మే 3న అప్పన్న నిజరూపదర్శనం

సింహాద్రి నాథుడి కి శ్రీ చందనం. అంగరంగ వైభవంగా తొలివిడత ఆరగ తీత ప్రారంభం”

సింహాచలం, ఎప్రిల్..26

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇల వేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మే 3న అప్పన్న నిజరూపదర్శనం ఉత్సవం జరగనుంది..

ఏడాది పొడవునా సుగంధభరిత చందంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే భక్తులకు తన నిజరూప దర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చందనోత్సవం గా, చందనయాత్ర గా పిలవడం జరుగుతుంది.

తొలివిడత చందనం సమర్పణ కోసం అవసరమైన చందన అరగతీత కార్యక్రమం చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన మంగళవారం సింహగిరి పై ఘనంగా ప్రారంభమైంది.

తొలుత సింహాద్రి నాధుడుకి సుప్రభాతం, ఆరాధన గావించారు,, చందనము చెక్కలకు తొలుత విశ్వక్సేన పుణ్యాహవాచనం , ఆరాధన పూర్తి చేసి ఆలయ బేడా మండపంలో ప్రదక్షిణ లు నిర్వహించారు.

తదుపరి శాస్త్రోక్తంగా చందనాన్ని ఆలయ అర్చకవర్గాలు అరగ తీశారు.. స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జి ప్రధాన అర్చకులు ఇరగవరపు వెంకట రమణమూర్తి తొలిగా చందనము అరగతీశారు. తరువాత గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ప్రసాద్ ఆచార్యులు ఆలయ పురోహితుడు, అలంకారి కరి సీతారామాచార్యులు పూజలు నిర్వహించారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *