నేను ఐఎఎస్ ఎలా సాధించానంటే….

యోగేష్ పాటిల్ 2020 ఐఎఎస్ బ్యాచ్ అధికారి.  ఆయన సివిల్స్ యాత్ర ఎక్కడో మూరుమూల పల్లెటూరిలో మొదలయింది.  చివరకు విజయవంతమయింది. పాటిల్ యాత్రానుభవం చాలా ఉత్తేజకరంగా  ఉంటుంది. ఆయన చెప్పేమాటలు కచ్చితంగా  పరీక్షలు రాసే వారిలో ఏపాటి నిరుత్సాహం ఉన్నా పొగొడతాయి. పాటిల్ కూడా  గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చారు. ఆయన తండ్రి ఒక స్కూల్ టీచర్ . అందువల్ల పాఠశాల విద్యాభ్యాసం గ్రాామాల్లోనే సాగింది.

పాటిల్  సివిల్స్ ఆలోచనకు పదేళ్ల చరిత్ర ఉంది. దానికి బీజం  2010లో పడింది. 2020 నాటి మొక్కై మానై ఫలాన్నిచ్చింది. ఈ ఒక్కమాట చాలు, చాలామందిని ఉత్తేజపరచడానికి.

ఐఎఎస్ ఆలోచన  వచ్చే నాటికి ఆయన పదో తరగతిలో ఉన్నాడు. స్కూలింగ్ మొత్తం మరాఠీ మీడియంలోనే సాాగింది. ఇంటర్  ఆయన  వాళ్ల వూరి పక్కనే  ఉన్న జూనియర్ కాలేజీలో చదివారు. తర్వాత పుణేలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. అక్కడే ఆయనకు సివిల్స్ గురించి స్పష్టమయిన ధ్యేయం ఏర్పడింది.  తర్వాత ఆయన సివిల్స్ ప్రిపేరేషన్ కు ఢిల్లీ వెళ్లారు. మొదటి దఫాలోనే  విజయం సాధించి 231 ర్యాంకు సంపాదించారు. ఐపిఎస్ కు ఎంపికయ్యారు. అయితే ఆయన ధ్యేయం ఐఎఎస్ కాబట్టి, రెండో సారి సివిల్స్ రాశారు. ఈ సారి ఆయనకు ఆల్ ఇండియా ర్యాంకు 63 సాధించారు.  ఆయన కల నెరవేరింది. అంతేకాదు, కలని ఎలా సాకారం చేసుకోవాలో  ఆయన సివిల్స్ యాత్ర ఒక పాఠం గా మారింది.  పశ్చిమ బెంగాల్ కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఎం వి రావు (అడిషనల్ చీఫ్ సెక్రెటరీ)  ఆయనతో సంభాషించి సివిల్స్  ప్రిపేరేషన్ గురించిన అనేక  ఆసక్తి రమయిన విషయాలను రాబట్టారు. పాటిల్ ఒక వండర్ అయితే,   సివిల్స్  పరీక్షలు రాసే వేలాది మందిలో  నూతనోత్సాహం నింపేలా ఆయనతో సంభాషించడం మరొక వండర్.

ఒక్కొక్క సివిల్స్ సక్సెస్ స్టోరీ ఒక్కొక్క విధంగా ఉంటుంది.  ఎవరి మార్గం వారు ఎంచుకోవాలనేందుకు పాటిల్ అనుభవం ఒక   నిదర్శనం. ఎందుకంటే, ఆయన మెకానికల్  ఇంజనీరింగ్  చదివినా,  అప్షనల్ గా ఎంచుకున్నది ఆంత్రోపాలజీని. అంతేకాదు, ఒక సబ్జక్టును ఆప్షనల్ గా ఎంచుకున్నాక కథ ముగియదు. ఆప్షనల్ ని  ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది  ఎంత ముఖ్య మో పాటిల్ చక్కగా వివరించారు.  సివిల్స్ యాస్సిరాంట్స్  ఆప్షనల్  ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని చెబుతూ ఆప్షనల్ ని ఎంచుకున్నక ఎలా చదివాలనే ఏం చదవాలనే విషయంలో  కూడా అంతే జాగ్రత్త అవసరమంటున్నారు.

ఆంత్రోపాలజీ వంటి తనకు పరిచయం లేని కొత్త సబ్జక్టును ఎంచుకోవడమే కాదు, ఆసబ్జక్టులో ఆయన ఎంత చక్కగా ప్రిపేరయ్యారంటే, చివరకు  జాతీయ స్థాయిలో ఎక్కువ మార్కులు సంపాదించిన వారిలో నాలుగో వ్యక్తి అయ్యారు. చిత్రం ఏంటేంటే, ఆంత్రోపాలజీ ఆప్షనల్ ప్రిపేరేషన్ కు పాటిల్ చదివినది చాలా తాజా పుస్తకం. ఆ పుస్తకం పేరు Persistence and Change in Tribal India. దీనిని రాసింది ఎవరో కాదు. ఇక్కడ పాటిల్ ను ఇంటర్వ్యూ చేస్తున్న డాక్టర్ రావే. ఆంత్రోపాలజీ ఆప్షనల్ తీసుకుని సివిల్స్ ప్రిపేరవుతున్న వారికి ఇదొక విలువయిన సలహా .

source: Amazon

సివిల్స్ రాసే వాళ్లకి పాటిల్ మరొక అద్భుతమయి సలహా ఇచ్చారు. అది ప్రశ్నలకు జవాబు రాసే తీరు. కృతకంగా సమాధానాలు రాయకూడదు. ఉదాహరణకు దేశంలో గిరిజన సమస్యలకు పరిష్కారం సూచిస్తున్నపుడు ఎవో తోచింది రాయడం కాకుండా. లోతైన సమాధానాలు, ఆలోచింప చేసే సమాధానాలు రాయడం మీ  విజయ రహస్యం అని చెబుతున్నారు.  డాక్టర్ రావు రాసిన Persistence and Change in Tribal India పుస్తకం చదివినందునే తాను పరీక్ష చక్కగా రాశానని, అందుకే చాలా ఎక్కువ మార్కులు సంపాదించానని ఆయన చెప్పారు. ఎందుకంటే, ఆ పుస్తకం గిరిజన  జీవితం, వాళ్ల సమస్యలు, వాటిని పరిష్కరించే మార్గాలు, అపుడు ఎందురవుతున్న సవాళ్లను బాగా రికార్డు చేసింది. ఇది  ఈ సబ్జక్టులలో  లెేటెస్ట్ ఇన్ ఫర్మేషన్. అంటే ప్రిపేర్ అయ్యేందుకు మంచి పుస్తకం, తాజాగా వచ్చిన పుస్తకం, శాస్త్రీయ పరిశోధనతో రాసిన పుస్తకం చదవడం చాలా అవసరమని పాటిల్ చెప్పారు. తన  విజయ రహస్యాన్ని ఆయన ఒక వాక్యం లో ఇలా చెప్పారు.

“Commitment and Consistency are twin pillars of success. To start your journey you need a ‘yes, I want to do this’ commitment. And to face the journey you need consistency over a period of time to finish the goal you have decided for yourself.”

సక్సెస్ అంత సులభం కాదు. ఈ యాత్రలో చాలా ఆటంకాలుంటాయి. వాటిని అధిగమించాలంటే సతమతమవకతప్పదని ఆయన చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారిలో ఆత్మన్యూనత (Inferiority complex)ఉంటుంది. ఎలాంటి సామాజిక నేపథ్యం నుంచి వచ్చినా,  జీవితం పట్ల మీకు ఎలాంటి వైఖరి ఉందనేదే అసలు విషయం. మానసిన స్థయిర్యం అలవర్చుకోవాలి. ఎందుకంటే, ప్రతిరోజు పొద్దున లేస్తూనే అదే చదవుతూ ఉండాలి. ఇలాంటి జీవితవాస్తవాన్ని ఫేస్ చేసేందుకు చాలా మెంటల్ టఫ్ నెస్ ఉండాలని పాటిల్ చెబుతున్నారు.  ఇది చాలా  మంచి, విలువయిన అబ్జర్వేషన్ అనిపిస్తుంది.

పాటిల్ ప్రిపేరేషన్ లో  మరొక ఆసక్తికరమయిన కోణం ఉంది. అది విపస్సాన (Vipassana) కోచింగ్ .  ఇది తనకు  ఇది బాగా ఉపయోగపడిందని ఆయన చెబుతన్నారు.  ” ప్రిపరేషన్ కు కేవలం హార్డ్ వర్క్ మాత్రమే సరిపోదు. దానికి దృఢ చిత్తం, మానసిక ప్రశాంతత అవవసరం. ఈ కోచింగ్ నాకు ఈ రెండింటిని అందించింది,” అని ఆయన చెప్పారు

 

పాటిల్ చెబుతున్న ఆసక్తికరమయిన మరిన్ని వివరాలకోసం  ఈ వీడియో  చూడండి.

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *