తెలంగాణ బస్తీ దవాఖానల్లో ఏముంటాయి?

పేదల సుస్తి పోగొట్టేందుకే బస్తీ దవాఖానాలు. ఈ కాన్సెప్ట్ హిట్. ఈ బస్తీ‌దవాఖానాల్లో ఏముంటయో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు చెబుతున్నారు.

***

సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం ,ఎస్.ఎన్ కాలనీ, బొంబాయి కాలనీ, LIG భారతీ నగరి కాలనీలో బస్తీ‌దవాఖానాలను  మంత్రి హరీశ్ రావు‌ ఈ రోజు ప్రారంభించారు. అక్కడ మంత్రి హరీశ్ రావు బస్తీ‌దవాఖానాల గురించి వివరించారు ఇలా:

బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు ప్రారంభించారు.

జీహెచ్ ఎంసి  పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ దవాఖానాల్లో నిపుణుడైన MBBS డాక్టర్, స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది మీకప వైద్య సేనలు అందిస్తారు.

ఉచితంగా వైద్య సేవలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయి.

బస్తీ దవాఖానాల్లో మీకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. టీ డయాగ్నసిస్ ద్వారా 57 రకాల పరీక్షలు మీకు ఉచితంగా చేస్తారు.

ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు‌ వృధా చేసుకోవద్దు.

ఈ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ బస్తీ దవాఖానాలు‌ అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని 15 వ ఆర్థిక సంఘం సూచించింది‌

టీ-డయాగ్నసిస్ ద్వారా మీరు రక్తం ఇస్తే అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి రిపోర్ట్ మీ సెల్ ఫోన్లకు అందుతుంది.

హైదరాబాద్ పరిథిలో 256 బస్తీ‌దవాఖానాల‌ ద్వారా సగటున ప్రతీ రోజు 2 లక్షల 50 వేల‌మంది ఉచిత‌ వైద్యం అందుతోంది.

పఠాన్ చెరులో ఇప్పటికే 3 బస్తీ దవాఖానాలున్నాయి. ఇవాళ మరో మూడు కొత్త దవాఖానాలు ప్రారంభించుకున్నాం.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక మందులు‌ లేవు అన్న సమస్యే ఉండదు.

పాము కాటు, కుక్క కాటు, డెంగ్యూ, మలేరియా ‌సహా అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆసుుత్రుల్లో అందుబాటులో ఉంటాయి.

ఇ ఇప్పటి వరకు కరోనా సేనలు అందించిన గచ్చిబౌలి లోని‌ టిమ్స్ లో ఇక అన్ని రకాల‌ వైద్య సేవలు , కార్పోరేట్ ఆ ఆసుపత్రుల స్థాయిలో అందుబాటులో ఉంటాయి.

గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో అందే అన్ని రకాల వైద్య సేవలు, గుండె,‌కిడ్నీ, కాలేయం సంబంధిత సర్జరీలు ఉచితంగా పేదలకు టిమ్స్ ద్వారా అందిస్తాం.

పేద ప్రజలకు ఉత్తమ సేవలు అందాలని సీఎం కేసీఆర్ గారు వైద్య రంగాన్ని బలోపేతతం‌ చేస్తున్నారు.

పేదలు ఖర్చు ఎక్కువ పెట్టేది వైద్యం, విద్య పైనే.

అందుకే‌సీఎం కేసీఆర్ పేదల పక్షపాతిగా కార్పోరేట్ ఆసుపత్రుల సేవలు అందిస్తూనే , కార్పోరేట్ విద్యా‌సంస్థల్లో అందే విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు మన ఊరప – మన బడి పథకానికి శ్రీకారం చుట్టారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *