11 వ PRC పై మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమై , ఉద్యోగ విరమణ వయసు పెంచగానే ఈలలు వేసుకుంటూ బయటకు వచ్చిన ప్రభుత్వోద్యోగులు ఈ రోజు PRC పై వచ్చిన జీ. ఓ మీద చిందులేస్తున్నారు. ఉద్యోగ విరమణ వయసు పెంపు యువతరానికి ఎంత హాని చేస్తుందో వాళ్లనేతలు ఆలోచించలేదు. తమ ప్రయోజనం తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు మరొక విషయం అవసరం లేదన్నట్లు ప్రవర్తించారు. లేకపోతే పదవి విరమణ వయసు పెంచడాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించి ఉండాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఇపుడు ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ AP JAC, AP JAC అమరావతి ఐక్యవేదిక నేతలు ఒక ప్రకటన విడుదల చేసారు. ఇదే ప్రకటన:
* 11 వ PRC పై ప్రభుత్వం విడుదల చేసిన ఆశాస్త్రీయమైన G.O లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము..
★ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు చీకటి రోజు.
★ రేపటి (18.1.2022) నుండి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియచేయాలి
◆ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా, ప్రభుత్వం ఇప్పటికే 27%IR ఇస్తున్నప్పటికీ, ఫిట్ మెంట్ ను కేవలం 23% ప్రకటించడాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
◆ ఇటువంటి తరుణంలో AP JAC & AP JAC అమరావతి ఐక్య ఐక్యవేదిక నాయకులు గత వారం రోజుల నుండి ముఖ్యమంత్రి గారి కార్యాలయ ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రి గారి సలహాదారు శ్రీ సజ్జల గార్లను అనేక పర్యాయాలు కలిసి, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు HRA, CCA మరియు 70, 75 సంవత్సరాల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పింఛనుకు సంబంధించి, అధికారులు కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఆమోదిస్తే, ఇప్పటికే ఫిట్మెంట్ విషయంలో తీవ్ర నిరాశతో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇంకా ఆ నష్టాన్ని తట్టుకునే పరిస్థితి లేదని తెలుపగా, HRA, CCA మరియు 70, 75 సంవత్సరాల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పింఛనుకు సంబంధించి గౌ11 ముఖ్యమంత్రి గారితో సంక్రాంతి పండుగ అనంతరం చర్చించి, సానుకూల నిర్ణయం ప్రకటన కు ప్రయత్నిస్తామని తెలిపారు.
◆ కానీ, కనీసం అటు గౌ11ముఖ్యమంత్రి గారు గాని, ఇతర వారి ఉన్నతాధికారులు గాని ఎవరూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఎలాంటి చర్చా జరుపకుండానే, ప్రస్తుతం ఇస్తున్న IR కన్నా తక్కువగా 23% ఫిట్ మెంట్ ఇవ్వడాన్ని, ఇప్పటికే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మరియు గత ప్రభుత్వాల హయాంలో మేము సంపాదించుకున్న HRA, CCA మరియు 70, 75 సంవత్సరాల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పింఛను విషయంలో కూడా నేడు కార్యదర్శుల నివేదిక ప్రకారం ఉత్తర్వులు విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇది నమ్మించి మోసం చేయడం గా భావిస్తున్నాము.
◆ ఉద్యోగుల చరిత్రలో కనీసం PRC నివేదిక బయటపెట్టకపోవడం, అలాగే IR కన్నా ఫిట్మెంట్ తగ్గించి ఇవ్వడం, ఇస్తున్న రాయితీలను రద్దు చేయడం ఈ ప్రభుత్వ హాయలోనే జరగడం దురదృష్టకరం. ఈ రోజు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు చీకటి రోజు.
◆ విడుదల చేసిన ఆశాస్త్రీయమైన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ, ఇరు JAC ల ఐక్యవేదిక పక్షాన రేపు రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి రేపటినుండి అనగా 18.1.2022 నుండి తదుపరి ఉద్యమ కార్యాచరణ రూపొందించే వరకు తమ నిరసన తెలియచేయాలని ఇరు jac ల పక్షాన పిలుపుణిస్తున్నాం.
◆ ఇరు JAC ల వుమ్మడి సమావేశం అతి త్వరలో ఏర్పాటు చేసుకొని అసంబద్ధమైన 11వ prc ఉత్తర్వులు పై తదుపరి కొనసాగింపు ఉద్యమ కార్యాచరణను ప్రకటించడం జరుగుతుంది.
ప్రకటన మీద సంతకాలు చేసిన నేతలు: బండి శ్రీనివాసరావు & G. హృదయ రాజు, KV శివా రెడ్డి *AP JAC; బొప్పరాజు & వైవీ రావు, VV మురళీకృష్ణ నాయుడు *AP JAC అమరావతి.*