అనంతపురములో “వేమన ఫౌండేషన్” ప్రారంభం.
ప్రజల భాషకు, సాహిత్యానికి జీవం పోసిన ప్రజాకవి వేమన తాత్వికత, సాహిత్యాన్ని విస్తృత పరిచేందుకు అనంతపురము కేంద్రంగా వేమన ఫౌండేషన్ ట్రస్ట్ ప్రారంభమైంది.
*విశ్రాంత డి.జి.పి చెన్నూరు అంజనేయ రెడ్డి గారు గౌరావాధ్యక్షులుగా, అధ్యక్షులుగా విశ్రాంత శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి, కార్యదర్శి గా కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి, ఉపాధ్యక్షులుగా కోలా వెంకటరమణ, సంయుక్త కార్యదర్శి గా యర్రగుంట కృష్ణారెడ్డి, కోశాధికారి గా షేక్ అబ్దుల్ జలీల్, సభ్యలుగా యరపేటి లోకన్న, భీమిరెడ్డి జానకి* లతో ట్రస్ట్ ప్రారంభమైంది.
వేమన చైతన్య కేంద్రం అనంతపురము లో ఏర్పాటు చేయడం, వేమన ప్రామాణిక పద్యప్రతిని రూపొందించడం, పుస్తకాలు ప్రచురించడం, సమావేశాలు నిర్వహించడం, వేమన జానపద సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకరావడం , వేమన సంబంధిత చారిత్రక స్థలాలపై అవగాహన కలిగించడం తదితర కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
వేమనవపద్యపోటీలను యాబై పాఠశాలలో జనవరి 19 న ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో లాగా వేమన జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు.
-కార్యదర్శి,
వేమన ఫౌండేషన్,
డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
అనంతపురము.
9963917187