యూ డివిజన్ లో 12 మండలాలు పెనుకొండ, గుడిబండ, లేపాక్షి, హిందూపురం, మడకశిర, రొద్దం, సోమందేపల్లి, అగళి, రొళ్ల, అమరాపురం, చిలమ త్తూరు, పరిగి. నూతనంగా ఏర్పడిన పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ లో6మండలాలు , పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఓడీసీ, గోరంట్ల. ధర్మవరం రెవెన్యూ డివిజన్ లో 7 మండలాలు ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, ముది గుబ్బ. కదిరి రెవెన్యూడివిజన్ లో 7మండలాలు కదిరి, తలుపులు, తనకల్లు, గాండ్లపెంట, నంబూలపూ లకుంట, నల్లచెరువు, అమడగూరు.మొత్తం 32 మండలాలున్నాయి.

హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గం సత్యసాయి జిల్లా లో ఉంటుంది అయితే హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం లోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం పుట్టపర్తి శ్రీ సత్య సాయి జిల్లాలో కొంతభాగం అనంతపురం జిల్లాలో కొంతభాగం కలిపారు. దీంతో సత్యసాయి జిల్లా లో ధర్మవరం, పెనుగొండ , పుట్టపర్తి, మడకశిర , హిందూపురం, కదిరి 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చెన్నెకొత్తపల్లి ,రామగిరి, కనగానిపల్లి మండలాలు శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలో చేర్చారు.

అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 10204.35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ,22.40 లక్షల జనాభా 31మండలాలు ఉన్నాయి. కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ లో 11 మండలాలు రాయదుర్గం, డి.హిరేహాల్, కనేకల్లు , బొమ్మనహల్, గుమ్మ గుట్ట , కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం , సెట్టూరు, కుందుర్పి ,కంబదూరు, బెలుగుప్ప , అనంతపురం రెవెన్యూ డివిజన్ లో 12 మండలాలు అనంతపురం , తాడిపత్రి,కూడేరు , ఆత్మకూరు,పెద్దపప్పూరు ,సింగనమల,గార్లదిన్నె , పుట్లూరు,యల్లనూరు , నార్పల , బికేసముద్రం , రాప్తాడు నూతనంగా ఏర్పడిన గుంతకల్లు రెవెన్యూ డివిజన్ లో 8 మండలాలు ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు , గుత్తి ,పామిడి, యాడికి , పెద్దవడుగూరు మొత్తం 31 మండలాలు . అనంతపురం జిల్లాలో అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు ,తాడిపత్రి, సింగనమల ,అనంతపురం, కళ్యాణదుర్గం తో పాటు హిందూపురం పార్లమెంటు పరిధిలోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం లోని రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలు ఉన్నాయి.

బ్రిటిష్ పాలనలో ఏర్పాటైన జిల్లాల్లో కడప జిల్లా ఒకటి.సర్ థామస్ మన్రో మొదటి కలెక్టర్. 2010 జూలై 8 నుండి ఈ జిల్లా పేరును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్ కడప జిల్లాగా మార్చింది.కడప కేంద్రంగా వై.యస్.ఆర్ జిల్లా గాను,ఈ జిల్లాలోని కొంతభాగం చిత్తూరు జిల్లాలోని కొంతభాగం తీసుకుని రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా గా ఏర్పాటు చేశారు.

వై.యస్.ఆర్ జిల్లా

జిల్లా కేంద్రం కడప .ఇందులో 7అసెంబ్లీ నియోజకవర్గాలు,3రెవెన్యూ డివిజన్లు, 36మండలాలున్నాయి. 11,228 చ.కి.మీ.విస్తీర్ణంతో
20.607 లక్షల జనాభా ఉంది. ఇందులో
కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాలు,బద్వేల్, కడప,జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లున్నాయి.

బద్వేల్‌ డివిజన్‌లో మైదుకూరు, దువ్వూరు, చాపాడు, శ్రీ అవధూత కాశీనాయన మండలం, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, గోపవరం, బ్రహ్మంగారి మఠం, అట్లూరు, ఖాజీపేట మండలాలు కడప డివిజన్‌లో కడప, చక్రాయిపేట, ఎర్రగుంట్ల, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట, సిద్ధవటం, వేంపల్లె మండలాలు ,

జమ్మలమడుగు డివిజన్‌లో జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాలున్నాయి. త్వరలోనే పులివెందుల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఈ డివిజన్ ఏర్పడితే నాలుగు డివిజన్లు అవుతాయి.

అన్నమయ్య జిల్లా

జిల్లా కేంద్రం రాయచోటి
6అసెంబ్లీ నియోజకవర్గాలు

3రెవెన్యూ డివిజన్లు .30మండలాలున్నాయి. 7,954చ.కి.మీ.విస్తీర్ణంతో 16.973 లక్షలజనాభా ఉంది.రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు
రాజంపేట, రాయచోటి , మదనపల్లె రెవెన్యూ డివిజన్లు.రాజంపేట డివిజన్‌లో కోడూరు, పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు, వీరబల్లె, టి సుందరపల్లె మండలాలు
రాయచోటి డివిజన్‌లో రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లెమండలాలు మదనపల్లె డివిజన్‌లో మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, మొలకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్ద తిప్ప సముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాల్మీకిపురం మండలాలున్నాయి.
చిత్తూరు జిల్లా ను రెండు జిల్లాలుగా చేశారు. నెల్లూరు జిల్లా నుంచి కొంత ప్రాంతాన్ని చిత్తూరు జిల్లా లోని కొంత ప్రాంతాన్ని కలుపుకొని తిరుపతి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేశారు.

చిత్తూరు జిల్లా

జిల్లా కేంద్రం చిత్తూరు.6,855 చ.కి.మీ. విస్తీర్ణం, 18.730 లక్షల జనాభా ఉంది. ఈజిల్లాలో నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమలేరు, కుప్పం, పుంగనూరు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 రెవెన్యూ డివిజన్లు చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం.31 మండలాలున్నాయి. నగరి డివిజన్‌లో నగరి, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పాలసముద్రం, కార్వేటినగరం, నిండ్ర, విజయపురం మండలాలు చిత్తూరు డివిజన్‌లో చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, తవణంపల్లె, ఈరాల, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలు పలమనేరు డివిజన్‌లో పలమనేరు, గంగవరం, పెదపంజాని, సోమ్ల, చౌడుపల్లి, పుంగనూరు, సదుం, బంగారుపాలెం, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట మండలాలు కుప్పం డివిజన్‌లో కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం మండలాలున్నాయి.

తిరుపతి జిల్లా

తిరుపతి జిల్లా కేంద్రం 8,231 చ.కి.మీ. విస్తీర్ణం 21.970 లక్షల జనాభా ఉంది.7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి
సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు. 4రెవెన్యూ డివిజన్లు గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి మొత్తం 34 మండలాలున్నాయి.

గూడూరు డివిజన్‌లో గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిత్తమూరు, బాలాయపల్లె, వెంకటగిరి, డక్కిలి మండలాలు,సూళ్లూరుపేట డివిజన్‌లో ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, బుచ్చినాయుడి కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు మండలాలు, శ్రీకాళహస్తి డివిజన్‌లో శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు, కుమార వెంకట భూపాలపురం, నాగులాపురం, పిచ్చాటూరు, నారాయణవనం మండలాలు,
తిరుపతి డివిజన్‌లో తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, యర్రవారిపాలెం, చిన్నగొట్టిగల్లు, పాకాల మండలాలున్నాయి.

పాత నెల్లూరు జిల్లా నుంచి 14మండలాలు,3అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయి తిరుపతి జిల్లా లో కలిసాయి.

రాయలసీమను 4 జిల్లాల నుంచి 8 జిల్లాలుగా మార్చారు. విస్తీర్ణం, జనాభా, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు పెరిగాయి.

Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహ రెడ్డి, జర్నలిస్ట్,
ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *