గుజరాత్ స్కూళ్లలో పాఠ్యాంశంగా భగవద్గీత

గుజరాత్  స్కూళ్లలో భగవద్గీతని పాఠ్యాంశం చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం అంటే 2022-23 విద్యాసంవత్సరం నుంచి భగవద్గీత శ్లోకాలు పాఠాల్లోకి ఎక్కువతాయి. ఈ విషయాన్ని గురువారం నాడు  విద్యా శాఖ మంత్రి జీతు వాఘాని అసెంబ్లీలో ప్రకటించారు.

ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు గీతను బోధిస్తారు. నేషనల్ ఎజుకేషన్ పాలసీ (NEP) కి అనుగుణంగా భగవద్గీత బోధించే విలువలను, ధార్మిక సూత్రాలను విద్యార్థులకు బోధించాలని  నిర్ణయించినట్లు వాఘాని చెప్పారు.

ఆధునిక విలువలతో పాటు ప్రాచీన సంప్రదాయాలను, విలువలను, చరిత్రను, వైజ్ఞానిక వ్యవస్థలను విద్యార్థులకు బోధించడానికి నేషనల్ ఎజుకేషన్ పాలసీ ప్రాధాన్యమిస్తున్నదనిమంత్రి సభకు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు భగవద్గీత ను బోధించాలన్ని నిర్ణయాన్ని ధృవీకరించారు.

ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు  సర్వాంగ శిక్షణ (Holistic eductation) అనే పాఠ్యపుస్తకంలో భగవద్గీత ఒక పాఠంగా చేరుతుంది.  9నుంచి 12వత తరగతులకు  ఫస్ట్ లాంగ్వీజీలో కథా రూపకంగా గీతను బోధిస్తారు.

ఇక ముందు గుజరాత్ స్కూళ్లలో ప్రార్థనలు, శ్లోక పఠనం, సంక్షిప్తీకరణ, నాటకం , క్వజ్ లలో పోటీలను నిర్వహంచడానికి ప్రాముఖ్యం ఇస్తుందని కూడా మంత్రి వాఘాని చెప్పారు.

భగవద్గీతకు సంబంధించి పాఠశాలలకు ఆడియో వీడి సిడిలను ప్రభుత్వమే సరఫరాచేస్తుందని ఆయన చెప్పారు.

ఎప్పటి నుంచో ప్రయత్నాలు

నిజానికి పాఠశాలల్లో భగవద్గీత బోధించడాని  2014లో మోదీ నాయకత్వంలో ఎన్ డిఎ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భగవద్గీత మీద అంతర్జాతీయ చర్చను ప్రారంభించింది ప్రధాని మోదీయే.  మొదటిసారి అమెరికాసందర్శించినపుడు ఆయన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు భగవద్గీత పుస్తకాన్ని బహూకరించారు.  తర్వాత  జపాన్ చక్రవర్తి అకిహిటో కి కూడా భగవద్గీత కాపీని కానుకగా ఇచ్చారు. జపాన్ చక్రవర్తికి గీతను అందిస్తూ ప్రధాని మోదీ ఆసక్తికరమయిన వ్యాఖ్య చేశారు.” For gifting I brought a Gita. I do not know what will happen in India  after this. There may be a TV debate on this. Our secular friends will create toofa  that what what does Modi think of himself?  He has taken  A Gita with him that means he has made this one also communal…. Any way, they should also have their livelihood and if I  am not therethen how will they earn their livelihood.”

తర్వాత నాటి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మ స్వరాజ్ భగవద్గీత ను జాతీయ పవిత్ర గ్రంథంగా గుర్తించాలనిప్రతిపాదించారు.

తర్వాత హర్యానా ప్రభుత్వం గీతను పాఠ్యాంశంగా చేస్తున్నట్లు ప్రకటించించింది. ఆతర్వాత తమిళనాడు అణ్ణా యూనివర్శిటీ  పోస్టు గ్రాజుయేట్ ఇంజనీరింగ్ విద్యార్థులకు భగవద్గీతను నాన్ కంపల్సరీ కోర్సుగా  చేర్చింది. AICTE నిర్ణయించిన ఆరు ఆడిట్ సబ్జక్టులను ప్రతపాదించింది. అందులో పర్సనాలిటి డెవెలప్ మెంటు ఒకటి.  స్వామి స్వరూపానంద సూచన మేరకు అణ్ణా యూనివర్శిటీ ఈ మద్భగవద్గీతను పర్సనాలిటి డెవెలప్ మెంట్ కింద పాఠ్యాంశంగా చేర్చింది.

అయితే,హైదరాబాద్ లోని బిర్లాఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో భగవద్గీతని 2012 నుంచే బోధిస్తున్నారు. 2012 -2019 మధ్య 12 బ్యాచ్ ల విద్యార్థులు అంటే సుమారు 2 వేల మంది  భగవద్గీతను చదువుకున్నారు. ఇందులో  300 మంది విద్యార్థులు  రాతపూర్వంగా ఫీడ్ బ్యాక్ ఇస్తూ గీతాబోధన ఎలా  ఉండాలో సూచనలిచ్చారు. ఈ సూచనల్లో మేధో స్పష్టత పెరిగిందని, నిష్ట,ఏకాగ్రత మెరుగుపడిందని,పర్సనాలిటి డెవెలప్ మెంట్ కు బాగా ఉపయోగపడిందని విద్యార్థులు చెప్పినట్లు గీత బోధించిన అరుణా లోల్ల  జర్నల్ ఆప్ రిలిజియన్ అండ్ హల్త్  రాశారు.

2015లో ముంబై మునిసిపల్ స్కూళ్లలో భగవద్గీత బోధించే ప్రయత్నం జరిగింది.

ఇపుడు గుజరాత్ ఒకడుగుకు ముందుకేసి ఈ 2022 -23 విద్యాసంవత్సరం నుంచి భగవద్గీత ను బోధించేందుకు దృఢమయన నిర్ణం తీసుకుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *