కొత్తగూడెం రామక్రిష్ణ కుటుంబం సూసైడ్ కు కారణమైన వనమా రాఘవను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు? ఆయన వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు? అని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ప్రశ్నించారు. వనమా కొడుకువ్యవహారం మీద పోలీసులు అనుసరిస్తున్న వైఖరి మీద ఆయన ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలు:
* వనమా కొడుకు వనమా రాఘవేంద్రరావుని ఇంకా అరెస్టు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎమ్మెల్యేల కొడుకులు చేసే అరాచకాలకు సీఎం పత్తాసు పలుకుతుండు.
• వనమా రాఘవ ఆచూకీ దొరకలేదని పోలీసులు చెప్పడం సిగ్గు చేటు
• ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే నిమిషాల్లో అరెస్టు చేసే పోలీసులు మానవ మ్రుగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడం సిగ్గు చేటు.
• అధికార పార్టీ నేతలు హత్యలు, హత్యాచారాలు, బెదిరింపులకు పాల్పడవచ్చని సీఎం ప్రత్యేకంగా లైసెన్సులిచ్చారా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 07.01.2022 ఎస్పీ కార్యాలయం
పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు వనమా రాఘవేంద్రరావు కోసం జిల్లా పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.రాఘవేంద్రరావును గుర్తించి పట్టుకుని అరెస్ట్ చేసేందుకు ఇతర జిల్లాల పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నాము.వీలైనంత త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
• లేక అధికార పార్టీ నేతల అరాచకాలు ముఖ్యమంత్రికి, ఆయన కొడుకు కళ్లకు కన్పించకుండా కళ్లకు గంతలు కట్టుకున్నారా?
• తక్షణమే వనమా రాఘవను అరెస్టు చేయాలి.
• తండ్రి ఎమ్మెల్యేగా ఉంటే విచారణ సాఫీగా సాగే అవకాశం లేదు.
• తక్షణమే ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలి.
• కొడుకుపై విచారణ జరిపేందుకు తండ్రి సహకరించాలి.
• ఈ అంశంపై సమగ్ర విచారణను పూర్తి చేసి నిందితుడికి సాధ్యమైనంత తొందరగా శిక్ష ఖారారు చేసేందుకు తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి