జూన్ 2020లో ఆర్డినెన్స్‌లుగా తీసుకొచ్చిన మూడు రైతు-వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల నల్ల చట్టాలను రద్దు చేయాలనే భారత ప్రభుత్వ నిర్ణయాన్ని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. గురునానక్ జయంతి రోజున ఆయన దీనిని ప్రకటించాలని నిర్ణయించుకున్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది మరియు పార్లమెంటరీ విధానాల ద్వారా ప్రకటన అమలులోకి వచ్చే వరకు వేచి ఉంటుంది. ఇదే జరిగితే భారతదేశంలో ఒక సంవత్సరం పాటు సాగిన రైతుల పోరాటానికి ఇది చారిత్రాత్మక విజయం అవుతుంది. అయితే ఈ పోరాటంలో దాదాపు 700 మంది రైతులు అమరులయ్యారు. లఖింపూర్ ఖేరీలో జరిగిన హత్యలతో సహా ఈ నివారించదగిన మరణాలకు కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి కారణం.
రైతుల ఆందోళన కేవలం మూడు నల్ల చట్టాల రద్దు కోసమే కాదు, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మరియు రైతులందరికీ గిట్టుబాటు ధరలు పొందె చట్టబద్ధమైన హామీ కోసం కూడా అని SKM ప్రధానికి గుర్తుచేస్తుంది. రైతుల ఈ ముఖ్యమైన డిమాండ్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అలాగే విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ కూడా. SKM అన్ని పరిణామాలను గమనించి, త్వరలో తన సమావేశాన్ని నిర్వహించి తదుపరి నిర్ణయాలను ప్రకటిస్తుంది.
*జారీ చేసినవారు -* బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, గుర్నామ్ సింగ్ చారుని, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ ‘కక్కాజీ’, యుధ్వీర్ సింగ్