తెలంగాణ లో ఒమిక్రాన్

హైదరాబాద్‌:- ఒమిక్రాన్‌ తెలంగాణ లో ప్రవేశించింది.ఇందులో రెండు కేసులు నేరుగా ఆఫ్రికా నుంచి వస్తే,మూడోది బెంగాల్ నుంచి వచ్చింది.
దక్షిణాఫ్రికాలో తొలుత కనిపించిన ఈ కరోనా కొత్త వేరియంట్‌  హైదరాబాద్‌లో గుర్తించినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించారు.
ఈ నెల 12న ఆఫ్రికాలో కెన్యా, సోమాలియా నుంచి హైదరాబాద్‌ (టోలిచౌకీ)కి వచ్చిన ఇద్దరి (24 ఏళ్ల మహిళ, 23 ఏళ్ల వ్యక్తి)లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ఇద్దరిని కూడా టిమ్స్‌కు తరలించినట్లు తెలిపారు.
మరోవైపు హైదరాబాద్‌ నుంచి బెంగాల్‌కు వెళ్లిన ఓ కుటుంబంలోని ఏడేళ్ల బాలుడిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు కూడా ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన  హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *