గౌతమ్ రెడ్డి ఎలా చనిపోయారు?: ఫ్యామిలీ వివరణ

 

*అసలేం జరిగింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎలా మరణించారు. సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నయి. విపరీతంగా ఊహాగానాలు అల్లుతున్నారు. ఎవరూ కుటుంబాన్ని లేదా నిపుణులను సంప్రదిస్తున్న దాఖలా లేదు. ఇలా వస్తున్న అసత్యాలపై మంత్రి మేకపాటి కుటుంబం స్పందించింది. కుటుంబం అందించిన వివరాలు:

*మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవం.

*రాత్రి జరిగిన ఓ ఫంక్షన్ లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా ఇంటికి చేరిన మంత్రి మేకపాటి*

*06.00 గం.లకి రోజూలాగే ఉదయాన్నే మేల్కొన్నారు.

*06:30 గం.ల వరకూ మంత్రిగారు ఫోన్ లతో కాలక్షేపం చేశారు.

*07.00 గం.లకు మంత్రి నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చుని ఉన్న మంత్రి మేకపాటి

*07:12కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పిన మంత్రి గౌతమ్ రెడ్డి

*07:15గం.లకు హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లిగా కిందకి ఒరిగిన మంత్రి

*7:16 గం.లకు కంగారు పడి గట్టిగా అరిచిన మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి

*07:18 పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతిమీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించిన మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావు

*07:20 గం.లకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తం

*07:20 మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో.. మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచిన భార్య శ్రీకీర్తి

*07:22 “నొప్పి పెడుతుంది కీర్తి” అంటున్న మంత్రి మాటలకు స్పందించి వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరిన మంత్రి సిబ్బంది

*07:27 మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి గల 3 కి.మీ దూరాన్ని, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి చేర్చిన మంత్రి మేకపాటి డ్రైవర్,సిబ్బంది

*08:15 గం.లకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని తెలిపిన అపోలో వైద్యులు

*09:13 గం.లకు మంత్రి మేకపాటి మరణించారని నిర్ధారించిన అపోలో ఆస్పత్రి వైద్యులు

*09:15 గం.లకు మంత్రి మేకపాటి చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించిన అపోలో వైద్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *