నెలకి నూరు గుండె ఆపరేషన్లకు సిద్ధం

తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి చిన్నపిల్లల హృద‌యాలయంలో ఏర్పాటుచేసిన అడ్వాన్స్‌డ్ కార్డియాక్ క్యాథడ్రేష‌న్ ల్యాబ్‌ను గురువారం టిటిడి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. దేశంలో ఇలాంటి వాటిలో ఇదే మొదటిది. పుట్టుక‌తో ఏర్ప‌డే గుండె రంధ్రాల‌ను ఆప‌రేష‌న్ అవ‌స‌రం లేకుండా కీహోల్ విధానంలో పూడ్చ‌డం జ‌రుగుతుంది. దీనితో 24 గంట‌ల్లోనే రోగిడిశ్చార్జి. , వారంలోపు పిల్ల‌లు య‌థావిధిగా పాఠ‌శాల‌కు వెళ్లవచ్చు.
ఆసుప‌త్రిలో 40 ఐసియు బెడ్లు, 30 సాధార‌ణ బెడ్లు క‌లిపి మొత్తం 70 బెడ్లు ఉన్నాయ‌న్నానిఇప్ప‌టివ‌ర‌కు రెండు నెల‌ల కాలంలో 16 ఓపెన్ హార్ట్ స‌ర్జరీలను స్పెష‌లిస్టు డాక్ట‌ర్లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించార‌ని  అక్కడ మాట్లాడుతూ సుబ్బారెడ్డి చెప్పారు. ఆప‌రేష‌న్లు చేయించుకున్న‌వారిలో 25 రోజుల వ‌య‌సు గ‌ల చిన్నారుల నుండి 18 ఏళ్ల వ‌ర‌కు గ‌ల యువకులుఉన్నారు. ఆరు  కోట్ల రుపాలయ వ్యయం తో నిర్మించిన
ఈసెంటర్లో  ఆప‌రేష‌న్లు అన్నింటినీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తున్నారు. నెల‌కు 100 ఆప‌రేష‌న్లు చేసేందుకు త‌గ్గ‌ట్టుగా అవ‌స‌ర‌మైన‌ వైద్య ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని, వైద్య సిబ్బందిని నియ‌మించుకోవాల‌ని ఆయన డాక్టర్లకు సూచించారు. శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి భవన నిర్మాణానికి చ‌ర్య‌లు ప్రారంభించిన‌ట్టు తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ పదకొండవ తేదీనుంచి  ఈ ఆసుపత్రిలో సేవలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సేవలను ప్రారంభించారు.
మొదటి   నెలరోజుల్లోనే  నవంబరు 11వ తేదీ తొలి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతం గా నిర్వహించారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్లు చేయించే స్థోమత లేని పేద తల్లిదండ్రులకు వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయించుకునే అవకాశం ఈ ఆసుపత్రితో లభిస్తున్నది.  ఆసుపత్రి ప్రారంభమయ్యాక మొదట ఒక బాలికకు, తరువాత ఇద్దరు చిన్నారులకు వైద్యులు విజయవంతంగా గుండె ఆపరేషన్లుచేశారు.  ఇప్పుడు ఒకే విడతలో రెండునెలల నుంచి ఆరేళ్ళ వయసు కలిగిన ఏడుగురు చిన్నారులకు విజయవంతంగా సర్జరీలు చేశారు.  .
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి కు చెందిన పవిత్ర 6 సంవత్సరాలు, కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన జి.వెంకట నాగ శేషు 2 నెలల కుమారుడు, చిత్తూరు జిల్లా దామల చెరువుకు చెందిన రిషిత అనే 4 సంవత్సరాల బాలిక, అనంత పురం జిల్లా హిందూ పురం సమీపంలోని అప్పుల కుంటకు చెందిన వేదాంత అనే 4 సంవత్సరాల బాలుడికి తొలిరోజుల్లో గుండె ఆపరేషన్లు జరిగాయి. ఇక్కడ ఆపరేషన్ లు చేయించుకున్ వారిలో  తమిళనాడు రాష్ట్రంలోని పల్లిపట్టు కు చెందిన యోక్షిత శ్రీ అనే ఏడు నెలల పాప, అనంతపురం జిల్లా తాడిపత్రి కి చెందిన ఇంషాద్ అనే నాలుగు నెలల బాబు, కర్నూలు జిల్లా డోన్ కు చెందిన నాలుగు నెలల వయసున్న గౌతం ఉన్నారు. వీరందరికి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి నేతృత్వంలోని డాక్టర్ల బృందం విజయవంతంగా ఈ ఆపరేషన్లు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *