విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు.విజయవాడ లో ఒపి సేవలు బహిష్కరించి ఆందోళన కు దిగారు.ఇటీవల రోగుల బంధువులు, కుటుంబ సభ్యులు జూనియర్ డాక్టర్ల మీద జరుపుతున్న దాడులకు నిరసనగా వారు ఆందోళన చేపట్టారు.ప్రజలకు సేవలందిస్తున్న తమ పై దాడులు చేయడం సబబేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలు చేశామని, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడామని చెబుతూ అయినా ఇటీవల వైద్యుల పై దాడులు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
“దాడులను నివారించేందుకు చట్టాలు ఉన్నా వాటిని అధికారులు అమలు చేయడం లేదని, మొక్కుబడి చర్యల వల్ల మాకు రక్షణ లేకుండా పోయింది,” అని వారు పేర్కొన్నారు
తమకు భద్రత ఉంటుందనే భరోసా ప్రభుత్వమే కల్పించాలని
దాడులు చేసిన వారిని అరెస్టు చేసి వెంటనే శిక్ష పడేలా చూడాలని వారుకోరుతున్నారు.
“ఈరోజు నుంచి ఓపి సేవలను నిలిపివేశాం. ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుంచి అత్యవసర సేవలను బహిష్కరిస్తాం,” అని వారు హెచ్చరించారు.