రాష్ట్రంలో ఒక్కసారిగా దళిత బంధు మాటే వినిపంచక పోవడం పట్ల తెలంగాణ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రోజు బిఆర్ డాక్టర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కెసిఆర్ ముద్దుల పథకం దళిత బంధు పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్య చేశారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే దళితులను మభ్య పెట్టేందుకు పథకం తీసుకొచ్చారని చెబుతూ ఎన్నికల తరువాత దళిత బంధు ఎందుకు అమలు కావడం లేదో ముఖ్యమంత్రి సమాదానం చెప్పాలని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని. దళితులకు మేలు చేసే ఉద్దేశ్యం ఉంటే తక్షణమే దళిత బంధు అమలు కొనసాగించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మధ్య ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మీద ప్రత్యేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనన తీవ్రమయిన పదజాలంలో దూషించారు కూడా. దీనికి బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరొక వైపు దళిత బంధు పథంక రాష్ట్రమంతా దళితులకు అమలుచేయడమేకాదు, బిసిలకు కూడా అమలు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది. దీనికి రాష్ట్ర వ్యాపిత క్యాంపెయిన్ నిర్వహించాలని కూడా బిజెపి ప్రయత్నిస్తూ ఉంది.