చాన్నాళ్ల తర్వాత, ఈటల రాజేందర్ కౌంటర్ ర్యాలీ

తెలంగాణలో రైతుల  పేరుతో, ధాన్యం కొనుగోలు పేరుతో కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులు రాష్ట్రమంతా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. దానికి కౌంటర్ ర్యాలీని ఈ రోజు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నిర్వహించారు. కేంద్రం ధాన్యం కొనడం లేదనడం అబద్దం అని ఆయన అంటున్నారు.

 

– ఈటలరాజేందర్

 

కోమరభీం ఆసిఫాబాద్ జిల్లాలో:

నీళ్లకు నిలయం..
వర్షాలకు అడ్డా అదిలాబాద్.

గోదావరి పెనుగంగ ప్రాణహిత నదుల సంగమం.
అయినా కరువు కాటకాలతో అలమటిస్తుంది అదిలాబాద్ తూర్పు ప్రాంతం.

2008 కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా 38 వేల కోట్లతో అంబేడ్కర్ పేరు పెట్టి ఆయన విగ్రహం పెట్టీ పనులు ప్రారంభించారు.

సిర్పూర్, బెల్లంపల్లి నియోజకవర్గం, చెన్నూరు నియోజకవర్గం, ఆసిఫాబాద్ నియోజకవర్గం ఈ ప్రాంతాలకు 14 సంవత్సరాలు గడిచిపోయినా కూడా చుక్క నీరు రాలేదు.  కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలేశ్వరం పేరుమీద ఆగమేఘాల మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పని పూర్తి చేస్తున్నారు.. కానీ అసలు మొదలు పెట్టిన ఈ జిల్లాలో.. ఈ ప్రాంతంలో  కాలువలు తవ్వినప్పటికీ చుక్కనీరు ఇవ్వకుండా ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన వారు కేసీఆర్.
పాల్వాయి హరీష్ రావు ఆరు రోజులుగా పాదయాత్ర చేసి ప్రగతి భవన్ లో ఉన్న పెద్దలకు ఈ ప్రాంత ప్రజల ఆక్రందనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఈ ముగింపు సభకు నేను వచ్చిన.

కాలువల్లో నీళ్ళు ఉన్నా కెసిఆర్ వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు వేసుకోలేదు. తెలంగాణలో
రైతులు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు.

ఒకనాడు పల్లెలు బాగుపడకుండ బంగారు తెలంగాణ సాధ్యంకాదు అని చెప్పిన వారు కెసిఆర్.
పల్లెల్లో అన్నీ వర్గాలను ఆదుకొనే తల్లి భూతల్లి. కోట్ల మంది ప్రజానీకానికి ఉపాధి కల్పించేది వ్యవసాయం. అలాంటి వ్యవసాయం ను అయోమయంలో పడవేసారు కెసిఆర్.

 

 

కెసిఆర్ ఇచ్చిన మాటలు ఏవీ నెరవేరడం లేదు.

2018 ఎన్నికల సమయంలో 57 సంవత్సరాలు నిండినవారికి 2 వేలు ఇస్తా అని.. డబ్బాలో ఓట్లు వేసుకొని ఒడ్డు ఎక్కాక బోడ మల్లప్ప అన్నట్టు  వాడుకొని వదిలివేసిన వారు కెసిఆర్.

3016/- నిరుద్యోగ భృతి ఏమైంది?

కెసిఆర్ మాటలు గొప్పగా ఉంటాయి చేతలు మాత్రం ఉండవు. కెసిఆర్ మాటలు చేతలకు పొంతన ఉండదు.

ముసలివారిని, నిరుద్యోగులను మోసం చేసినట్టే కెసిఆర్ రైతులను మోసం చేశారు.

దేశమంతా వడ్లు కొంటుంటే ఒక్క తెలంగాణలో మాత్రం కొనడం లేదు. దేశమంతా లేని బాధ, కష్టం కేవలం మన దగ్గరే ఎందుకు వచ్చిందో రైతన్నలు ఆలోచించాలి.

ఉప్పుడు బియ్యం పెట్టం అని లేఖ రాసిన కెసిఆర్ నే మళ్ళీ పేచీ పెడుతున్నారు.

ఎండాకాలం కొంచం నూకలు ఎక్కువ అవుతాయి. అవి కూడా వృథా కావు.
అన్నిటికీ ధర ఉంది.

సీఎం గారు మీకు కూడా తెలుసు.. ఎండాకాలం పంటకు క్వింటాల్ కి 10 కేజీ లో 15 కేజీలు నూకలు ఎక్కువ వస్తాయి. వీటిని లెక్క కడితే ఎండాకాలం పంటమీద వచ్చే నష్టం 800 నుండి 1000 కోట్లు రావచ్చు.

కరెంటు ఫ్రీ, రైతు బందు, రైతు బీమా ఇస్తున్న రాష్ట్రం. ఇన్ని వేల కోట్లు ఇచ్చి 1000 కోట్ల దగ్గర
ఎందుకు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు కెసిఆర్ సమాధానం చెప్పాలి.

రాజకీయాలు చేస్తున్నారు.

కెసిఆర్ నువ్వు కుర్చీ లేకుండా బ్రతకలేవు,
అధికారం లేకుండా నీ కుటుంబం బ్రతుకలేదు.
అందుకోసం రైతులను బలిచేస్తారా ?

తెరాసా సొంత పార్టీ ఎమ్మెల్యేలే పొడు భూముల కోసం ఆందోలన చేసిన దిక్కు దివానా లేకుండా పోయింది.

మంత్రులకు అధికారం లేదు
ఎమ్మెల్యేలు చెప్తే పట్టించుకునేవారు లేరు.

హుజూరాబాద్ లో ఎన్ని అక్రమాలు చేసిన మా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.
ప్రజల గొంతుకను కాపాడుకొకపోతే బానిసలం అవుతామని నన్ను గెలిపించారు.

ఇది కేవలం హుజూరాబాద్ కే పరిమితం కాదు. తెలంగాణ అంతా వ్యాపిస్తుంది.

ఏ పార్టీ బుడ్డ పార్టీ..
దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది.
పార్లమెంట్ లో 542 స్థానాలు ఉంటే 303 స్థానాలు బీజేపీ గెలుచుకుంది.

రాజ్యసభలో 100 మంది ఎంపీలు కలిగిన పార్టీ బిజెపి.

18 కోట్ల సభ్యత్వం కల పార్టీ బీజేపీ.

ప్రజల పక్షాన పక్షిలా..
వారి  గొంతుకై కొట్లడుతున్నం.
మమ్ముల్ని కొట్టినా, జైల్లో పెట్టినా భరిస్తం తప్ప కొట్లాట ఆపేది లేదు.
కెసిఆర్ నీ కుట్రలు కుతంత్రాలు చేదిస్తాం.. భారతీయ జనతా పార్టీ నీ అధికారంలోకి తీసుకువస్తాం.

ప్రజల సమస్యలు అన్నీ మన ప్రభుత్వంలో తీరుస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *