పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఆవిష్కరణ

చందమూరి

రాష్ట్రంలో నూతన జిల్లాలను ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేడు (4/4/22) ఆవిష్కరించారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు.19130 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న అనంతపురం జిల్లాను రెండు జిల్లాలు గా విభజించారు.అనంతపురం జిల్లా 1882లో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసారు.1882 కు ముందు అనంతపురం జిల్లా కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో కొంత భాగం,కడప జిల్లాలో కొంతభాగం ఉండేది.కడప జిల్లాలోనికదిరి,మదిగుబ్బ, నల్లమాడ, నంబులపూలకుంట, తలుపుల, నల్లచెరువు, ఓబులదేవరచెరువు, తనకల్లు, ఆమడగూరు మండలాలు 1910లో అనంతపురం జిల్లాలో కలిశాయి.

వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది.

2022లోఅనంతపురం నుంచి విడిపోయి శ్రీసత్యసాయి జిల్లాలు గా ఆవిర్భావం చేయడం జరిగింది. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా లో నాలుగు రెవెన్యూ డివిజన్లు , 8925.65 చదరపు కిలోమీటర్లువిస్తీర్ణం, 18.14లక్షల జనాభా,567 పంచాయతీలు , 3మున్సిపాలిటీలు ధర్మవరం ,హిందూపురం ,కదిరి,2నగర పంచాయతీలు పుట్టపర్తి ,మడకశిర ,1179.72 చదరపు కిలోమీటర్ల అడవులు 32మండలాలు ఉన్నాయి.

అనంతపురం జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 10204.35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ,22.40 లక్షల జనాభా,577 పంచాయతీలు , 6 మున్సిపాలిటీలు
,ఒక నగర కార్పొరేషన్ ,అనంతపురము కార్పొరేషన్,గుంతకల్ ,కల్యాణదుర్గం, పామిడి, రాయదుర్గం ,తాడిపత్రి ,గుత్తి మున్సిపాలిటీలు,790 చదరపు కిలోమీటర్ల అడవులు,31మండలాలు ఉన్నాయి.

నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుగొండ రెవిన్యూ డివిజన్ లో 12 మండలాలు పెనుకొండ, గుడిబండ, లేపాక్షి, హిందూపురం, మడకశిర, రొద్దం, సోమందేపల్లి, అగళి, రొళ్ల, అమరాపురం, చిలమ త్తూరు, పరిగి. నూతనంగా ఏర్పడిన పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ లో6మండలాలు , పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఓడీసీ, గోరంట్ల. ధర్మవరం రెవెన్యూ డివిజన్ లో 7 మండలాలు ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, ముది గుబ్బ. కదిరి రెవెన్యూడివిజన్ లో 7మండలాలు కదిరి, తలుపులు, తనకల్లు, గాండ్లపెంట, నంబూలపూ లకుంట, నల్లచెరువు, అమడగూరు.మొత్తం 32 మండలాలున్నాయి. హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గం సత్యసాయి జిల్లా లో ఉంటుంది అయితే హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం లోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం పుట్టపర్తి శ్రీ సత్య సాయి జిల్లాలో కొంతభాగం అనంతపురం జిల్లాలో కొంతభాగం కలిపారు.

దీంతో సత్యసాయి జిల్లా లో ధర్మవరం, పెనుగొండ , పుట్టపర్తి, మడకశిర , హిందూపురం, కదిరి 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చెన్నెకొత్తపల్లి ,రామగిరి, కనగానిపల్లి మండలాలు శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలో చేర్చారు. పెన్నా, చిత్రావతి, వేదవతి, పాపాఘ్ని, మొదలైన నదులు శ్రీ సత్యసాయి జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి.శ్రీ సత్యసాయి జిల్లాకు అనంతపురం జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రము సరిహద్దులుగా ఉన్నాయి.

అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ లో 11 మండలాలు రాయదుర్గం, డి.హిరేహాల్, కనేకల్లు , బొమ్మనహల్, గుమ్మ గుట్ట , కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం , సెట్టూరు, కుందుర్పి ,కంబదూరు, బెలుగుప్ప , అనంతపురం రెవెన్యూ డివిజన్ లో 12 మండలాలు అనంతపురం , తాడిపత్రి,కూడేరు , ఆత్మకూరు,పెద్దపప్పూరు ,సింగనమల,గార్లదిన్నె , పుట్లూరు,యల్లనూరు , నార్పల , బికేసముద్రం , రాప్తాడు నూతనంగా ఏర్పడిన గుంతకల్లు రెవెన్యూ డివిజన్ లో 8 మండలాలు ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు , గుత్తి ,పామిడి, యాడికి , పెద్దవడుగూరు మొత్తం 31 మండలాలు ఉంటాయి. అనంతపురం జిల్లాలో అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు ,తాడిపత్రి, సింగనమల ,అనంతపురం, కళ్యాణదుర్గం తో పాటు హిందూపురం పార్లమెంటు పరిధిలోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం లోని రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలు ఉన్నాయి. నూతన జిల్లాల ఏర్పాటుతో అనంతపురం జిల్లా నైసర్గిక స్వరూపం మారింది.

అనంతపురం జిల్లాకు శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రము సరిహద్దులుగా ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ల స్వరూపంలో కూడా మార్పులు జరిగాయి. గుంతకల్లు రెవెన్యూ డివిజన్ నూతనంగా ఏర్పడింది. అనంతపురం రెవెన్యూ డివిజన్ లోని 8 మండలాలను తొలగించి నూతనంగా ఏర్పడిన గుంతకల్లు రెవెన్యూ డివిజన్ లో చేర్చారు. పుట్టపర్తి కేంద్రంగా నూతనంగా ఆవిష్కరణ జరిగిన జిల్లాకు శ్రీ సత్య సాయి జిల్లా గా పేరు నిర్ణయం చేయడం జరిగింది. జిల్లాల పునర్ విభజన ముసాయిదా నోటిఫికేషన్ విడుదల తర్వాత కొన్ని అభ్యంతరాలు , విన్నతులు వెల్లువెత్తాయి. వాటిని స్వీకరించి సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరిపి తుది నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

4/4/2022 న నూతనంగా ఏర్పడ్డ శ్రీ సత్యసాయి జిల్లాలో సుమారు 60 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రథమ కలెక్టర్ గా బసంత్ కుమార్ ,ప్రథమ జాయింట్ కలెక్టర్ గా దినేష్ కుమార్ ,ప్రథమ యస్పీ గా రాహుల్ దేవ్ సింగ్ , ప్రథమ డిఆర్వో గా గంగాధర్ గౌడ్ కొత్తగా ఏర్పడ్డ పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ కు ప్రథమ ఆర్డీవో గా కె. యస్. భాగ్యరేఖ నియమితులయ్యారు.

Chandamuri Narasimhareddy

(రచయిత చందమూరి నరసింహారెడ్డి . ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *