చంద్రబాబు ‘పెగసస్’పై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వివరణ

మాజీ ముఖ్యసమంత్రి చంద్రబాబు నాయుడు పెగసస్ నిఘా సాఫ్ట్ వేర్ కొన్నాడని వస్తున్న ఆరోపణలపై తెలుగు దేశం ప్రభుత్వం లో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా ఉండిన ఏబీ వెంకటేశ్వరరావు నేడు వివరణ ఇచ్చారు.

ప్రజల భయాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని పెగాసస్‍పై వస్తున్న సందేహాలను నివృత్తి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు

మీడియా సమావేశములో ఆయన చెప్పిన వివరాలు:

పెగాసస్ కొనలేదని ఇప్పటికే డీజీపీ కార్యాలయం తెలిపింది.

అప్పటి డీజీపీ ఆఫీస్ కాకుండా మరొకరు కొన్నారని ఆరోపిస్తున్నారు . అయినా కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరి ఫోన్లు ట్యాప్ కాలేదు.. అందరూ నిశ్చితంగా ఉండండి.

అసత్యాలు, అసంబద్ధ వాదనలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టవద్దు. ఎప్పుడూ కొనని, వాడని దానికి నాకు ముడిపెట్టడం ఏమిటో అర్థం కావడం లేదు.

గత ప్రభుత్వంలో నిఘా ఛీఫ్‍గా ఉన్నందున నాకు పూర్తి సమాచారం ఉంది.

మే 2019 వరకు ఏ ప్రభుత్వ సంస్థ పెగాసెస్ కొనలేదు. మే 2019 తర్వాత ఏం జరిగిందో నాకు నాపై ఆరోపణలు పరమ టైమ్ వేస్ట్ తప్ప మరొకటి కాదు.

ఏ విచారణకూ నేను వెనుకంజ వేయలేదు. ఇదే విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మూడు వినతి పత్రాలు ఇచ్చాను.

నన్ను ఇరికించడం కోసం కొందరు అధికారులు తప్పుడు పత్రాలతో విఫలయత్నాలు.ఈ అధికారుల ప్రయత్నాలపై రుజువులతో సహా సమర్పించి విచారణ జరపాలని కోరా.. ఇంతవరకూ స్పందన లేదు.

ఏపీ నుంచి కొన్ని పత్రాలు రాలేదని కేంద్రం చెబుతోంది

నా సస్పెన్షన్ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‍లో ఉంది.

నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేయత్నాలు చేసినవారిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతి కోరా.

సాక్షి పత్రిక, సాక్షి చానెల్, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అబ్బయచౌదరి, విజయసాయిరెడ్డి, పయనీర్ పత్రిక, స్వర్ణాంధ్ర మధ్యాహ్న పత్రిక, గ్రేట్ ఆంధ్ర డాట్‍కామ్‍పై పరువు నష్టం దావా వేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరా.

సాక్షి మీడియా ద్వారా విష ప్రచారం ఎంత వరకు నైతికం?

నాపై సీపీ‍ఆర్‍వో చేసిన ప్రచారానికి, ప్రభుత్వ చార్జిషీట్‍కు ఏమైనా పొంతన ఉందా?

ఒక్క రూపాయి తిన్నట్టుకాని ప్రభుత్వానికి నష్టం చేసినట్టుగానీ చార్జిషీట్‍లో లేదు.

30 ఏళ్ళపాటు దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేశా.

నేను దేశద్రోహినా.. చార్జిషీట్‍లో ఎక్కడుంది చెప్పండి.. సీపీఆర్‍వో గారూ..

నా కుమారుడిపై చేసిన ఆరోపణలు చార్జిషీట్‍లో ఎందుకు లేవు.

సీఐలకు పదోన్నతి విషయంలోనూ నాపై అసత్యాలు ప్రచారం చేశారు.

ఒకే సామాజికవర్గం వారు ఉన్నారనడం అబద్ధమని హోంమంత్రే చెప్పారు.

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏమన్నారో స్పష్టత లేదు .

పెగాసస్ అమ్ముకునేందుకు వచ్చినవారు పలువురి పేర్లు చెప్పారని తెలిసింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *