ఆంధ్రా మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

హైదరాబాద్:

ఏపీ పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు అయితే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌతమ్ రెడ్డి మృతి చెందారు.

2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే గా  గౌతమ్ రెడ్డిగెలుపొందారు. ముఖ్యమంత్రి జగన్ కాబినెట్ లో గౌతమ్ చాలా కీలకమయిన మంత్రి.

మేకపాటి గౌతమ్‌రెడ్డి విశేషాలు:

జన్మస్థలం : బ్రాహ్మణపల్లి, మర్రిపాడు మండలం
తల్లిదండ్రులు : మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి
విద్యార్హత : ఎమ్మెస్సీ, టెక్స్‌టైల్స్‌(మాంచెస్టర్, యూకే)
కుటుంబం : భార్య – శ్రీకీర్తి, కుమార్తె అన్యన్యరెడ్డి,
కుమారుడు : అర్జున్‌రెడ్డి
బాధ్యతలు : కె.ఎం.సి. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌

రాజకీయ ప్రస్థానం

*2014లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా 30,191 ఓట్లతో గెలుపొందారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేశారు. మేకపాటి కుటుంబానికి జిల్లాలో రాజకీయంగా మంచిపట్టు ఉంది. వైఎస్సార్‌సీపీ తరఫున మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.

ఉపరాష్ట్రపతి సంతాపం

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరం. వారు ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కలిగిన నాయకులు.

శ్రీ గౌతమ్ రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. నేనంటే ఎంతో అభిమానం చూపేవారు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను,” అని ఉప రాష్ట్రపతి పేర్కోన్నారు.

*చంద్రబాబు సంతాపం

 

అమరావతి: రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి మృతి కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరం అన్నారు. మంత్రివర్గం లో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *