‘కెసిఆర్ ది నరం లేని నాలుక’

ముఖ్యమంత్రి కెసిఆర్ ది నరం లేని నాలుకని అదెపుడు  ఏమ్మాట్లడుతుందో ఎవరికీ తెలియదని, దాని వల్ల మొత్తం తెలంగాణ రైతాంగం కష్టాల్లో పడిపోయిందని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు.

వ‌రి విష‌యంలో కేసీఆర్ ఊసరవెల్లిలా మాట‌లు మారుస్తున్నాడని విమర్శిస్తూ  “ఒకసారి సన్నొడ్లు వేయాలంటాడు,  ఇంకోసారి వరి వేయొద్దంటాడు, మరోసారి వడ్లు కొనమని రైతులను ముప్పుతిప్పలు పెట్టతాడు, – కేసీఆర్‌ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయ‌న‌కే తెలియదు. కేసీఆర్ ది నరం లేని నాలుక.” అని ఆమె తన రైతు గోస కార్యక్రమంలో విమర్శించారు.

ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల  63వ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం బుర్గంపాడు మండలం రామపురం గ్రామంలో ’’రైతు గోస‘‘ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ ఆమె  కెసిఆర్ విధానాలను తీవ్రంగా తప్పు పట్టారు. ఆమె ఇంకా ఏమన్నారంటే…

“పోడు రైతులు దశాబ్దాలుగా కన్నీళ్లు పెడుతున్నారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  పోడు పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూముల్ని గుంజుకుని రైతులపై దాడులు చేయించి, వారిని జైలులో పెడుతున్నారు.  భూమిని, రైతులను వేరు చేయడమంటే తల్లిని, బిడ్డను వేరు చేసినట్టే. ఏళ్ల‌ త‌ర‌బ‌డి భూ స‌మ‌స్య‌లు పరిష్కారం కాకపోవడంతో పోడు రైతులు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఎండిపోయాయి.

” ’ఈ భూమి మాది‘ అని చెప్పుకునే అధికారం కూడా రైతులకు లేకుండా పోయింది. ఆనాడు వైయ‌స్ఆర్ గారు పాద‌యాత్ర చేసి, పోడు రైతుల బాధలు విన్నారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పోడు ప‌ట్టాలు పంపిణీ చేశారు.  కేసీఆర్ ఎనిమిదేండ్లుగా అధికారంలో ఉండి ఒక్క ఎకరాకు కూడా పట్టాలు ఇవ్వలేదు.

” ఎస్సీ, ఎస్టీలంటే కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారు. వాళ్లను మ‌నుషుల్లాగే చూడ‌టం లేదు. పోడు సాగు చేసుకుంటే వారిని అడ్డుకుని జైలులో పెడుతున్నారు. చంటి పిల్లల తల్లలనూ వదిలిపెట్టలేదు. జైలులో తిండి పెట్టకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? రౌడీయిజమా? పాలకులు ప్ర‌జాసంక్షేమాన్ని ప‌క్క‌నపెట్టి, దోచుకునే పనిలోనే పడ్డారు

“రాష్ట్రంలో ప్ర‌జ‌లు పేదరికంలో మగ్గుతున్నా, కేసీఆర్ గారు మాత్రం గడీలు దాటడం లేదు. ప్రజలు కష్టాలు పడాలి. కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలుతూ భోగాలు అనుభవించాలి.  కేసీఆర్ గారు రైతుల్ని కోటీశ్వరులను చేశామ‌ని, కార్లల్లో తిరుగుతున్నారని చెబుతున్నారు. మ‌రి రైతుల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తే రైతులు ఆత్మ‌హ‌త్య‌లు ఎందుకు చేసుకుంటున్నారు?  కేసీఆర్ పాల‌న‌లో ప్రతి సంవత్సం వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి.  ఎన్నికల సమయంలో కేసీఆర్ రైతుల‌కు రుణమాఫీ చేస్తామ‌ని వాగ్ధానం చేశారు. రుణమాఫీ కాకపోవడంతో అప్పులు పెరిగి రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

” రైతులకు ముష్టి వేసినట్లు ఎకరాకు రూ.5 వేలు ఇచ్చి, రూ.25 వేల విలువైన‌ పథకాలు బంద్ పెడుతున్నారు. ఆనాడు వైయస్ఆర్ 20శాతం బోనస్ ఇచ్చి వడ్లు కొన్నాడు.  స‌న్న వ‌డ్లు పండిస్తే శ్ర‌మ ఎక్కువ అని అధిక ధ‌ర చెల్లించి కొన్నారు. నేడు కేసీఆర్ రైతుల‌ను అన్ని విధాలుగా మోసం చేశారు. అటు పాలకపక్షం ప్రజలను గాలికొదిలేస్తే ఇటు ప్రతిపక్షాలు ప్రజలకు వెన్నుపోటు పొడిచాయి. అందుకే ప్రజలపక్షాన YSR తెలంగాణ పార్టీని స్థాపించాం.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *