(మధు యాస్కి గౌడ్)
కేసీఆర్ వ్యవహారం మాటల నవాబు.. చేతల గరీబు అన్నట్లుగా ఉంటుంది.. రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటాడు కానీ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాం సేకరణకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాడు.
▪️ కొనుగోలు కేంద్రాల్లో వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడే టార్పాలిన్లు, ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి, శుభ్రంచేసూ యంత్రాలు లేక అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే నాథుడే లేడు.
▪️ వానాకాలం వ్యవసాయంలో భాగంగా 61.30 లక్షల ఎకరాల్లో వరిసాగైందని అంచనాలున్నా.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వహించింది.
▪️ కేసీఆర్ కు కుట్ర రాజకీయాలు చేయడంపైనున్న దృష్టి రైతులమీద లేనేలేదు. పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు రైతుల నుంచి ధాన్యం సేకరించి విదేశాలకు ఎగుమతుల చేస్తుండగా.. కేసీఆర్ మాత్రం బైరూపు వేషాలేస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడు.
▪️ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి రూ. 3 లక్షలు ఇస్తానన్న కేసీఆర్.. ముందుగా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. ఈ మధ్య వరి ధాన్యం కుప్పలపై ప్రాణాలు వదిలిన రైతులకు పరిహారం ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలకు, కొండగట్టులో చనిపోయిన వారికి, కేటీఆర్ నిర్వాకంతో ఆత్మహత్యలు చేసుకున్న 27మంది ఇంటర్ విద్యార్థులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.
▪️ కొత్త వృద్ధాప్య పెన్షన్లు అమలు చేయడంలో కేసీఆర్ సర్కార్.. నిర్లక్ష్యం అర్హుల పాలిట శాపంగా మారుతోంది. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆసరా పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 57కు తగ్గించిన తరువాత.. కొత్తగా ఒక్క పింఛన్ కూడా రాలేదు.
▪️ అర్హత వయసు తగ్గించాక రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 7 లక్షల 80 వేల దరఖాస్తుల పరిశీలనే ఇప్పటి వరకూ కేసీఆర్ సర్కార్ చేయలేదు. దీనిని నిర్లక్ష్యం అనాలా?? చేతకాని తనం అనాలా?? వయసు పైబడినవాళ్లంటే చిన్నచూపు అనుకోవాలా???
(మధు యాష్కీ గౌడ్,ఛైర్మన్, ప్రచార కమిటీ,తెలంగాణ కాంగ్రెస్ కమిటీ.)