జైళ్లు దండగ అంటూ మూసేస్తున్న దేశం…

భారత దేశంలో బాగా వృద్ధి చెందుతున్న రంగం జైళ్లు. జైళ్లు విశాలమవుతున్నాయి. అంతకంటే వేగంగా ఖైదీల సంఖ్య పెరుగుతూ ఉంది. 2016 నుంచి ఈపెరుగుదల  వేగం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau: NCRB) లెక్కలు చెబుతున్నాయి.  2016 జైళ్ల కెపాసిటీ  3,80,876 ఖైదీలయితే,  2018  నాటికి ఇది 3,96,223 ( 4.03 శాతం) కి పెరిగింది.త అయితే, కెపాసిటీ మించి ఖైదీల సంఖ్య పెరిగింది. ఖైదీల పెరుగుదల ఇదే కాలంలో 4,33,003 నుంచి 4,66,084 కు అంటే 7.64శాతంపెరిగింది. ఆక్యపెన్సీరేట్  113.7 శాతం నుంచి 117.6 శాతానికి పెరిగింది. రాష్ట్రాలవారీగా తీసుకుంటే, ఉత్తర ప్రదేశ్ జైలు కెళ్లే వాళ్ల సంఖ్య బాగా పెరిగింది. అక్కడఆక్యపెన్సీరేటు 176 శాతం. తర్వాతి స్థానాలు సిక్కిం (157.3 శాతం) ఢిల్లీ ( 154.3 శాతం)లవి.
అయితే, యూరోప్ లోని నెదర్లాండ్స్ జైళ్లను మూసేస్తా ఉంది. జైళ్లను పాఠశాలలుగా, సృజనాత్మక కేంద్రాలుగా, ఇతర సామాజిక ప్రయోజనాల కేంద్రాలు మారుస్తుంది. ప్రపంచంలో జైళ్లని పనికి మాలినవని చిన్న చూపు చూసే దేశంగా నెదర్లాండ్స్ ఇపుడు తయారయింది.
ఆదేశ న్యాయవ్యవస్థలో జైలు శిక్ష ఖైదీలలో పరివర్తన తీసుకువస్తుందనే దోరణి లేదు. జైలు శిక్ష ప్రాముఖ్యం తగ్గిపోయింది. జైలుకు పంపడం కంటే ఖైదీలను మానవత్వంతో చూడటం వల్లే సంస్కరణ సాధ్యమనేది అక్కడి విశ్వాసం. అందుకే జైలు శిక్షలు తక్కువ. దీనితో జైళ్ల అవసరం పోయింది. జైళ్లను ఇతర సామాజిక కేంద్రాలుగా మారుస్తున్నారు. కాని ఇంగ్లండులో ఖైదీల సంఖ్య జైళ్ల సంఖ్య బాగాపెరుగుతూ ఉంది. శిక్షల కఠినంగా ఉంటాయి.  భారత్ లో కొనసాగుతున్నది కూడా ఇంగ్లండ్  వారసత్వమేగా!
ప్రతిసంవత్సరం కొన్న జైళ్లను నెదర్లాండ్స్ మూసేస్తూ ఉంది.మూసేసిన కొన్ని జైళ్లను అమ్మేశారు కూడా. కొన్నింటిని శరణార్థు కోసం కేటాయించారు. దీనికి కారణమేమేంటే, నేరస్థుల పట్ల నెదర్లాండ్స కు ఉన్న అభిప్రాయం. జైళ్లు అనాగరికతకు సంకేతమని ఈ దేశం భావిస్తూ ఉంది. అందుకే ఖైదీలను ఎక్కువ రోజులు జైళ్లలో ఉంచరు. చాలా మంది కి దీర్ఘ కాలిక  శిక్షలే పడవు. దేశమంతా కేవలం 30 మంది మాత్రమే ఖైదీలున్నారు.  ఇలాంటి ధోరణి భారతదేశంలో ఉంటే ఏమవుతుందో వూహించవచ్చు. స్కూళ్లు, కాలేజీలను, విశ్వవిద్యాలయాలను మూసేసి జైళ్లుగా మార్చాల్సి వస్తుంది. అయితే,నెదర్లాండ్స్ ప్రభుత్వ ధోరణి వల్ల ఆదేశంలో నేరాలు బాగా తగ్గిపోయి  జైళ్ల అవసరమే లేకుండా పోతున్నది.
ఏమ్ స్టర్ డ్యామ్ లో బ్రిటిష్  స్కూల్ ఆఫ్ ఏమ్ స్టర్ డ్యాం ఉంది.  అది బాగావిపరీతమయిన డిమాండ్ ఉన్న స్కూలు.   పెరుగుతున్న విద్యార్థులకు  తగినంత వసతి లేకుండాపోయింది. అయితే, ఇపుడా కొరత తీరిపోయింది. ఎందుకంటే, రాజధానిలో ఉండే ఒక జైలు మాతపడటంతో 14,000చదరపు మీటర్ల స్థలం దొరికింది.
హార్లెమ్  నగరానికి 20 కి. మీ దూరాన ఉన్న డి  కోపెన్ (De Koepel) జైలు ను ఇపుడు బహుళార్థ సాధక ప్రాజక్టుకు గా మారుస్తున్నారు. ఇందులో ఒక విద్యార్థులకు ఒక హాస్టల్, సమాజిక గృహాలను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో  ఈ రెండింటికి బాగా కొరత ఉంది, జైలు ఈ కొరత తీరుస్తున్నది.  ఇక రాష్ట్రాలలో కూడా ఇదే జరుగుతూ ఉంది.  డ్రాంధ్ (Dranthe)  రాష్ట్రంలో 2005 లో ఒక పీనల్ కాలనీ మాతపడింది. దానిని వెంటనే నేషనల్ ప్రిజన్ మ్యూజియంగా మార్చేశారు. ఇది కేవలం మ్యూజియమే కాదు, ఇక్కడి పాత జైలు సెల్స్ ని స్టైలిష్ హోమ్స గా మార్చారు. ఎవరైనా అక్కడ గదులు అద్దెకు తీసుకుని జైలులోని తీర్చిదిద్దిన ప్రకృతి సోయగాలలో ఆహ్లాదకరంగా గడపవచ్చు. ఈ జైలు ఎంత అంతంగా తయారయిందో చూడండి

 

బ్లాక్యూస్ పోర్ట్ జైలు అంతర్జాతీయ సాంస్కృతిక వాణిజ్యం కేంద్రంగా మారిపోయింది. ఈ జైలు ఉన్న రాష్ట్రంలో జిడిపి బాగా తక్కువ. అందువల్ల ఈ ప్రాంతానికి పెట్టుబడులను ఆకర్షించే కేంద్రంగా జైలు అందంగా తయారయింది. అంతేకాదు, ఇక్కడి జైలు సెల్స్ చవకవసతి గృహంగా మారింది. జైలులోని చర్చి సెంట్రల్ లైబ్రరీగా మారుతూ ఉంది.
ఏమ్ స్టర్ డ్యామ్ లోని బ్యామర్ బాయెస్ (Bijlmerbajes) జైలును  ధ్వంసం చేయడానికి ముందు దానిని సిరియా శరణార్థలకు ఉపాధికల్పనా కేంద్రంగా, సిరియన్ హమామ్ గా మార్చారు.
ఎందుకిలా జరుగుతూ ఉంది
నాజీ చెరలో నలిగిపోయిన బయటపడిన నెదర్లాండ్స్ లో సుదీర్ఘ కాలపు జైలు శిక్ష వల్ల వచ్చే అనార్థాలను బాగా గ్రహించింది. అందువల్ల దేశంలో  రెండో ప్రపంచ యుద్ధకాలం ముందు కంటే ఇపుడుజైలు శిక్షని చాలా అరుదుగా వేస్తారు. జరిమానా విధించడం లేదా సామాజిక సేవ కు శిక్ష లు పరిమితమవుతుంటాయి. శిక్షపడ్డాక కూడా ఖైదీలను చాలా మానవత్వంతో చూస్తారు. చాలా దేశాలలో శిక్షల కఠినంగా అమలుచేసి  శాంతి భద్రతల సమస్యకు విరుగుడుగాచూస్తారు. నెదర్లాండ్స్ లో  నేరాలకు వ్యవస్థస్పందనగా మాత్రమే శిక్షలను పరిగణిస్తారు. శిక్షలకు బదులు ఎలెక్ట్రానిక్ టాగింగ్, రెసిడెన్సియల్ కేర్, డగ్స్ బానిసలకు పునరావాసం కల్పించడం వంటి మీద దృష్టిపెడతారు కాబట్టి ఇక్కడ జైలుశిక్షలకు ఆస్కారం ఉండదని  ఫోర్ట్స్ మౌత్ యూనివర్శిటీకి చెందిన  క్రిమినాలజీ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ పేక్స్ పాజిటివ్. న్యూస్ కు చెప్పారు.
నెదర్లాండ్స్ లో పేదరికం తక్కువగా ఉండటం, సాంఘిక భద్రత ఎక్కువగా ఉండటం, భౌతిక సంపద సంస్కతి తక్కువగా ఉండటం, సంపదను హోదాను ప్రదర్శించాలనుకునే తత్వం లేకపోవడం, సాధారణ జీవితానికి విలువఇవ్వడం వల్ల  నెదర్లాండ్స్ లో నేరాలు తక్కువగా ఉండేందుకు కారణం. చేసిన నేరాలకు స్వల్పి కాలిక శిక్షలు ఉండటం వల్ల ఆదేశంలో ఖైదీ రెండో సారి నేరం చేయడం తక్కువ అని పరిశోధనల్లో తేలింది.
జైలుకు పంపే న్యాయవ్యవస్థకు నెదర్లాండ్స్ లో కాలం చెల్లింది. “ What you find in the Netherlands when you talk to senior police officers, prosecutors or judges, is that very few people have anything positive to say about the effect of imprisonment,”అని ఫ్రాన్సిస్ పేక్స్ చెప్పారు. ఖైదీలల్ పరివర్తన తీసుకువచ్చేందుకు శిక్ష కాదు, మానవీయ ధోరణి, దానినే ఇక్కడ అమలు చేస్తారని ఆయన చెప్పారు.
“We now know better that if you want to turn those lives around, simply being punitive is not going to cut it. It needs something much more wholesome than that,” అని ఫ్రాన్సిస్ ఫేక్స్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *