సర్కార్ స్కూల్ క్లినిక్: ఢిల్లీలో కొత్త ప్రయోగం

గవర్నమెంట్  స్కూళ్లలో విద్యార్థులకోసం హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేయడం దేశంలో ఇదే  మొదటి సారి. ఈ స్కూళ్లు ఇక ముందు విద్యార్థుల కంప్లీట్ హెల్త్ రిపోర్ట్స్ కూడా మెయింటెన్ చేస్తాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి మరొక వినూత్న పథకం ప్రారంభించారు. అది కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం. ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా శాశ్వత హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో విద్యార్థుల  మానసిక ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టిన తొలి ప్రభుత్వం ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వమే కావచ్చు.
“The health and education departments are coming together to provide physical and mental health services to children through clinics in government schools. This becomes  more important especially during the pandemic which students are not able to intermingle much.” అని విద్యాశాఖ డైరెక్టొరేట్  జారీ  చేసిన ఉత్తర్వులలో పేర్కొంది.
Delhi school
Delhi school (AAP)

 

ఇప్పటికే డిల్లీ ప్రభుత్వం  సర్కారు బడులను గొప్ప గా తీర్చిదిద్దింది. సర్కార్ బడులలో చేర్పించేందుకు తల్లితండ్రులు క్యూ కడుతున్నారు. బడులలో అడ్మిషన్స్ పెరిగాయి. పరిసరాల శుభ్రంగా తయారయ్యాయ్యా. విద్యాప్రమాణాలు బాగాపెరిగాయి.
ఇపుడు పాఠశాలల్లో  పైలట్ ప్రాజక్టుగా  వైద్యకేంద్రాలను తెరుస్తున్నారు. గతంలో ఢిల్లీ ప్రభత్వం ఏర్పాటుచేసిన  మొహల్లా క్లినిక్ ల్ లాగా ఇపుడు స్కూళ్లలో హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తామని   2018లోనే ఆమ్మ ఆద్మీ ప్రభుత్వం ప్రకటించింది. ఇపుడది కార్యరూపం దాలుస్తూ ఉంది. ప్రతిస్కూళ్లలో విద్యార్థులందరి సంపూర్త ఆరోగ్యరిపోర్టు (Complete health report) అందుబాటులో ఉంటుంది.
Delhi School
ఢిల్లీ స్కూళ్లో ఈత కొలథ
మొదటి విడతలో జనవరి 12వ తేదీన 10 పాఠశాలలో ఈ క్లినిక్ లు ప్రారంభమవుతున్నాయి. రెండో విడుదల మరొక 10 స్కూళ్లలో జనవరి 17వ తేదీన మొదలవుతున్నాయి. ఈ క్లినికల్ లో విద్యార్థుల శారీరక ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపడమే కాకుండా వారి మానసిక సమస్యలను పరిశీలించడం, ఏ వైన సమస్యలుంటే వాటికి పరిష్కారానికి సలహాలివ్వడం చేస్తారు.
ఈక్లినిక్స్ లో ఒక డాక్టర్, ఒక నర్స్, ఒక మానసిక వైద్య నిపుణుడు,ఒక పబ్లిక్ హెల్త్ నిపుణుడు ఉంటారు. నోడల్ టీచర్ ఈ క్లినిక్స్ లో విద్యార్థరు పరీక్షలను పర్యవేక్షిస్తుంటారు. కోవిడ్ నియమాల ప్రకారం గంటలకు ఆరుగురు విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు. 9నుంచి 12వ తరగతి విద్యార్థులలో రోజు 30  మందిని మాత్ర మే క్లినిక్ లకు అనుమతిస్తారు. వైద్యపరీక్షలకు తల్లితండ్రులు సమ్మతి అవసరం. ఈ తరగుతుల పిల్లలు క్లినిక్ రావాలంటే తల్లితండ్రులు వెంట వుండాలి.
క్లినిక్ ల్ ఏర్పాటు చేసిన విషయాన్ని, పనివేళలలనుడాక్టర్ల అందుబాటు గురించి పాఠశాలల్లో చదువుకునే పిల్లల తల్లితండ్రులందరికి సమాచారం అందిస్తున్నారు.  క్లినిక్ ల ఏర్పాటు పూర్తయిన రెండు మూడు రోజులలో తల్లితండ్రులకు సమాచారం అందిస్తారు.
Delhi School Auditorium
Delhi School Auditorium
విద్యార్థులతో గ్రూపు డిస్కషన్స్ నిర్వహించి,  వాళ్ల మానసిక సమస్యలను తెలుసుకుంటారు. ఇది ఆన్ లైన్ పద్దతిలో రెగ్యులర్ గా ఉంటుంది.  ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నట్లు ఇప్పటికే తల్లితండ్రులకు తెలియచేశారు.
ఢిల్లీ విద్యాశాఖ, వైద్య శాఖ సంయుక్తంగా ఈ ప్రాజక్టును చేపడుతున్నాయి.
బడికి వెళ్లడమనేది పిల్లలు ఆత్మగౌరవంగా, గర్వకారణణంగా భావించాలనే లక్ష్యంతో ఢిల్లీలో స్కూళ్లలో సంస్కరణలు మొదలుపెట్టారు.
ఢిల్లీలో మొత్తం 1024 పాఠశాలలన్నాయి. ఈస్కూళ్లనీ చాలా వరకు ఆనారోగ్య వాతావరణంలో, శిధిలనిర్మాణాలలో ఉండేవి. అందుకే ముఖ్యమంత్రి కేజ్ర్రీవాల్ ప్రభుత్వం మొదట స్కూలు వాతావరణాన్ని ఆరోగ్య కరంగా, అందంగా తీర్చిదిద్దపనిని యుద్ధ  ప్రాతిపదికన చేపట్టింది. పాఠశాలల్లో రద్దీ తగ్గించేందుకు  2019  25 కొత్త పాఠశాలలను నిర్మించింది. 8000 కొత్త తరగదులను నిర్మించారు.పాఠశాల్లో 54 స్కూళ్లను ఎంపిక చేసి ఆదర్శ పాఠశాలలుగా మార్చారు. వీటిలో SMART తరగతులుంటాయి. సైన్స్ లాబొరేటరీలు, క్రీడల వసతులు ఉన్నత స్థాయిలో అందుబాటులోకి తెచ్చరు. 2030  నాటికి ఈ ఆదర్శ పాఠశాలల సంఖ్య 100 కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఢిల్లీ స్కూళ్ల ప్రినిపాల్స్ ను అహ్మదాబాద్ ఐఐఎం  లీడర్స్ డెవెలెప్ మెంటు కోర్సుకు పంపించారు. మరికొందరిని ఏకంగా కేంబ్రిడ్జి స్కూల్ కు పంపించి విద్యార్థులను, బడులను ఎలా నిర్వహించాలనే విషయంలో శిక్షణ  ఇప్పించారు. ప్రపంచంలోపేరున్న పాఠశాలలను ఎలా నిర్వహిస్తున్నారు, అవెందుకు ఉత్తమ విద్యాకేంద్రాలయ్యాయనే విషయాలను ఈ శిక్షణలో టీచర్లు నేర్చుకున్నారు.
ఈ శిక్షణ లో వాళ్లు తెలుసుకున్న విషయాల ప్రకారం పాఠశాల్లో టీచర్ల మీద అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ తగ్గించారు. స్కూళ్ల నిర్మాణాలకు,  రిపేర్లకోసం ప్రత్యేకంగతా ఒక ఏస్టేట్ మేనేజర్ ను ఏర్పాటు చేశారు.  పాఠశాలలను మెరుగుపరిచేందుకు, విద్యాప్రమాణాలు పెరిగి మంచిఫలితాలు వచ్చేందుకు కొంతబడ్జెట్ కేటాయించి దానివిడుదలనకు ప్రిన్సిపాళ్లకు అధికారాలిచ్చారు. విద్యాశాఖ డైరెక్టర్ ప్రమేయం బాగా తగ్గించి స్కూళ్లను దాదాపు అటానమస్ చేశారు.
స్కూళ్లలో టీచర్లందరిక టాబ్లెట్స్ ఇచ్చారు. వాళ్ల కార్యకలాపాల పేపర్ వర్క్ కాకండా అంతా టాబ్లెట్ల ద్వారానే రిపోర్టు చేస్తారు. స్కూళ్లలో స్టాఫ్ రూమ్ లను అందంగా తీర్చిదిద్దారు. ఇలా ప్రతి అంశం ఉత్తేజకరంగా మారింది.
ఈ సంస్కరణలతో పాఠశాలలు విద్యార్థులకే కాదు, టీచర్లకు కూడా ఆకర్షణీయంగా మారిపోయాయి. చదువు ఇపుడు ఢిల్లీ స్కూళ్లలో చాలా ఆహ్లాదకరమయిన అనుభవంగా మారింది. ఈ విషయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *