ఉక్రెయిన్ వార్ ఎటు పోవచ్చు చివరకు?

 

ట్రంప్ హయాంలో తమ “ప్రధమ శత్రువు చైనా” అనీ, “రెండవ శత్రువు రష్యా” అనీ అమెరికా ఓ విధానాన్ని ఎంచుకుంది. అది బైడెన్ హయాంలో మారిందా?

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

తాజా ఉక్రెయిన్ యుద్ధం కేవలం ఆ ప్రాంతానికే పరిమితమైన స్థానిక యుద్ధంగా చూడాలా? లేదా ఉనికిలో ఉన్న నేటి ప్రపంచ బలాబలాల పునస్సమీకరణ లక్ష్యం కోసం సాగే గొలుసుకట్టు యుద్ధ క్రమంలో ఓ భాగంగా చూడాలా? ఏది నిజం?

మహా సామ్రాజ్యాలకు శ్మశాన స్థలి (GRAVEYARD OF GREAT EMPIRES) గా ఆఫ్ఘనిస్తాన్ కి పేరుంది. ఉక్రెయిన్ యుద్ధం వెనక ఆఫ్ఘనిస్తాన్ పోషించిన పాత్ర కూడా ఏమైనా దాగి వుందా? ఒకవేళ ఉంటే అదేమిటి?

ట్రంప్ హయాంలో తమ “ప్రధమ శత్రువు చైనా” అనీ, “రెండవ శత్రువు రష్యా” అనీ అమెరికా ఓ విధానాన్ని ఎంచుకుంది. అది బైడెన్ హయాంలో మారిందా? ఐతే కారణం ఏమిటి?

వింటర్ ఒలింపిక్ సందర్భంగా బీజింగ్ లో 4-2-2022న జింపింగ్, పుతిన్ ల మధ్య కుదిరిన 5200 పదాలతో కూడిన ఒప్పంద పత్రం యొక్క విశిష్టత ఏమిటి? అది గత రిక్, బ్రిక్, బ్రిక్స్, షాంఘై ఫైవ్ కూటాల కంటే భిన్నమైనదా? ఐతే ఏమిటి?

21-2-2022న రష్యా ప్రజల్ని ఉద్దేశించి పుతిన్ ప్రసంగంలో జాతుల పట్ల లెనిన్ విధానం మీద ఏ దాడి చేశాడు? అది రేపటి పుతిన్ సర్కార్ చేపట్టే గమనాన్ని సూచిస్తుందా? ఐతే అది ఏ మార్గం?

నాటోలో ఉక్రెయిన్ ని చేరకుండా, తన దేశ పొలిమేర వరకు నాటో ని రాకుండా అడ్డుకునే వరకే పరిమితమై రష్యా యుద్ధ చర్యకు దిగిందా? లేదా ఉనికిలో ఉన్న “ప్రపంచ క్రమం” (EXISTING WORLD ORDER) ని మార్చే లక్ష్యం కోసం చేపట్టిందా?

ఈ యుద్ధం ఉక్రెయిన్ భౌగోళిక ప్రాంతం మీద పట్టు కోసం మాత్రమేనా? లేదా నల్లసముద్రంపై అదుపు సాధించి, దాని నుండి మధ్యధరా సముద్రంలోకీ, అక్కడ నుండి ఒకవైపు జిబ్రాల్టర్ జలాసంది ద్వారా అట్లాంటిక్, మరోవైపు సూయజ్ కాలువ, ఎర్ర సముద్రం, ఏడేన్ ద్వారా హిందు మహా సముద్రం వరకూ విస్తరించే భౌగోళిక వ్యూహంలో భాగమా?

ఈ యుద్ధం వెనక సహజ వాయువు, చమురు వనరుల పాత్ర ఏమిటి? ముఖ్యంగా పైప్ లైన్ల పాత్ర ఏమిటి?

యాబై ఏళ్ల క్రితం ఇదే ఫిబ్రవరిలో USSR వ్యతిరేక బీజింగ్ వాషింగ్టన్ ల మధ్య ఐక్యత ఏర్పడింది. ఈ ఫిబ్రవరిలో అమెరికా వ్యతిరేక రష్యా చైనాల మధ్య కుదిరింది. అది జరిగిన వారానికే 11-2-2022న అమెరికా వైట్ హౌస్ “ఇండో పసిఫిక్ స్ట్రాటజీ” పేరిట 19 పేజీల పత్రాన్ని విడుదల చేసింది. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి?

ఐదున్నర నెలల క్రితం 15-9-2021న ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా నేతృత్వంలో ఏర్పడ్డ “ఆకస్” సైనిక కూటమి ఏర్పడింది. ఆ లక్ష్యం బెడిసి కొట్టిందా?

నేడు ఉక్రెయిన్, రేపు తైవాన్ అనే వ్యూహం రష్యా చైనా ల మధ్య కుదిరి, తొలుత ఉక్రెయిన్ తో ప్రారంభమైనదా? ఇదే నిజమైతే, మలి లక్ష్యం ఇండో పసిఫిక్ ప్రాంతం అవుతుందా?

శతాబ్దాల తరబడి యూరోప్ కేంద్రంగా సాగే భౌగోళిక వ్యవస్థ త్వరలో ఆసియా కేంద్రంగా మారే అవకాశం ఉందా?

“ఏకద్రువ రాజ్యం” నుండి “ప్రపంచ పోలీసు” స్థానానికీ, అక్కడి నుండి కేవల అగ్రరాజ్య స్థానానికీ అమెరికా మారిందా? ఐతే దాని భవిష్యత్ గమనం ఎలా ఉండొచ్చు?

1870 లో జరిగిన ఫ్రాంకో జర్మన్ యుద్ధ గమనంలో ఒకదశ వరకు జర్మనీ చేసేది ఆత్మరక్షణ యుద్ధంగా మార్క్స్, ఎంగెల్స్ పేర్కొన్నారు. ఆ తర్వాత దురాక్రమణ యుద్ధంగా తమ వైఖరిని మార్చుకున్నారు. రష్యా చేసే తాజా యుద్దానికి కూడా అది వర్తిస్తుందా?

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి చోట్ల పులులపై మత మరకలతో అంద వికారమైన మేకలు చేసిన యుద్దానికి మద్దతు ఇవ్వక పోవడం; వృద్ధ పులిపై అందమైన యువ చిన్న పులి చేసే యుద్దాన్ని బేషరతుగా మద్దతు ఇవ్వడం మార్క్సిస్టు దృష్టి కోణంలో సరైనదా?

నిన్నటి ఐక్య రాజ్య సమితి ఓటింగ్ లో ఇండియా obstain చేయడానికి కారణం ఏమిటి? ఇండియా విదేశాంగ విధానంలో ఎందుకు ఈ ఆకస్మిక మార్పు జరిగింది?

(Danny Telugu TV ఇంటర్వ్యూ నుంచి)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *