తూ.గో జిల్లాలో త్వరలో ‘చరిత్ర‘ విధ్వంసం? (వీడియో)

 

ఈ బౌద్ధావాసానికి ముప్పు వచ్చింది…

 

 

ఇది పశ్చిమగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని కొడవలి బౌద్ధావాసం.

ఎపుడో క్రీ.పూ కట్టిన బౌద్ధ స్థూపం
, ఇతర కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. చూడ్డానికి చక్కగ ఉన్న  చారిత్రక సంపద ఇది. 1880 దశంకలో చరిత్రకారుడు రాబర్ట్ స్వెల్, ఆర్కియాలజిస్టు అలెగ్జాండర్ రీయా ఈ ప్రదేశాన్ని గుర్తించారు.
భారత పురాతత్వవిభాగం త్రవ్వకాలలో ఇక్కడ ఒక మహా స్థూపం(చైత్యం) ఆవశేషం కనిపించింది.  12 మీ. వ్యాసార్థంలో ఉన్న  స్థూపం దిగువ బాగం చెక్కు చెదరకుండా ఉంది.
సుమారు వందేళ్లపాటు ఆలనా పాలనా లేకపోవడంతో నిర్మాణాలు బాగా ధ్వంసం మయ్యాయి.  నిర్మాణాల భాగాలు చెల్లాచెదరుగా పడిఉన్నాయి. వాటిని పరిశీలించినపుడు చాలా ఆసక్తికరమయిన విషయాలు వెల్లడయ్యాయి.
ఇక్కడ బ్రాహ్మిలిపి శాసనం కూడా కనిపిందించి.దానిని డాక్టర్ స్టెన్, శాసన నిపుణుడు డా. కృష్ణశాస్త్రి కష్టపడి చదివి గుట్టువిప్పారు. ఇందులో చందాశతి అనే రాజు పేరు ఉంది. ఈ శాసనం క్రీ.శ రెండో శతాబ్దం కాలంనాటిదనివారు చెప్పారు. స్థూపం చుట్టూర ప్రదక్షిణాపథం కూడా ఉంది. కొండకింది నుంచి ఇక్కడికి చేరుకునేందుకు మెట్లదారి వేశారు.  మహాస్థూపం చుట్టూర 9 కానుకార్పణ స్థూపాలున్నాయి. తవ్వకాలలో 16 పిల్లర్లు కూడా కనిపించాయి. ఒక పెద్ద బౌద్ధారామపు పిలర్లివి.  ఇందులో 14 గదులన్నట్లున్నాయి. ఇక్కడి చిదుగులో రాతి పెట్టెల, ఛత్రి అవశేషాలు పాత్రల శకలాలు కనిపించాయి. ఇక్కడి బస చేసిన  బిక్షువుల కోసం రెండు బావులను కూడా తవ్వించారు.
క్రీ.పూ 3 క్రీ.శ 3  శతాబ్దాల మధ్య తెలుగు ప్రాంతాలలో బౌద్ధమతం  బాగా విస్తరించింది. నాగార్జున కొండ దగ్గిర నుంచి శ్రీకాకుళం దాకా దాదాపు 30 బౌద్ధ ప్రదేశాలను ఆర్కియాలజిస్టులు గుర్తించారు. ఇందులో కొడవలి బౌద్ధక్షేత్రం ఒకటి.
ఈ మహత్తర చారిత్రక కట్టడాలు  ఇపుడు  మైనింగ్ ముప్పు ఎదుర్కొంటున్నాయి. దీనికి సమీపంలో ల్యాటరైట్ మైనింగ్ తవ్వేందుకు అనుమతినిచ్చారు. మైనింగ్ మెదలుపెడితే, ఇవన్నీ చెదిరిపోతాయి. ఒక గొప్ప చారిత్రక గ్రంథం కాలిపోయినట్లు లెక్క.
ఆసక్తి ఉన్న వాళ్లు ఇపుడే పోయి చూసి రావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *