కెసిఆర్ కు వైద్య పరీక్షలు (వీడియో)

నీరసంగా ఉండటంతో తెలంగాణ ముఖ్యమంత్రికెసిఆర్ వైద్య పరీక్షల నిమిత్తం యశోదా ఆసుప్రతి చేరుకున్నారు. ఆయన ఎపుడూ సోమాజీగూడ యశోదాలోనే  పరీక్షలు చికిత్స చేయించుకుంటుంటారు.  ఈ సారి కూడా ఆయన భార్యతో కలసి ఆసుపత్రికి వచ్చారు.  ఆయన ఆరోగ్యం గురించి ఆసుపత్రి పెద్ద డాక్టర్ ఎం విరావుచెప్పారు.

“రెండ్రోజులుగా సీఎం కేసీఆర్ వీక్ గా ఉన్నారు. ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారు. ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తాం. జనరల్ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తాం. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు,” అని డా.ఎం.వి.రావు చెప్పారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ఆయన వెంబడి భార్యశోభ తోపాటు పాటు కూతరు ఎమ్మెల్సీ కవిత, మేనల్లుడు రాజ్యసభ ఎంపి సంతోష్ కుమార్ కూడా ఆసుపత్రికి వచ్చారు. తర్వాత కుమారుడు ఐటి మంత్రి కెటి రామారావుకూడా ఆసుపత్రికి చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *