ప్రభాస్ ‘రాధేశ్యామ్’రివ్యూ

ప్రభాస్ గత కొంతకాలంగా రాధే శ్యామ్ అంటూ ప్యూర్ లవ్ స్టోరీ తో వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు వస్తున్నానంటూ ఊదరకొడుతున్నాడు.  అయితే జనాలు …సినిమాల జాతకాలు ట్రైలర్స్ రిలీజ్ అవగానే చదివేస్తారు. అందుకేనేమో భీమ్లా నాయక్ రిలీజ్ అప్పుడు సోషల్ మీడియాలో ఉన్న అలజడి, థియేటర్స్ దగ్గర ఉన్న హడావిడి అయితే రాధే శ్యామ్ థియేటర్స్ దగ్గర కానీ, సోషల్ మీడియాలో కానీ కనిపించలేదు. అంటే రాధే శ్యామ్ మీద క్రేజ్ లేకనా.. మాస్ మూవీ కాదు, లవ్ స్టోరీ మనకెందుకులే అనా అనేది చాలా మందికి అర్దం కాలేదు. సాహో వర్కవుట్ కాలేదు…చాలా కాలంగా తీస్తున్నారు…ప్రభాస్ జాగ్రత్తలు తీసుకునే ఉంటాడు….రాధే శ్యామ్ రచ్చ తో రికార్డులు సృష్టిస్తారు అనుకుంటూ ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లు కూడా సందడి చేయలేదు. అసలు రాధే శ్యామ్ విడుదలవుతుంది అనే ఇంట్రెస్ట్ అయితే ఆడియన్స్ లో కనిపించలేదు. దానిదేముంది సినిమా రిలీజ్ తర్వాత పెద్ద హిట్ అనిపించుకున్నవి చాలా ఉన్నాయి..ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరబోతోందా అనుకున్నారు వీరాభిమానులు. అయితే వారి అంచనా ఏ మాత్రం ఫలించేటట్లు కనపడటం లేదు. ఇంతకీ ఈ సినిమా మ్యాటర్ ఏంటి…అంతలా జనాలు,ఫ్యాన్స్ తో సహా ఉదాసీనత గా ఉండటానికి కారణం ఏమిటో రివ్యూలో చూద్దాం.

1976  లలో  విక్రమాదిత్య(ప్రభాస్‌) అనే కుర్రాదిదే హవా. అతనో ఓ గొప్ప జ్యోతిష్కుడు. హస్తసాముద్రికంలో అద్బుతాలు చేసినవాడు. అతని  అంచనాలు తప్పటం జరగలేదు. అప్పటి ప్రధాని  ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించబోతుందని ముందే చెప్పటంతో ఇండియా వదిలి విదేశాలకు వెళ్లిపోతాడు. ఆ క్రమంలో  ఇటలీలలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమ్మాయిలతో తిరుగుతూ డార్లింగ్ రచ్చ చేస్తూంటాడు. అయితే ప్రేమ,గీమా వంటివేమీ పెట్టుకోడు. అందుకు కారణం తన జాతకంలో ఆ రేఖలు లేవని నమ్మటమే. ఈ క్రమంలో  విక్రమాదిత్యకు ఓ రోజు ట్రైన్ లో అల్లరి పిల్ల డాక్టర్‌ ప్రేరణ(పూజా హెగ్డే) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఈ లోగా ఆమె గురించి ఓ విషయం రివీల్ అవుతుంది.  ప్రేరణ  క్యాన్సర్‌తో బాధపడుతుందని…. ఆమె రెండు నెలల కంటే ఎక్కువ కాలం బతకదని తెలుస్తుంది. కానీ ఆమె నిండు నూరేళ్లు బతుకుతుందని విక్రమాదిత్య చెప్తాడు. అది జరిగేపననేనా? విధిని ఎదిరించి..ఈ ప్రేమ సుఖాంతమవుతుందా? లేదా? అనేదే ఈ సినిమా కథ.

సినిమా గురించి లవ్ వర్సెస్ డెస్టినీ ఫైట్ అంటూ  ఇచ్చిన బిల్డప్ లో సగం కూడా ఈ సినిమా లో లేవు. గీతాంజలి నాటి పాయింట్ ని అంతే  పాతగా డీల్ చేసాడు. స్క్రిప్టుని వదిలేసి కేవలం విజువల్స్ ని నమ్ముకుని ముందుకు వెళ్లారు. దీనికి తోడు స్లో నేరేషన్ . ఫస్టాఫ్ లో వచ్చే ప్రేరణ,విక్రమాదిత్య లవ్ సీన్స్ లో ఎక్కడా డెప్త్ ఉండదు. దాంతో వాళ్లిద్దరు కలవాలని ఎక్కడా కోరుకోము. దాంతో సెకండాఫ్ లో వచ్చే సీన్స్ మరీ భారంగా, బోర్ గా అనిపిస్తాయి. కథ ఇటలీలోని అందమైన లొకేషన్స్ లో అలా అలా సాగిపోతూ ఉంటుంది తప్ప ఎక్కడా కూడా ఇంట్రస్టింగ్ గా సాగే మలుపులు ఏమీ కనిపించవు. చావు ,బ్రతుకుల మధ్య జరిగే కథ..కూడా చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతుంటుంది. కొన్ని సీన్స్ అయితే మరీ దారుణం. డీసెంట్ గా కనిపించే   విక్రమాదిత్య హఠాత్తుగా రోడ్ల మీద పరుగులు పెట్టడం చూస్తే కంపరమొస్తుంది. ఇక  హాస్పిటల్ బెడ్ పై జరిగే  కామెడీ అయితే ఆవలింతలు తెప్పిస్తాయి. డెత్ ప్రాక్టీస్ సీన్లో పూజను చూసినా సినిమా అప్పుడే చచ్చిపోయిందనిపిస్తుంది. ఇలా డైరక్టర్ అడగడుక్కీ సిగ్నల్స్ ఇస్తూంటాయి. ఏదైమైనా  భాగ్యశ్రీ .. జగపతిబాబు .. మురళీశర్మ .. జయరామ్ ఇంతమంది ఉన్నా సినిమాని భరించటం కష్టమనిపిస్తుంది. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి కానీ విషయం సరిగా లేనప్పుడు ఫలితం ఏముంటుంది.

చివరగా ఇది రాడ్డే శ్యామ్ అని అర్దం చేసుకోవాలి. సినిమాకు వెళ్లేటప్పుడు మనం కూడా జాతకాలు చూపించుకోవాలి అని గ్రహించాలి. అయినా ఈ సినిమా జాతకం ప్రభాస్ కథ విన్నప్పుడే పసిగట్టకపోవటమే బాధే శ్యామ్ అనిపించటానికి అసలు కారణం.

బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్
సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
పిఆర్ఓ : ఏలూరు శ్రీను
Run Time: 2 గంటల 18 నిముషాలు
విడుదల తేదీ: 11 మార్చి, 2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *