ఏపీ ఉద్యోగులతో చర్చలు విఫలం

ఉద్యోగులను అవమానించేలా చర్చలు సాగాయి, జనవరి 3 న కార్యాచరణ:
బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఐకాస అమరావతి ఛైర్మన్‌
రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగులకు PRC మీద సాగిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాలేదని ఉద్యోగుల నేతలు ప్రకటించారు.జనవరి 3 న కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. మొత్తానికి ఆంధ్రాలో ప్రభుత్వానికి, ఉద్యోగులకుమధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడు తున్నది.
ఉద్యోగులను అవమానించేలా పీఆర్సీ చర్చలు నిర్వహిస్తున్నారని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు చర్చల అనంతరం వ్యాఖ్యానించారు.
.సీఎం జగన్ తో  చర్చలకు తీసుకువెళ్తామని చెప్పి, ఇప్పుడు ఆర్థికశాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారని ఆయన చెప్పారు.
రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధిక భాగం ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతుందని అధికారులు వాదిస్తున్నారని ఆ మాటలు అవాస్తవం అని బొప్పారాజు అన్నారు. ‘
ఆయన ఇంకా ఏమన్నారంటే…
 ప్రస్తుతం తీసుకునే జీతం కన్నా తగ్గకుండా పీఆర్సీ వచ్చేలా చూస్తామని అధికారులు చెప్పడం దుర్మార్గం. ప్రభుత్వం నుంచి ఎంత ప్రతిపాదన ఉందంటే మళ్లీ 14.29 శాతం అంటున్నారు. 2,500 మంది ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ ఛార్జి మెమోలు ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సస్పెండు చేశారు. సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. చర్చల్లో పురోగతి ఉంటేనే మమ్మల్ని పిలవాలని, లేదంటే సీఎంవద్ద సమావేశానికి పిలవాలని చెప్పాం’ .
‘ప్రస్తుతం తీసుకుంటున్న 27 శాతం ఐఆర్‌పై ఎంత ఫిట్‌మెంట్‌ ఇస్తారో సీఎంతో చర్చించి, చర్చలకు పిలవాలని చెప్పాం. ఇక ఉపేక్షించేది లేదు. జనవరి 3న ఐకాసల స్ట్రగుల్‌ కమిటీ సమావేశం పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం’ అని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *