బుష్ ‘ఇరాక్ యుద్ధా’నికి 19 యేళ్లు

అమెరికా ‘ఇరాక్ యుద్ధా’నికి 19 సంత్సరాలు…

అమెరికా చేసే యుద్ధాలన్నీ అబద్దాలు ప్రచారం చేసి చేసి చేసినవే.  ఇందులో పతాక స్థాయిలో అబద్దాలను ఒక దశాబ్దం పాటు కూడబెట్టి, శక్తి వంతమయిన ప్రచార సాధానాలతో, అంతర్జాతీయ టెలివిజన్లతో, వార్తా సంస్థలతో అబద్దాలను టామ్ టామ్ చేసి 2003లో మొదలు పెట్టిన యుద్ధం ఇరాక్ యుద్ధం.  అబద్దాల మీద నిలబడుకుని అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్  చేసిన యుద్ధం ఇరాక్ మీద దాడి అని ప్రపంచమంతా నమ్ముతూఉంది. ఈ యుద్దం మీద లండన్ కు చెందిన ప్రఖ్యాత అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు రాబర్ట్ ఇన్ లాకేష్  RT.COM లో ఇలా ఉన్నారు.

The US-led invasion of Iraq in March 2003 was a war now accepted to have been built on lies and is afraid to have killed as many as one million Iraqis.

ఈ యుద్దం ఎందుకు జరిగిందో అర్థమే కాదు.  ఇరాకీ అయిల్ కోసమా? సద్దాం హుసేన్ సేకరించిపెట్టుకున్న మారణాయుధాల కోసమా?  ఇంతకంటే బలమయిన కారణమేదయినా ఉందా? ఉందని జార్జ్ మేసన్ యూనివర్శిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్  ఆసన్ ఐ  బుట్ అంటున్నారు.  తన మాటకు ఎదురొస్తే పుట్టగతులుండవని సిరియా, ఇరాన్,లిబియా, నార్త్ కొరియా వంటి దేేశాలకు హెచ్చిరక చేసేందుకు బుష్ ఇరాక్ రక్తాన్ని  చూపించాలనుకున్నాడని ఆసన్ ఐ బుట్ (Why did Bush go to war in Iraq ?) Al Jazeera లో రాశారు.

కారణమేదయినా బుష్ సరిగ్గా 19 యేళ్ల కిందట ఇదే మార్చిలో ఇరాక్ మీదకు సైన్యాన్ని పంపించాడు.

సద్దాం హుసేన్ నాయకత్వంలోని ఇరాక్  లో ప్రపంచాన్ని ధ్వంసంచేసే మారణాయుధాలున్నాయనే వార్తను ప్రచారం చేసి బలవంతంగా ప్రపంచ ప్రజలను నమ్మించి,  నాటి దేశాధ్యక్షుడు బుష్ 2003 మార్చి 20న ఇరాక్ మీద దాడులు మొదలుపెట్టాడు. ఇరాక్ ఇసుకలో ఎన్ని మారణాయుధాలున్నాయో, వాటిని బుష్ ఎపుడు ప్రపంచానికి చూపిస్తాడో అని ప్రపంచమంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నపుడు ఆమెరికా “అబ్బే, అలాంటివేమీ లేవు, మాకు ఇంటెలిజెన్స్ వాళ్ల రాంగ్ ఇన్ ఫర్మేషన్ ఇచ్చారు, సారీ,” అని  ప్రకటించి బుష్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది.

ఇరాక్ లో ఉన్నమారణాయుధాలను ధ్వంసం చేయడం,  సద్దాంహుసేన్ అనే నియంతను తొలిగించి ఇరా క్ ఆమెరికా క్యాటగరి ‘ప్రజాస్వామ్యం’ ఏర్పాటుచేయడం ఈ దాడుల లక్ష్యమని అధ్యక్షుడు బుష్ 2003 నుంచి 2011 ప్రకటించని రోజంటూ లేదు.

అమెరికాకు ఇంగ్లండుతో పాటు అనేక నేటో దేశాలు తోడయ్యాయి. బాగ్దాద్ లో హారాహోరీగా పోరాడి ఫిర్దోస్ స్క్వేర్ లోని సద్దాం హుసేన్ విగ్రహాన్ని అమెరికా అండ్ కో సేనలు కూల్చేశాయి.

2003 మే 1న    యుఎస్ యుద్ధనౌక  USS Abraham Lincoln మీద నిలబడుకుని యుద్ధం ముగిసిందని ప్రకటించారు.

 

Iraq War begins: credit cfr.org

మే  23, 2003న  ఇరాక్ సైన్యాన్ని, ఇంటెలిజెన్స్ సర్వీస్ ని రద్దు చేశారు. కొయలిషన్ ప్రొవిజినల్ అధారిటీ అనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసి సద్దాం హుసేన్ మనుషులెవరూ ఎక్కడా కనిపించకుండా చేశారు. మోసుల్ నగరంలో సద్ధాం హుసేన్ కొడుకులు ఉదయ్,  ఖుసే అను అమెరికన్ సేనలు జూన్ 22, 2003న హతమార్చాయి.

అప్పటికింకా సద్దాంహుసేన్ జాడ తెలియ లేదు.  ఆగస్టు 19 ఒక ఆత్మహుతి దళం ఇరాక్ లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం మీద బాంబుదాడి చేసింది. ఇందులో ఐక్యరాజ్యసమితి స్పెషల్ రెప్రెజెంటేటివ్ సెర్జియో విఐరా డి మెల్లో తో పాటు  22 మంది ఉద్యోగులు హతమయ్యారు.

2003 డిసెంబర్ 14 ఇరాక్ లోని తిక్రిత్ అనే వూర్లో సద్దాం హేసేన్ ఒక రహస్య స్థావరంలో దాక్కుని ఉండటం కనుక్కున్నారు. దీనితో ఇక ఇరాక్ లో హింసాకాండ అంతమవుతుందనుకున్నారు. సద్దాం మీద యద్ధనేరాల విచారణ మొదలయింది.

2004 జనవరి 24 అమెరికా తన అబద్దాలను అంగీకరించింది. అణ్వాయుధాలు, రసాయన ఆయుధాలు, బయోలాజికల్ ఆయుధాలను సద్దాం హుసేన్ తయారు చేసి పెట్టుకున్నాడన్న  సమాచారం తప్పని అమెరికా అంగీకరించింది. అలాంటి వేవీ తమకు కనిపించలేదని చెప్పింది. జనవరిలో డేవిడ్ (David Kay) అనే మాజీ అమెరికా ఆయుధాల ఇన్స్ పెక్టర్ కాంగ్రెస్ లో వాంగ్మూలం ఇస్తూ “ దాదాపు మాలో ఆందరూ పొరబడ్దారు” ( We were almost all wrong) అని చెప్పాడు. సెనేట్ లో డేవిడ్ కే ఇచ్చిన వాంగ్మూలాన్ని CNN చక్కగా రిపోర్టు చేసింది.

తర్వాత ప్రెసిడెన్సియల్ కమిషన్ ఒకటి  దీని మీద విచారణ జరిపింది. యుద్ధానికి ముందు ఇరాకి మారణాయుధాల మీద  అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్లు చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం (not one bit) కూడా రుజువు కాలేదు.

On the brink of war, and in front of the whole world, the United States government asserted that Saddam Hussein had reconstituted his nuclear weapons program, had biological weapons and mobile biological weapon production
facilities, and had stockpiled and was producing chemical weapons. All of this was based on the assessments of the U.S. Intelligence Community. And not one bit of it could be confirmed when the war was over. (Source: The WMD Commission Report) అయినా, ఇరాక్ లో అమెరికా క్యాటగరి ప్రజాస్వామ్యం రాలేదు.

2006 నవంబర్ 5 సద్దాం హుసేన్ కు కోర్టు మరణ శిక్ష విధించింది.

Pic credit: cfr.org

నవంబర్ 8, 2006 లో అమెరికా రక్షణ మంత్రి డొనాల్డ్ రమ్స్ ఫీల్డ్ ‘ అబద్దాలతో యుద్ధం చేసినందుకు’ రాజీనామా చేశాడు.

డిసెంబర్ 30, 2006న సద్దాం హుసేన్  ఉరితీశారు. సద్ధాం కు తగిన శాస్తి జరిగిందని  ప్రెశిడెంట్ బుష్  ప్రకటించాడు. ఉరితీత సమయంలో కూడా సద్దాంని అవమాన పర్చారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది.

అయినా ఇరాక్ లో ప్రజాస్వామం తీసుకురాలేకపోయాడు. దేశం ధ్వంసమయినా, లక్షలాది ప్రజలు హతమయినా, వేలాది మంది సైనికుల ప్రాణాలు కోల్పయినా… రక్తం ఏరులై పారినా బుష్ ఇరాక్ కు ప్రజాస్వామ్యం తీసుకురాలేకపోయాడు.

2007 జనవరి 10న   మరొక 20 వేల మంది సైనికులను పంపి ఇరాక్ లో శాంతి స్థాపిస్తామని ప్రకటించాడు.వీళ్లంతా వచ్చి దారిద్ర్యంలో కూరుకుపోయినా ఇరాక్ లో జల్సా చేసుకున్నారు.  జూలై  2007లో క్యాంప్ విక్టరీ అనేచోట తాగి తందనాలాడారు.

సెప్టెంబర్ 14, 2007 కు ఇరాక్ లో ఉగ్రవాదులు తయారయ్యారు.

2008 మార్చి 24న బాస్రాలో హింసాకాండ మొదలయింది.

2008 ఏప్రిల్ 23న బుష్ ఇరాక్ పరిస్థితి చక్కదిద్దాలని కొత్త  కమాండింగ్ జనరల్ గా జనరల్ డేవిడ్ పేట్రేయస్ ను పంపాడు. ఇరాక్ దారికి రాలేదు.

2008 నవంబర్ 4న అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా వచ్చాడు.

ఇరాక్ ధ్వంసం చేసి, ఆర్థిక వ్యవస్థనుసర్వనాశనం చేసి, ప్రజాస్వామ్యం తీసుకురాలేక అమెరిక తోక ముడిచింది.  సుమారు 800 బిలియన్ డాలర్లు ఖర్చుచేసి, అబద్దాలు ప్రచారం చేసి, రక్త పాత  సృష్టించిన అమెరికా సేనలు 2011 డిసెంబర్ 11 ఇరాక్ నుంచి వెనుదిరిగిపోయారు. ఇదే కథ ఆఫ్గనిస్తాన్ లో కూడా పునరావృతమయింది. దశాబ్దంపాటు తిష్ట వేసి, అక్కడ ప్రజాస్వామ్యం తీసుకురాలేక, భారత్ చేత భారీగా ఖర్చు పెట్టి, కనీసం మాటవరకు  ఇండియాకు సమాచారం మీయకుండా  అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకునంది.

21 వ శతాబ్దంలో ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అది Made in USA… ఇపుడు  అమెరికా నేటో విస్తరణ కాంక్షకు, అధ్యక్షుడు  బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ వ్యాపార విస్తరణకు, అమెరికా సైన్యం బయోలాజికల్ పరీక్షలకు ఆసరా ఇచ్చి గొప్ప దేశం  యుక్రెయిన్ యుద్ధానికి బలయింది. యుక్రెయిన్ ప్రజలు అమెరికా –రష్యాల రాజకీయాలకు బలవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *