తెలంగాణలోశివాలయాల కు డబ్బులు కేటాయించడంలో, సౌకర్యాలు కల్పించడంలో వెనుకబాటుతనం ఉంది అని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వివక్ష లేకుండా శివాలయాలకు నిధులు అందిస్తామని రాజేందర్ అన్నారు.
ఈరోజు వికారాబాద్ జిల్లా, కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిదర్శించి ఆయన మొక్కు తీర్చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
తెలంగాణలో పేద ప్రజల దేవుడు బోలా శంకరుని దేవాలయాలు నిర్లక్ష్యానికి గురిఅవుతున్నాయి.
శైవలయాల్లో జరగాల్సినంత అభివృద్ధి జరగడం లేదు.
ప్రజాస్వామ్యం బ్రతకాలని హుజురాబాద్ లో ధర్మం గెలవాలని, ఈటల రాజేందర్ గెలవాలని అనేక మంది అనేక మొక్కులు మొక్కుకున్నారు.
వాటిని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాము.
అందులో భాగంగా ఈరోజు వికారాబాద్ జిల్లా, కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి మొక్కు తీర్చుకున్నం.
ఈ దుర్మార్గపు పాలన పోయి సుపరిపాలన రావాలని కోరుకున్నా.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత శివుని ఆలయాలు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాము, నిధులు కేటాయించి అందరి విశ్వాసాలను కాపాడతాము.