అఖండ :  ప్రీరిలీజ్ బిజినెస్ షాకిస్తుంది!

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘అఖండ’ చిత్రం రేపు (డిసెంబరు 2) విడుదల కానున్న సంగతి తెలిసిందే.  శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.  ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 56 కోట్ల రేంజుకు చేరుకోగా.. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనూ భారీ మొత్తాలకు అమ్ముడుపోయిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
థియేట్రికల్ బిజినెస్ పరంగా బాలకృష్ణ కెరీర్ రెండవ బెస్ట్ అని తెలుస్తోంది. తక్కువ టిక్కెట్ రేట్లు కొంత ఇబ్బందికరం అయినా. థియేటర్లలో మరే ఇతర పెద్ద సినిమా లేకపోవటం తో అఖండ చిత్రాన్ని చాలా ఏరియాల్లో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
గౌతమీపుత్ర శాతకర్ణి రేంజులో భారీ ఓపెనింగుల లక్ష్యంగా విడుదల అవుతోంది. మొదటి రోజు టార్గెట్ 10కోట్లు అని తెలుస్తోంది. ఏరియా వైజ్   ఏరియా ప్రీ-రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే…
నైజాం 12 కోట్లు
సీడెడ్ -12 కోట్లు..
ఆంధ్రా 25 కోట్లు
ఏపీ తెలంగాణ కలుపుకుని 49కోట్ల మేర బిజినెస్ చేయగా.. ఓవర్సీస్ లో 2.5కోట్ల మేర బిజినెస్ పూర్తయింది
ఓవరాల్ గా 56కోట్ల రేంజులో పలికిందని తెలుస్తోంది. అంటే అఖండ.. సుమారు 70కోట్లు పైగా నెట్ వసూలు చేయాల్సి ఉంటుంది.
‘అఖండ’ చిత్రంలో బాలకృష్ణ ఆఘోరాగా నటించడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి ఏర్పడింది. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ స్వరపరిచిన పాటలు ప్రజాదరణ పొందాయి. ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా రెండు గంటల 47 నిమిషాల నిడివితో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా అన్ని ఏరియాలకు కలిపి భారీ రేంజ్‌లో బిజినెస్ చేసినట్టు సమాచారం. పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల కాబోతున్న భారీ యాక్షన్ చిత్రం కావడం.. పైగా బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో ‘అఖండ’ పై భారీ అంచనాలే ఉన్నాయి.
నిర్మాత మాట్లాడుతూ…అఖండ అంటే అనంతం.. కాదనలేని సత్యం. సినిమా చూశాక.. ఆ టైటిల్ ఎందుకు పెట్టారా? అని తెలుస్తుంది. కథకు టైటిల్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. అలాగే అఘోరాలు అంటే సమాజానికి సంబంధం లేని వ్యక్తులు కాదు. వారు వ్యక్తిగతం కన్నా.. దైవం, ప్రకృతి వాటిపై రియాక్ట్ అవుతుంటారు. అలాంటి కారెక్టర్ రావడం, సమస్యలను పరిష్కరించడమనేది కథ. బోయపాటి గారి కెరీర్‌లో, బాలకృష్ణ గారి కెరీర్‌లో ఇంత వరకు ఇన్ని స్క్రీన్లలో విడుదలైన సినిమా మరొక్కటి లేదేమో. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లలో అఖండ రావొచ్చు. ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో విడుదలవుతోంది. మెల్‌బోర్న్‌లో అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటకే ఫుల్ అయిపోయాయి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *