తిరుపతిలో ఒకే చోట సూపర్ స్పెషాలిటీ వైద్యం

 

శ్రీపద్మావతి హృదయాలయం లాంటి ఆసుపత్రి దేశంలో ఎక్కడా లేదు,అమెరికా తరహాలో ఇక్కడ వైద్యం అందిస్తున్నారు: ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ అశోక్ రాజు ప్రశంసించారు.

తిరుపతిలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం తరహాలో చిన్న పిల్లలకు ఉచితంగా వైద్యం చేస్తున్న ఆసుపత్రి దేశంలో ఎక్కడా

లేదని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ కేన్సర్ కేర్ సలహాదారు పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు, చిన్న పిల్లల ఆసుపత్రి ప్రత్యేక వైద్యులు డాక్టర్ అశోక్ కె.అశోక్ కుమార్ రాజు ప్రశంసించారు.

టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి తో కలసి గురువారం సాయంత్రం వీరు చిన్నపిల్లల హృదయాలయం సందర్శించారు.

టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, చిన్న పిల్లల గుండె ఆసుపత్రి ప్రారభించిన మూడున్నర నెలల్లోనే 150 గుండె ఆపరేషన్లు చేసి పిల్లల ప్రాణాలు కాపాడారని చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చిన్న పిల్లల క్యాన్సర్ విభాగం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని వ్యాధులకు ఒకే చోట సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే ఏర్పాటు చేస్తామన్నారు

ఆసుపత్రిలో వార్డులు, ఐసీయూ, వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లు,యంత్రాలను పరిశీలించారు. ఆపరేషన్ చేయించుకుని ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యం అందుతున్న విధానం, అడ్మిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం డాక్టర్లు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమెరికా ఆసుపత్రుల తరహాలో ఇక్కడ ఉచితంగా వైద్యం అందిస్తున్నారని వారు అభినందించారు. ఆసుపత్రిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన వైద్య పరికరాలు ఉన్నాయన్నారు. చక్కటి వైద్యం అందిస్తున్న డాక్టర్ల బృందాన్ని వారు అభినందించారు.

టీటీడీ ఆధ్వర్యంలో త్వరలో నిర్మించనున్న చిన్న పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చిన్న పిల్లల.కేన్సర్ విభాగం కూడా ఏర్పాటు చేయాలని టీటీడీ చైర్మన్ ను ఆయన కోరారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలందరికీ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించి, కేన్సర్ సోకిన వారందరికీ మెరుగైన చికిత్సలు అందించి వారి ప్రాణాలు కాపాడాలని కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు.

టీటీడీ జెఈవో శ్రీ వీర బ్రహ్మం, ఎఫ్ఏసీఎఓ శ్రీ బాలాజి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ,, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఆర్ ఎం ఓ డాక్టర్ ….బర్ద్ ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి పాల్గొన్నారు.

టాటా క్యాన్సర్ ఆసుపత్రి సందర్శన…
అనంతరం జూపార్కు రోడ్డులో నిర్మిస్తున్న టాటా క్యాన్సర్ ఆసుపత్రిని వీరంతా సందర్శించారు. ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ డాక్టర్ బి.ఆర్ రమణన్ ఆసుపత్రిలోని వార్డులు, యంత్రాలు, రోగులకు అందించే సేవలు, సదుపాయాలను వివరించారు.

పింక్ బస్ లనీ ఒకే గొడుగు కిందకు రావాలి : డాక్టర్ దత్తాత్రేయుడు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులు, ట్రస్ట్ ల వద్ద ఉన్న క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించే పింక్ బుస్సులనీ ఒకే గొడుగు కిందకు తీసుకుని రావాలని డాక్టర్ దత్తాత్రేయుడు చెప్పారు. ఆసుపత్రి అధికారులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పింక్ బస్సులను ప్రాంతాల వారీగా విభజించి పరీక్షలు నిర్వహిస్తే ప్రజలకు.మేలు జరుగుతుందన్నారు. ఈ బస్సులు ప్రజల వద్దకే వెళ్లేలా కార్యాచరణ ఉండాలని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలన్నింటి మీద నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *