(చందమూరి నరసింహారెడ్డి)
రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా 19130 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న అనంతపురం జిల్లా రెండు జిల్లాలు గా విడిపోతుంది.
అనంతపురం , శ్రీసత్యసాయి జిల్లాలు గా ఆవిర్భావం జరుగుతుంది. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడనున్న శ్రీ సత్యసాయి జిల్లా మూడు రెవెన్యూ డివిజన్లు తో , 7,771 చదరపు కిలోమీటర్లువిస్తీర్ణం తో అనంతపురం జిల్లా మూడు రెవెన్యూ డివిజన్లుతో 11,359 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తోఏర్పాటు కానున్నాయి.
కదిరి రెవెన్యూ డివిజన్ లోని నల్లమాడ ,పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్టణంమండలాలు ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేసిఅందులోని నాలుగుమండలాలు ధర్మవరం, బత్తలపల్లి ,తాడిమర్రి ,ముదిగుబ్బ మండలాలు మొత్తం 8 మండలాలుతో పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పడుతుంది.
ధర్మవరం రెవెన్యూ డివిజన్ నుంచి నాలుగు మండలాలు ఇతర రెవెన్యూ డివిజన్లలో కలపనున్నారు .ఇకనుంచి ధర్మవరం రెవెన్యూ డివిజన్ ఉండదు. రామగిరిమండలం కళ్యాణదుర్గం రెవిన్యూ డివిజన్ లోకి కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి ,రాప్తాడు మండలాలు అనంతపురం రెవెన్యూ డివిజన్ లో కలపనున్నారు.
నూతనంగా ఏర్పాటుకానున్న శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుగొండ రెవిన్యూ డివిజన్ లోని 13 మండలాలు, పెనుగొండ,పరిగి ,గోరంట్ల, సోమందేపల్లె ,రొద్దం, హిందూపురం , లేపాక్షి చిలమత్తూరు ,మడకశిర, అమరాపురం, గుడిబండ ,రొళ్ల , అగళిమండలాలు. నూతనంగా ఏర్పడనున్న పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ లోని 8 మండలాలు , కదిరి రెవెన్యూ డివిజన్ లోని కదిరి తలుపుల, నంబులపూలకుంట, గాండ్లపెంట ,నల్లచెరువు, తనకల్లు , ఒడి చెరువు, ఆమడగూరు మండలాలు మొత్తం 29 మండలాలు ఉంటాయి.
హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గం సత్యసాయి జిల్లా లో ఉంటుంది. అయితే హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం లోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం పుట్టపర్తి శ్రీ సత్య సాయి జిల్లాలో కాకుండా అనంతపురం జిల్లాలో కలిపారు .దీంతో ధర్మవరం, పెనుగొండ , పుట్టపర్తి, మడకశిర , హిందూపురం, కదిరి 6 అసెంబ్లీ నియోజకవర్గాలు శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలో ఉంటాయి.
అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ లోని రాయదుర్గం, డి.హిరేహాల్, కనేకల్లు ,బొమ్మనహల్, గుమ్మ గుట్ట ,కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం ,సెట్టూరు, కుందుర్పి ,కంబదూరు, బెలుగుప్ప ,రామగిరి 12 మండలాలు అనంతపురం రెవెన్యూ డివిజన్ లోని అనంతపురం ,తాడిపత్రి, కూడేరు ,ఆత్మకూరు, పెద్దపప్పూరు ,సింగనమల, గార్లదిన్నె ,పుట్లూరు, యల్లనూరు ,నార్పల ,బి కే సముద్రం ,కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి ,రాప్తాడు 14 మండలాలు ,నూతనంగా ఏర్పడే గుంతకల్లు రెవెన్యూ డివిజన్ లోని ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు ,గుత్తి ,పామిడి, యాడికి ,పెద్దవడుగూరు ఎనిమిది మండలాలు మొత్తం 34 మండలాలు ఉంటాయి.
అనంతపురం జిల్లాలో అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు ,తాడిపత్రి, సింగనమల ,అనంతపురం, కళ్యాణదుర్గం తో పాటు హిందూపురం పార్లమెంటు పరిధిలోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది. దీంతో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు అనంతపురం జిల్లాలో ఉంటాయి. నూతన జిల్లాల ఏర్పాటుతో అనంతపురం జిల్లా నైసర్గిక స్వరూపం మారనుంది. రెవెన్యూ డివిజన్ల స్వరూపంలో కూడా మార్పులు జరుగుతాయి. ధర్మవరం రెవెన్యూ డివిజన్ కనుమరుగవుతుంది. కదిరి రెవెన్యూ డివిజన్ పరిధి తగ్గిపోతుంది.
గుంతకల్లు రెవెన్యూ డివిజన్ నూతనంగా ఏర్పడుతుంది. అనంతపురం రెవెన్యూ డివిజన్ లోని 8 మండలాలను తొలగించి నూతనంగా ఏర్పడే గుంతకల్లు రెవెన్యూ డివిజన్ లో చేర్చనున్నారు. కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ విస్తీర్ణం పెరుగుతుంది. అనంతపురం రెవెన్యూ డివిజన్ విస్తీర్ణం తగ్గుతుంది. నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లాకు శ్రీ సత్య సాయి జిల్లా గా పేరు నిర్ణయం చేయడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నూతనంగా గుంతకల్లు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు .ఎన్నో దశాబ్దాలు నుంచి ఉన్న ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేయడం పలువురు వ్యతిరేకిస్తున్నారు. రెవెన్యూ డివిజన్లలో కూడా కొంత మేరకు మార్పులు చేసి కదిరి పెనుగొండ ధర్మవరం రెవెన్యూ డివిజన్ లోని అన్ని మండలాలను కలుపుకొని 4 రెవిన్యూ డివిజన్లు గా మార్చి నూతన శ్రీ సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది.
(చందమూరి నరసింహారెడ్డి . ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)