ముఖ్యమంత్రి జగన్ చాలా పెద్ద మాట అన్నారు. నంద్యాలలో ఈ రోజు పర్యటించారు. తనకు ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ ఉన్నాయని, అలాంటపుడు ప్రతీ పక్షాలు అందరు కలిసి వచ్చినా కూడా ‘నా వెంట్రుక కూడ ఎవరు పీకలేరు’ అని అన్నాడు. ఇలాంటి మాట విద్యార్థుల సభలో అనడమే ఆశ్చర్యం. క్యాబినెట్ మంత్రులందరిని తీసేశాక జగన్ ఇలా మాట్లాడారు. అంటే అర్థం. ఏదైనా అభద్రతా భావం కలుగుతున్నదా?
జగనన్న వసతిదీవెన రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం విద్యార్థుల సభలో ప్రసంగించారు. వారి ముందు ఉన్నట్లుండి ఆవేశానికి లోనయ్యారు. ప్రతిపక్షాలతో పాటు మీడియా మీద అసభ్య పదజాలం ప్రయోగించారు.
” దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వారు వాళ్లు నావెంట్రుక కూడా పీకలేరు అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను,’ అని అనేశారు.
ముఖ్యమంత్రి ఇలాంటి భాషఅందునా బడిపిల్లల ముందు, ఓటు హక్కుకూడా ఇంకా రాని వారి ముందు ఇలా మాట్లాడటం భావ్యమా? దీని వెనక ఉన్నఅలజడి ఏమిటి?
అది కుసంస్కారం
“వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు” అంటూ ప్రతిపక్ష నాయకులను, మీడియాలో ఒక సెక్షన్ ను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల విద్యార్థుల సభలో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించడం ఆయన కుసంస్కారానికి నిదర్శనం. ముఖ్యమంత్రి స్థానం గౌరవాన్ని దిగజార్చడానికి మాత్రమే ఈ తరహా వ్యాఖ్యలు దోహదపడతాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తీవ్ర గర్హనీయం. వెంటాడుతున్న కేసులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ తదితర సమస్యలు, ప్రజల నుండి వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేజారి పోతుందేమోనన్న తీవ్ర ఆందోళనకు జగన్మోహన్ రెడ్డి గారు గురౌతున్నట్లుంది. అందుకే తిట్ల పురాణాన్ని ఆశ్రయించినట్లుంది. ముఖంలో ఒకనాటి ధీమా కూడా కనబడటం లేదు.
టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు