భారత దేశంలో బాగా వృద్ధి చెందుతున్న రంగం జైళ్లు. జైళ్లు విశాలమవుతున్నాయి. అంతకంటే వేగంగా ఖైదీల సంఖ్య పెరుగుతూ ఉంది. 2016 నుంచి ఈపెరుగుదల వేగం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau: NCRB) లెక్కలు చెబుతున్నాయి. 2016 జైళ్ల కెపాసిటీ 3,80,876 ఖైదీలయితే, 2018 నాటికి ఇది 3,96,223 ( 4.03 శాతం) కి పెరిగింది.త అయితే, కెపాసిటీ మించి ఖైదీల సంఖ్య పెరిగింది. ఖైదీల పెరుగుదల ఇదే కాలంలో 4,33,003 నుంచి 4,66,084 కు అంటే 7.64శాతంపెరిగింది. ఆక్యపెన్సీరేట్ 113.7 శాతం నుంచి 117.6 శాతానికి పెరిగింది. రాష్ట్రాలవారీగా తీసుకుంటే, ఉత్తర ప్రదేశ్ జైలు కెళ్లే వాళ్ల సంఖ్య బాగా పెరిగింది. అక్కడఆక్యపెన్సీరేటు 176 శాతం. తర్వాతి స్థానాలు సిక్కిం (157.3 శాతం) ఢిల్లీ ( 154.3 శాతం)లవి.
అయితే, యూరోప్ లోని నెదర్లాండ్స్ జైళ్లను మూసేస్తా ఉంది. జైళ్లను పాఠశాలలుగా, సృజనాత్మక కేంద్రాలుగా, ఇతర సామాజిక ప్రయోజనాల కేంద్రాలు మారుస్తుంది. ప్రపంచంలో జైళ్లని పనికి మాలినవని చిన్న చూపు చూసే దేశంగా నెదర్లాండ్స్ ఇపుడు తయారయింది.
ఆదేశ న్యాయవ్యవస్థలో జైలు శిక్ష ఖైదీలలో పరివర్తన తీసుకువస్తుందనే దోరణి లేదు. జైలు శిక్ష ప్రాముఖ్యం తగ్గిపోయింది. జైలుకు పంపడం కంటే ఖైదీలను మానవత్వంతో చూడటం వల్లే సంస్కరణ సాధ్యమనేది అక్కడి విశ్వాసం. అందుకే జైలు శిక్షలు తక్కువ. దీనితో జైళ్ల అవసరం పోయింది. జైళ్లను ఇతర సామాజిక కేంద్రాలుగా మారుస్తున్నారు. కాని ఇంగ్లండులో ఖైదీల సంఖ్య జైళ్ల సంఖ్య బాగాపెరుగుతూ ఉంది. శిక్షల కఠినంగా ఉంటాయి. భారత్ లో కొనసాగుతున్నది కూడా ఇంగ్లండ్ వారసత్వమేగా!
ప్రతిసంవత్సరం కొన్న జైళ్లను నెదర్లాండ్స్ మూసేస్తూ ఉంది.మూసేసిన కొన్ని జైళ్లను అమ్మేశారు కూడా. కొన్నింటిని శరణార్థు కోసం కేటాయించారు. దీనికి కారణమేమేంటే, నేరస్థుల పట్ల నెదర్లాండ్స కు ఉన్న అభిప్రాయం. జైళ్లు అనాగరికతకు సంకేతమని ఈ దేశం భావిస్తూ ఉంది. అందుకే ఖైదీలను ఎక్కువ రోజులు జైళ్లలో ఉంచరు. చాలా మంది కి దీర్ఘ కాలిక శిక్షలే పడవు. దేశమంతా కేవలం 30 మంది మాత్రమే ఖైదీలున్నారు. ఇలాంటి ధోరణి భారతదేశంలో ఉంటే ఏమవుతుందో వూహించవచ్చు. స్కూళ్లు, కాలేజీలను, విశ్వవిద్యాలయాలను మూసేసి జైళ్లుగా మార్చాల్సి వస్తుంది. అయితే,నెదర్లాండ్స్ ప్రభుత్వ ధోరణి వల్ల ఆదేశంలో నేరాలు బాగా తగ్గిపోయి జైళ్ల అవసరమే లేకుండా పోతున్నది.
ఏమ్ స్టర్ డ్యామ్ లో బ్రిటిష్ స్కూల్ ఆఫ్ ఏమ్ స్టర్ డ్యాం ఉంది. అది బాగావిపరీతమయిన డిమాండ్ ఉన్న స్కూలు. పెరుగుతున్న విద్యార్థులకు తగినంత వసతి లేకుండాపోయింది. అయితే, ఇపుడా కొరత తీరిపోయింది. ఎందుకంటే, రాజధానిలో ఉండే ఒక జైలు మాతపడటంతో 14,000చదరపు మీటర్ల స్థలం దొరికింది.
హార్లెమ్ నగరానికి 20 కి. మీ దూరాన ఉన్న డి కోపెన్ (De Koepel) జైలు ను ఇపుడు బహుళార్థ సాధక ప్రాజక్టుకు గా మారుస్తున్నారు. ఇందులో ఒక విద్యార్థులకు ఒక హాస్టల్, సమాజిక గృహాలను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఈ రెండింటికి బాగా కొరత ఉంది, జైలు ఈ కొరత తీరుస్తున్నది. ఇక రాష్ట్రాలలో కూడా ఇదే జరుగుతూ ఉంది. డ్రాంధ్ (Dranthe) రాష్ట్రంలో 2005 లో ఒక పీనల్ కాలనీ మాతపడింది. దానిని వెంటనే నేషనల్ ప్రిజన్ మ్యూజియంగా మార్చేశారు. ఇది కేవలం మ్యూజియమే కాదు, ఇక్కడి పాత జైలు సెల్స్ ని స్టైలిష్ హోమ్స గా మార్చారు. ఎవరైనా అక్కడ గదులు అద్దెకు తీసుకుని జైలులోని తీర్చిదిద్దిన ప్రకృతి సోయగాలలో ఆహ్లాదకరంగా గడపవచ్చు. ఈ జైలు ఎంత అంతంగా తయారయిందో చూడండి