కేసీఆర్ మాటల నవాబు.. చేతల గరీబు

(మధు యాస్కి గౌడ్)

కేసీఆర్ వ్యవహారం మాటల నవాబు.. చేతల గరీబు అన్నట్లుగా ఉంటుంది.. రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటాడు కానీ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాం సేకరణకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాడు.

▪️ కొనుగోలు కేంద్రాల్లో వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడే టార్పాలిన్లు, ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి, శుభ్రంచేసూ యంత్రాలు లేక అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే నాథుడే లేడు.

▪️ వానాకాలం వ్యవసాయంలో భాగంగా 61.30 లక్షల ఎకరాల్లో వరిసాగైందని అంచనాలున్నా.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వహించింది.

Madhu Yaskhi Goud
Madhu Yaskhi Goud

▪️ కేసీఆర్ కు కుట్ర రాజకీయాలు చేయడంపైనున్న దృష్టి రైతులమీద లేనేలేదు. పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు రైతుల నుంచి ధాన్యం సేకరించి విదేశాలకు ఎగుమతుల చేస్తుండగా.. కేసీఆర్ మాత్రం బైరూపు వేషాలేస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడు.

▪️ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి రూ. 3 లక్షలు ఇస్తానన్న కేసీఆర్.. ముందుగా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. ఈ మధ్య వరి ధాన్యం కుప్పలపై ప్రాణాలు వదిలిన రైతులకు పరిహారం ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలకు, కొండగట్టులో చనిపోయిన వారికి, కేటీఆర్ నిర్వాకంతో ఆత్మహత్యలు చేసుకున్న 27మంది ఇంటర్ విద్యార్థులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.

▪️ కొత్త వృద్ధాప్య పెన్ష‌న్లు అమలు చేయడంలో కేసీఆర్ సర్కార్.. నిర్లక్ష్యం అర్హుల పాలిట శాపంగా మారుతోంది. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆసరా పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 57కు తగ్గించిన తరువాత.. కొత్తగా ఒక్క పింఛన్ కూడా రాలేదు.

▪️ అర్హత వయసు తగ్గించాక రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 7 లక్షల 80 వేల దరఖాస్తుల పరిశీలనే ఇప్పటి వరకూ కేసీఆర్ సర్కార్ చేయలేదు. దీనిని నిర్లక్ష్యం అనాలా?? చేతకాని తనం అనాలా?? వయసు పైబడినవాళ్లంటే చిన్నచూపు అనుకోవాలా???

(మధు యాష్కీ గౌడ్,ఛైర్మన్, ప్రచార కమిటీ,తెలంగాణ కాంగ్రెస్ కమిటీ.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *