ఈ  రోజు ప్రపంచ ఇడ్లీ దినం, విశేషమిదే…

 

ప్రతి సంవత్సరం మార్చి 30న ప్రపంచ ఇడ్లీదినం జరుపుతారు. ఇది 2015లో మొదలయింది. దక్షిణ భారత టిఫిన్ లలో ఇడ్లీ దోసెలదే  నెంబర్ 1. ఈ రెండింటిలో ఎవరు గొప్పో చెప్పడం కష్టం. బ్రేక్ ఫాస్ట్ కు సంబంధించి చాలా పౌష్టికంలో గాని, రుచిలో గాని, జీర్ణానికి సంబంధించి గాని చాలా మంది ఇడ్లీయ బెస్ట్ అంటారు.అందుకే జబ్బు పడిన వాళ్లు, డైటింగ్ చేస్తున్నవాళ్లు, పాక్షిక ఉపవాసం ఉంటున్న వాళ్లే కోరేది ఇడ్లీయే.

ప్రపంచ దినం జరుపుకునే యోగం ఇడ్లీ కే దక్కింది.  కారణం, ఎం. ఎనియవన్ అనే ఇడ్లీ క్యాంటీన్ యజమాని. ఎనియవన్ ఇడ్లీ తెగు పాపులర్ చేశాడు. ఆయన ఇడ్లీ మీద చే యని ప్రయోగం లేదు.  2000 రకాలను ఆయన విక్రయిస్తాడు. అందుకు ఇడ్లీ ఎనియవన్ అంటుంటారు. అయితే, ఎనియవన్  ఇడ్లీ మేన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందాడు.మార్చి 30న ప్రపంచ ఇడ్లీ దినం పాటించాలని ఆయన నిర్ణయించాడు. అది పాపులర్ అయింది.  మార్చి30నే ఎందుకు ఎన్నుకున్నాడనేది తెలియదు.

li Man M Eniyavan / Times of India

ఎనియవన్ మొదట ఆటోడ్రైవర్. సొంతవూరు కొయంబత్తూరు. ఆటో అదిగట్టుబాటు కాలేదు.  తర్వాత బతుకుదెరువుకు ఆయన చెన్నై వలస వచ్చాడు. దాంతో హోటల్ పనికి కుదిరాడు. మొదట్లో ఒక హోల్ సేల్ ఇడ్లీ సెల్లర్ దగ్గిర క్లీనర్ గా పనిచేశాడు.  ఆతర్వాత సర్వర్ అయ్యాడు.  తర్వాత రెండు ఇడ్లీ పాత్రలతో సొంతంగా ఇడ్లీ వ్యాపారం మొదలుపెట్టాడు.  తర్వాతేమయింది? ఆయన ఇడ్లీ పండితుడయ్యాడు. ఆదే నడుస్తున్న చరిత్ర. ఇదీ అదీ అని లేదు. ఏ ఇడ్లీ కావాలన్నా ఆయన తయారు చేసి ప్లేట్ లో శుభ్రంగా అమర్చి అందిస్తాడు. ఆయన దగ్గిర తెల్లడిచందమామ లాంటి ఇడ్లీ లే కాదు, పళ్లతో, కాయలతో చేసిన ఇడ్లీలు లభిస్తాయి. చాకొలేట్ ఇడ్లీలున్నాయి. మికీ మౌస్, కుంగ్ ఫూ పాండా ఇడ్లీలున్నాయి. ఇపుడు ఆయన పిజా ఇడ్లీ బాగా పాపులర్ అయింది. ఆయన సృష్టించిన ఇడ్లీలో లేత కొబ్బరి గుజ్జు ఇడ్లీ సూపర్ హిట్. ఇడ్లీలో ఆయన ఎన్ని ఆటలాడతాడో లెక్కేలేదు. చట్నీ కూరిన ఇడ్లీ కూడా చాలలా ఫేమస్. చెన్నైలో ఆయన ఇడ్లీ క్యాంటీన్ పేరు మల్లిపూ ఇడ్లీ (Mallipoo Idli). అంటే మల్లెపూలంతా తెల్లగా సుకుమారంగా, మనసును ఆకట్టుకునేలాగా ఉంటాయనేగా అర్థం.

Pic Credit: Mallipoo Idli

ఇడ్లీ రుచియే కాదు, సైజు, ఆకారాలకు కూడా ఆయన చాలా ప్రాముఖ్యం. ఇస్తాడు. అదే తన వ్యాపార విజయ రహస్యం అని కూడా అంటాడు. ఇంతవరకు ఆయన 38 పిజి హాస్టళ్లకు 3,29,800 ఇడ్లీలు సప్లై చేశాడు. తనది చెన్నైలోనే బెస్ట్ ఇడ్లీ అని చెబుతాడు.

Pic Credit: Mallipoo Idli

ఆయన వెబ్ సైట్ లో తన ఇడ్లీ గురించి ఇలా రాసుకున్నాడు.

We are a Low-Cost wholesale supplier in Chennai who never compromise in our Idli Quality. We make sure that each Idli that we make is very authentic and of perfect shape. Our Mallipoo Idli is naturally very soft. Our Idlis lasts longer than any other idlis in the market and we keep up the quality by adding natural authentic ingredients.

Pic Credit: Mallipoo Idli

 

ఇలా సాదాసీదా పాత్రంలోనే ఆయన ఇడ్లీలు తయారవుతాయి.

Pic Credit: Mallipoo Idli

ఇన్నీ చేశాక ఆయన గిన్నీ స్ బుక్ కు ఎక్కడ కుండా ఎలా ఉంటాడు.  ఏకంగా 124.8 కేజీల ఇడ్లీ చేసే గిన్నీస్ రికార్డు సృష్టించాడు.

Pic Credit: Mallipoo Idli

మల్లిపూ ఇడ్లీ దొరికే అడ్రస్: జిజి మల్లిపూ ఇడ్లీ,  నెంబర్49, పెరుమాల్ కోయిల్ స్ట్రీట్, కొత్తూర్, చెన్నై 600085 ఫోన్ నెంబర్ : 8754475338

GG Mallipoo Idli,  No.49, Perumal Koil Street,
Kottur, Chennai-600085 , Mobile No. 8754475338

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *