‘బాధితులు కోరితే రహస్య విచారణ’

(అవ్వారు శ్రీనివాసరావు)
*రాష్ట్ర ప్రగతితో పాటు మహిళా సాధికారతకు మహిళా కమిషన్ విశేషంగా కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
శుక్రవారం మంగళగిరి నగరంలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత రెండున్నరేళ్లలో మహిళా కమిషన్ పరిధి పెరిగిందని, అన్ని విభాగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పద్మ తెలిపారు.
సమాజంలో మహిళలపై ఉన్న అసమానతలను తొలగించేదుకు తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నామన్నారు. ఇప్పటికే ఇద్దరు మహిళా కమిషన్ సభ్యులను రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి నియమించారని చెప్పారు. మహిళలకు సంబంధించి అన్ని విషయాలను చూడాల్సిన భాధ్యత మహిళా కమిషన్ పై ఉందన్నారు.
Vasireddy Padma
Vasireddy Padma cutting cake harassing new year
ఎక్కువగా చిన్నారులు, వివాహితలు, యువతులు, వృద్ధులు సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అనేక ఘటనలకు సంబంధించి బాధితుల ఫిర్యాదులుతో పాటు మీడియాలో వచ్చిన కథనాలను మహిళా కమిషన్ పరిశీలించి చర్యలు తీసుకుందన్నారు.
*బాధితుల్లో న్యాయం జరుగుతుందనే భరోసా*
ఇబ్బందులు వచ్చినప్పడు మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళితే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం మహిళా ఉద్యోగుల్లో తీసుకురాగలిగామని పేర్కొన్నారు. చిన్నారులు, మహిళా ఉద్యోగులకు ఎక్కడ ఇబ్బందులు వచ్చినా తక్షణం స్పందిస్తూ, బాధితులకు న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి సహకారంతో మహిళా కమిషన్ పనిచేస్తోందన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు ఇబ్బందులు ఎదుర్కొన్నా అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని మహిళా చైర్ పర్సన్ పద్మ పేర్కొన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు సామాజికవర్గాల నాయకులు, పెద్దలు, మతాధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించామన్నారు.
*క్షేత్రస్థాయిలో వలంటీర్ వ్యవస్థ వినియోగం 
చిన్నారులపై అత్యాచారం ఘటనలు జరిగినప్పడు క్షేత్ర స్థాయిలో ఉన్న వలంటీర్ వ్యవస్థను వినియోగించుకుంటున్నామన్నారు. స్కూల్ స్థాయిలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే స్పందిస్తున్నామన్నారు.
తమకు అన్యాయం జరిగిందని కొందరు మహిళలు న్యాయం చేయాలని కోరుతూ ఫోన్ లు చేస్తున్నారన్నారు. రహస్యంగా గా విచారణ చేయాలని కోరితే వాటిని కూడా బాధితులు కోరిన విధంగా వారి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. గత రెండేళ్ళలో సుమోటోగా 72 కేసులు, ఎన్నారై కేసులు 63 వరకు మహిళా కమిషన్ దృష్టికి వచ్చాయన్నారు. ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకర ప్రవర్తన కలిగిస్తే, అదే శాఖకు చెందిన ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా రాష్ట్రస్థాయిలో కృషి చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కె. జయశ్రీ, గజ్జల జయలక్ష్మి లు తమపై నమ్మకం ఉంచి మహిళా కమిషన్ సభ్యులుగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ పరిధిలో చేపట్టిన పనులను మహిళా కమిషన్ సభ్యులు వివరించారు.
అనంతరం నూతన సంవత్సర వేడుకలను ముందస్తుగా నిర్వహించి కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మీడియా సమావేశంలో మహిళా కమిషన్ సెక్రటరీ శైలజ, డైరెక్టర్ ఆర్. సూయజ్, మహిళా కమిషన్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *