దేశంలో ఒక రూపాయి నోటు వచ్చి ఈ రోజుతో 104 సంవత్సరాలు పూర్తయింది. తొలి ఒక రూపాయి నోటు నవంబరు 30, 1917 తేదీన మొదటి ప్రపంచ యుద్ధకాలంలో వచ్చింది. నాణేలు ముద్రించడం కష్టం కావడంతో చిన్న మొత్తాల కరెన్సీ అవసరం కావడంతో ఈచర్య తీసుకున్నారు. పేపర్ కరెన్సీ వైపు నాటి బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిసారించింది. దాని మీద కింగ్ జార్జి 5వ చక్రవర్తి బొమ్మ ఉండేది. రుపాయి నోటుతో పాటు రెండు రుపాయల నోటు ఎనిమిది అణా నాణెం కూడా విడుదల చేశారు.
1926లో మళ్లీ నోట్లను రద్దుచేసి, నాణేం తెచ్చారు. తిరిగి రెండో ప్రపంచ యుద్ధ వాతావరణంలో లోహపు నాణేల తయారీ సమస్య కావడంతో 1940లో లో ప్రత్యక్షమయింది. కరెన్సీ ఆర్టినెన్స్ 1940 ద్వారా రుపాయినోట్ల ముద్రణ మొదలయింది. 1994లో మరొక సారి ఆపేసి 2015లోపునర్ముద్రించారు.
ఇంతకీ రూపాయ అనే మాట ఎలా వచ్చిందో తెలుసా?
రూపాయ అనే మాట సంస్కృతం లోని రూప్యకం అనే మాట నుంచి వచ్చింది. రూప్యకం అంటే వెండినాణేం. ఆరోజులో వెండి నాణాల కరెన్సీ ఉండేది. నాణేలు ఉన్నా రూప్య పేరుతో నాణేం తీసుకువచ్చింది ఢిల్లీ చక్రవర్తి షేర్ షా సూరి.