తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది.
రథసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు సాగిన కల్యాణ మహోత్సవాల్లో కీలక ఘట్టమైన స్వామి వారి పరిణయోత్సవమ్ ఘనంగా జరిగింది.
పరిణయ వేదికను వివిధ పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు.
అర్ధ రాత్రి 12గంటల35 నిమిషాలకు మృగశిర నక్షత్ర వృశ్చిక లఘ్నంలో శాస్త్రోక్తంగా కల్యాణం జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య కల్యాణ క్రతువును పూర్తిచేశారు. నరసింహుని వివాహాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
అంతర్వేది పావన గోదావరీ సాగర సంగమక్షేత్రం. బ్రహ్మదేవుడు యజ్ఞ యాగాలు, వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన పుణ్యస్థలి అని ప్రసిద్ధి. శ్రీరామ చంద్రుడు దర్శించుకున్న దివ్యధామం అంతర్వేది. లక్ష్మీ నరసింహుడు నిత్య పూజలు అందుకునే పవిత్ర ప్రాంతం. విశేష ప్రాశస్త్యమున్న అంతర్వేది లక్ష్మీ నరసింహుని కళ్యాణ మహోత్సవాలు వైభవంగా మొగిసాయి.