(మధు యాష్కీ గౌడ్)
వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీలో ఉన్నా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ప్రధానమంత్రిని కలవడు, సంబంధిత మంత్రులను కలవడు.. కొనుగోలకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాడు.
కానీ రాష్ట్రంలో మాత్రం ధర్నాలంటూ రహదారులను దిగ్భంధిస్తున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోసను పట్టించుకోకుండా తమ అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బతుకులను బజారు పాల్జేస్తున్నాయి.
వరిధాన్యం ఇప్పటికే కల్లాల్లోకి వచ్చింది.. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని ఎమ్మెస్పీ రూ. 1900 ఉంటే, రూ.400 నుంచి రూ. 500 తక్కువగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలారా గమనించిండి.. కేంద్రం కొనకపోతే నేను కొంటానని కేసీఆర్ అంటాడు.. కానీ అప్పటికే ధాన్యం మొత్తం రైస్ మిల్లర్ల చేతిలోకి వెళ్లిపోయి ఉంటుంది.
రైస్ మిల్లర్ల దగ్గర నుంచి గత రబీలో చేసినట్లే తెలంగాణ ప్రభుత్వం మిల్లర్ల దగ్గర ఎమ్మెస్పీ ధరకు కొంటుంది.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు పేరుతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెద్ద కుంభకోణం చేస్తున్నాడు.
తెలంగాణ రాష్ట్ర సమితి అవినీతిపైన కేంద్రానికి నివేదిక ఇచ్చిన గవర్నర్ గారు.. ఈ నివేదకలో రైస్ మిల్లర్లతో కుమ్మక్కై తెలంగాణ ప్రభుత్వం వందల వేల కోట్ల రూపాయాలను రైతుల జేబులు నుంచి కొల్లగొడ్తోంది.. దాచుకుంటోంది.. దోచుకుంటోంది. ఈ విషయాన్ని పేర్కొన్నారని ఆశిస్తున్నాను.
దీనిపైన ప్రధాని నరేంద్ర మోదీ – బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల కుటుంబంపైనా, ముఖ్యమంత్రిపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను.
టీఆర్ఎస్ పార్టీ నాయకులు-రైస్ మిల్లర్లతో కుమ్మక్కై చేస్తున్న అవినీతిని నిగ్గు తేల్చాలి.
రైస్ మిల్లర్లు.. రైతులకు క్వింటాల్ కు మద్దతు ధరకన్నా రూ. 400 నుంచి రూ. 500 తక్కువగా ఇస్తున్నప్పటికీ విజిలెన్స్ ఎందుకు దాడులు చేయడం లేదు? క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదు?
ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదో ప్రజలకు చెప్పాలి.
అధికారంలో ఉన్నవారు సమస్యలను పరిష్కరించాలి.
ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరంటే మీరు కొనాలని కొట్టుకోవడం అత్యంత దారుణం.. చేతగానితనానికి నిదర్శనం.
మీరు ప్రభుత్వం లో ఉన్నది సమస్యలను పరిష్కరించేందుకు మాత్రమే. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడం లేదో ప్రజలకు చెప్పాలి.
బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలు రెండూ కుమ్మక్కై రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి.
కొనుగోలు కేంద్రాలను వెనువెంటనే తెరవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను.
ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా? కేంద్రం కొంటుందా ? అన్నది రైతుకు అనవసరం.
పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోకానీ, కర్ణాటకలో కానీ ఎక్కడా కొనుగోలు సమస్య రాలేదు.. తెలంగాణలో మాత్రమే గత పంటనుంచీ ఎందుకు వచ్చింది?
2014 నుంచి 2018 వరకూ టీఆర్ఎస్-బీజేపీ కలిసున్న క్రమంలో ఈ ధాన్యం కొనుగోలు సమస్య రాలేదు.. త్వరలో ముందస్తు ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలోనే ముక్కోణపు పోటీని సృష్టించేందుకు టీఆర్ఎస్-బీజేపీ ఆడుతున్న ఎన్నికల డ్రామా మాత్రమే.
అధికారం కోసం మొన్న వానాకాలం.. ఇప్పుడు యాసంగిలో రైతును రెండు పార్టీలు గోస పెడ్తున్నాయి.
కల్వకుంట్ల కుటుంబం.. కల్ల మాటలు ఆపి కల్లాల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. రైతుల ప్రాణాలు కాపాడాలి.
రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోలు కేంద్రాలు మొదలు పెట్టాలి.
డీజిల్, పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలు పెరిగాయి. .. వీటికి తోడుగా తెలంగాణ ప్రభుత్వం తాజగా విద్యుత్ ఛార్జీలు పెంచింది. సామాన్య పేద ప్రజలను ధరలతో నడ్డి విరుస్తున్నారు..
కాళేశ్వరం అవినీతిని కప్పి పెట్టిన గవర్నర్ నరసింహన్ మంచోడు. బలహీనవర్గాలకు చెందిన మహిళా నాయకురాలు.. మీ అవినీతిని ప్రశ్నించినందుకు ఇప్పటి గవర్నర్ ను అవమానిస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది..
గతంలో ధర్మ పోరాటాల పేరుతో పక్కనున్న తెలుగు రాష్ట్ర నాయకుల ఉద్యమాలు చేస్తే ఏమైందో ఒక్కసారి తెలుసుకోండి. అధికారంలో ఉన్నవారు సమస్యలు పరిష్కరించకుండా డ్రామలు చేస్తున్న మీకు అదే గతిపడ్తుంది.
(మధు యాష్కీ గౌడ్, ప్రచార కమిటీ ఛైర్మన్ , తెలంగాణ కాంగ్రెస్)