శ్రీవారి భక్తులపై టీటీడీ “బోర్డు” పెత్తనం ఏంటి?

(నవీన్ కుమార్ రెడ్డి)

రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం సినిమా టికెట్ల ధరల నియంత్రణ లాంటి విషయంలో కూడా సినీ పరిశ్రమ ప్రముఖులతో చర్చించి మంత్రివర్గ కమిటీని నియమించి నెల రోజులుగా కసరత్తు చేస్తున్నారు కానీ కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్న ఆర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపు విషయంలో భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేయకుండా టీటీడీ ధర్మకర్తల మండలి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సమంజసమా!

తిరుమలకు వచ్చే భక్తుల ఆహారపదార్థాల ప్రకటన విషయంలో టీటీడీ ధర్మకర్తల మండలి పునః పరిశీలించాలి!

తిరుమల శ్రీవారి దివ్య క్షేత్రాన్ని “వ్యాపార” కేంద్రంగా మార్చకండి!

కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న హిందూ ధార్మిక క్షేత్రంగా పరిగణించి భక్తులు మెచ్చే విధంగా టీటీడీ బోర్డు నిర్ణయాలు పదికాలాలపాటు నిలిచే విధంగా శ్రీవారికి సేవకులుగా ఆలోచించండి!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎప్పటినుంచో నిత్య అన్నదాన పథకం ద్వారా ఉచితంగా అన్నప్రసాదాలు అందిస్తున్నారు భక్తితో స్వీకరించాలే తప్ప బలవంతంగా భక్తులపై టీటీడీ బోర్డు రుద్దే ప్రయత్నం చేయడం తగదు!

తిరుమల శ్రీవారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని స్థానికులు టీటీడీ అనుమతితో నెల అద్దె చెల్లిస్తూ హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ద్వారా వివిధ రాష్ట్రాల భక్తుల అభిరుచులకు తగ్గట్టుగా ఆహార పదార్థాలు అందించడం జరుగుతుంది!

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో తిరుమల కొండకు వచ్చే వి వి ఐ పి ల నుంచి సాధారణ భక్తుల వరకు ఉచితంగా అన్నప్రసాదం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం
కానీ
భక్తులకు నచ్చిన చోట ఆహార పదార్థాలు తినే విధంగా తిరుమల కొండపై యధావిధిగా ప్రైవేట్ హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కొనసాగించండి!

టిటిడి బోర్డు అన్న ప్రసాదాల విషయంలో చూపిస్తున్న శ్రద్ధ శ్రీవారి దర్శనాల విషయంలో చూపించి సామాన్య భక్తుల తరహాలో “విఐపిలను” “ధర్మకర్తల మండలి సభ్యులను” “ప్రజాప్రతినిధులను”పారిశ్రామికవేత్తలను, సెలబ్రెటీలను “సర్వదర్శనం క్యూ లైన్” ద్వారా దర్శనం చేసుకోమని బోర్డు లో తీర్మానం చెప్పగలరా!

నవీన్ కుమార్ రెడ్డి

తిరుమలలోని హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో భక్తులకు అందుబాటు ధరలలో ఆహార పదార్థాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నదానిపై తిరుమల ఆరోగ్య,రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించాలి!

తిరుమల శ్రీవారిని నమ్ముకొని మాస్టర్ ప్లాన్ లో భాగంగా టీటీడీ కి సహకరించి ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తూ శ్రీవారి భక్తులకు అన్ని వేళలా ఆహార పదార్థాలను అందిస్తూ జీవనం కొనసాగిస్తున్న హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకుల “కడుపు” కొట్టడం అన్యాయం!

“తిరుపతి జిల్లా”గా ప్రకటించాలని అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ధర్మకర్తల మండలిలో అధికారులు సూచించడం బోర్డు ఆమోదించడం “దైవానుగ్రహం శుభపరిణామం”

అన్నమయ్య నడక మార్గాన్ని అలాగే కొనసాగించండి అన్నమయ్య “ఘాట్ రోడ్” ఆలోచనను విరమించుకావాలి లేనిచో “హైకోర్టును” ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నాను!

తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే “సుప్రభాతం” “తోమాల” “అర్చన” లాంటి ఆర్జిత సేవలను సామాన్య భక్తులకు స్థానికులకు దూరం చేయకండి సిఫారసు లేఖలతో వచ్చే వారికి మాత్రమే దరలు పెంచామని టిటిడి బోర్డు ప్రకటించడం చూస్తే బడా పారిశ్రామికవేత్తలకు “రెడ్ కార్పెట్” స్వాగతం పలకడమే!

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో “లోకల్ అడ్వైజరీ కమిటీ” చైర్మన్ లు గతంలో ఎన్నడూ పాల్గొన్న సందర్భాలు లేవు దానిపై భక్తులకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత టిటీడీ పై ఉంది!

(నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *